అమ్మాయి పెళ్లీడు 21 సంవత్సరాలు వచ్చేనాటికి 1 కోటి రూపాయల ఫండ్ సృష్టించాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేయండి..
అమ్మాయి పెళ్లీడు నాటికి ఒక కోటి రూపాయలు ఫండ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా అయితే ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చే నాటికి ఒక కోటి రూపాయల ఫండ్ సులభంగా సృష్టించగలరు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆడపిల్లల తల్లిదండ్రులకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని భారతీయ సమాజంలో తరచూ వినిపించే మాట. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రులకు అతి పెద్ద బాధ్యత ఒకరకంగా చెప్పాలంటే అది జీవితకాల బాధ్యత అని చెప్పాలి. వారు పుట్టినప్పటి నుంచి ఎదిగే క్రమంలో ప్రతినెలా డబ్బు దాచి పెడుతూనే ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డ పెళ్లి కోసమని సర్వస్వం త్యాగం చేయడానికి సైతం వెనకాడరు. అయితే ఒక ప్లానింగ్ ప్రకారం ఆడపిల్ల పుట్టినప్పటినుంచి డబ్బును సరిగ్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే అమ్మాయి మేజర్ అయ్యే నాటికి అంటే 21 సంవత్సరాలు వచ్చేటప్పటికీ, ఒక కోటి రూపాయల ఫండ్ మీ చేతికి వస్తుంది. ఇందుకోసం ఏం చేయాలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీరు ఉద్యోగస్తులైనప్పటికీ లేదా వ్యాపారస్తులైనప్పటికీ ప్రతినెల కొంత మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రతి నెల సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా SIP ప్రాతిపదికన పెట్టుబడి పెట్టడం ద్వారా అమ్మాయి పెళ్లీడుకి వచ్చేనాటికి పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతిలో ఉంటుంది.
ఇప్పుడు అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చే నాటికి ఒక కోటి రూపాయల ఫండ్ తయారు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి ఎప్పటినుంచి ప్రారంభించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాప పుట్టిన మొదటి నెల మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి ప్రారంభిస్తే మంచిది. ఉదాహరణకు నెలకు పదివేల రూపాయలతో మీరు సిప్ ప్రారంభించినట్లయితే, 21 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి. రూ. 1,13,86,742 మీ చేతికి దక్కే అవకాశం ఉంది. అయితే ఇందులో మీరు ప్రతి నెల 10,000 ఇన్వెస్ట్ చేయగా 21 సంవత్సరాలు పూర్తయినాటికి అది 25,20,000 రూపాయలు మాత్రమే అవుతుంది. కానీ కానీ మీరు పెట్టిన పెట్టుబడి పై సంవత్సరానికి కనీసం 12 శాతం రాబడి ఆశించినా 88,66,742 రూపాయలు అదనంగా మీకు దక్కే అవకాశం ఉంది.
అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 25,20,000 (అసలు)+ 88,66,742 (రాబడి) = రూ. 1,13,86,742 అవుతుంది. అయితే సాలీనా 12 శాతం రాబడి అనేది కేవలం అంచనా మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతాయి. ఈ పెట్టుబడులు లాభనష్టాలకు లోబడి ఉంటాయి. కానీ గడచిన 25 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన మార్కెట్లుగా రాణిస్తున్నాయి.
ప్రతి ఏడాది మార్కెట్ క్యాపిటల్ పెరుగుతూ వస్తోంది ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ఎంపికగా చెప్పవచ్చు. నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే రిస్క్ మీరు తీసుకో లేనప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతినెల SIP ప్రతిపదికన క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు మీరు పొందే అవకాశం ఉంది.