MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Deepika Padukone: ఆ విషయంలో భర్తను దారుణంగా వెనక్కు నెట్టేసిన దీపికా పదుకొనే.. ఏం జరిగిందంటే..?

Deepika Padukone: ఆ విషయంలో భర్తను దారుణంగా వెనక్కు నెట్టేసిన దీపికా పదుకొనే.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ టాప్ నటీమణుల జాబితాలో ఆమె చేరిపోయింది. 2007లో 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌ కెరీర్‌ని ప్రారంభించిన తర్వాత దీపిక పదుకొణె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగి పోతోంది. హాలివుడ్ సినిమాల్లో సైతం ఈ భామ తళుక్కుమంటోంది. దాదాపు 15 ఏళ్ల కెరీర్‌లో దీపిక 37 సినిమాల్లో నటించి 52 అవార్డులు గెలుచుకుంది.  

2 Min read
Author : Krishna Adhitya
Published : Apr 28 2023, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image: Getty Images

Image: Getty Images

దీపిక విజయవంతమైన నటి మాత్రమే కాదు. సంపాదన విషయంలో కూడా ఎవరికీ తక్కువ కాదు. తాజా నివేదిక ప్రకారం, దీపికా పదుకొనే తన భర్త రణవీర్ సింగ్ కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నారు. దీపికకు ఎంత ఆస్తి ఉందో మీకు తెలియకపోతే, ఆమె మొత్తం ఆస్తి ఎంత, ఆమె కలెక్షన్‌లో ఏమేం కార్లు ఉన్నాయో తెలుసుకుందాం. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దీపికా పదుకొణె నికర విలువ

దీపికా పదుకొణె ప్రస్తుతం బాలివుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటీమణుల్లో ఒకరు. ప్రస్తుతం కూడా ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు 15-30 కోట్లు తీసుకుంటారు. సినిమాలతో పాటు, దీపిక బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా కూడా చాలా సంపాదిస్తుంది. నివేదికల ప్రకారం, ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల కోసం రూ. 7 నుండి 10 కోట్లు వసూలు చేస్తుంది. 

 

35

సోషల్ మీడియా ద్వారా ఎండార్స్‌మెంట్ల కోసం ఆమె సుమారు 1.5 కోట్లు వసూలు చేస్తుంది. ఆమె వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 24 కోట్లకు చేరువలో ఉంది. దీపిక బ్రాండ్ విలువ 400 కోట్లుగా పేర్కొన్నారు. ఆమె నికర విలువ 366 కోట్లు.

 

45

దీపికా పదుకొణెకు ముంబైలో 4 BHK విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ఖరీదు రూ.16 కోట్లు. ఇది కాకుండా, ఆమె భర్త రణవీర్ సింగ్‌తో కలిసి అలీబాగ్‌లో విలాసవంతమైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది. దీని ఖరీదు రూ.21 కోట్లు. మరోవైపు, దీపిక కార్ల కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఆమె తన సేకరణలో మెర్సిడెస్ మేబ్యాక్, ఆడి A8, ఆడి క్యూ7  బిఎమ్‌డబ్ల్యూ 5 వంటి అనేక ఖరీదైన బ్రాండ్‌ల కార్లను కలిగి ఉంది.

 

55

ఆస్తుల పరంగానూ, ఆదాయం పరంగానూ చూస్తే దీపిక  తన భర్త రణవీర్ సింగ్ కంటే చాలా ధనవంతురాలు. దీపికా పదుకొణె మొత్తం నికర విలువ రూ. 366 కోట్లు. మరోవైపు రణ్‌వీర్ కపూర్ నికర విలువ దాదాపు రూ. 271 కోట్లుగా చెబుతున్నారు. అయితే, దీపిక తన సామర్థ్యం ఆధారంగా పేరు, సంపద  కీర్తి ఇవన్నీ సంపాదించింది. విశేషమేమిటంటే, దీపికా పదుకొనే  రణవీర్ సింగ్ 13 నవంబర్ 2018న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకోవడం విశేషం. .

 

About the Author

KA
Krishna Adhitya
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భార‌త్‌లో అత్యంత వేగంగా న‌డిచే టాప్ 5 రైళ్లు ఇవే.. గంట‌కు ఏకంగా 160 కి.మీల వేగంతో
Recommended image2
DMart: డి-మార్ట్‌లో ఈ 5 వస్తువులు కొనే ముందు ఆలోచించండి.. తొందరపడకండి
Recommended image3
Bank: ఆదివారం బ్యాంకులు ప‌నిచేయ‌నున్నాయి.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved