Business Ideas: ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని బిజినెస్, 6 నెలలు కష్టపడితే చాలు..నెలకు రూ. 2 లక్షలు మీ సొంతం..
భారతదేశంలో నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఇతర అవకాశాల వైపు చూసినప్పుడు మనకు చాలా వరకు పరిష్కారం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా వ్యాపారం చేయాలని అనుకున్నట్లయితే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్ర రుణాలను అందిస్తోంది. ఈ రుణాలను అందుకోవడం ద్వారా మీరు మీ వ్యాపారానికి మూల పెట్టుబడిని పొందవచ్చు.
ముద్రా రుణాలను అత్యంత సులభమైన వాయిదాలలో చెల్లించవచ్చు. ఈ రుణాలపై ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. వడ్డీ కూడా బయట ప్రైవేటు రుణాల కన్నా కూడా చాలా తక్కువ. మీరు కనుక వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మాత్రం, ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ వ్యాపారంలో మంచి లాభం కూడా పొందవచ్చు.
డైరీ వ్యాపారం చేయడం ద్వారా మీరు మంచి లాభం పొందే అవకాశం ఉంది. అయితే డైరీ వ్యాపారానికి గేదెలు, ఆవులు పెంచాల్సి ఉంటుంది. కానీ మీరు ఎలాంటి పశువులును పెంచకుండానే పాల వ్యాపారం ప్రారంభించవచ్చు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా గ్రామాల్లో రైతులు పాడి పశువుల నుంచి తీసుకున్న పాలను పాల కేంద్రాల్లో విక్రయిస్తూ ఉంటారు. తద్వారా వారికి ఆదాయం లభిస్తూ ఉంటుంది.
పాల కేంద్రాల నుంచి పాలను తీసుకొని వెళ్లి వాటిని పలు ప్రక్రియల్లో పాల ప్యాకెట్లుగా మార్చి డైరీ సంస్థలు విక్రయిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం కాలంలో చాలామంది ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా పశువుల నుంచి పితికిన పాలను త్రాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.
మీరు నేరుగా రైతుల వద్ద ప్రతిరోజూ పాలను సేకరించి వాటిని డైరెక్ట్ గా కస్టమర్లకు అందించడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా మీ సమీపంలోని నగరాల్లో కస్టమర్లను పొందాల్సి ఉంటుంది. కస్టమర్లకు నేరుగా ఇంటివద్దె చిక్కటి పచ్చిపాలను అందించడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇందుకోసం పాలు చెడిపోకుండా ఏసీ సౌకర్యం ఉన్నటువంటి కమర్షియల్ ట్రక్ కొనుగోలు చేసుకుంటే మంచిది. పాలను కంటైనర్లలో సేకరించిన అనంతరం, సమయం వృధా కానివ్వకుండా నేరుగా కస్టమర్లకు పాలను కొలత ఆధారంగా విక్రయిస్తే సరిపోతుంది.
ఎందుకంటే సమయం వృధా అయ్యే కొద్దీ పాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఫారం నుంచి కస్టమర్ వద్దకు కేవలం రెండు నుంచి మూడు గంటల్లోగా పాలను చేర్చగలిగితే ఈ వ్యాపారంలో సక్సెస్ కావచ్చు. పాల సేకరణ కోసం సమీపంలోని గ్రామాలను ఎంపిక చేసుకుంటే మంచిది. సుదూర ప్రాంతం నుంచి నగరానికి చేరుకోవడం కష్టంగా మారుతుంది.
సాంప్రదాయ పద్ధతిలో పశుపోషణతో పాటు పాలను కస్టమర్లకు చేరవేయడం అనేది చాలా కష్టమైన పని. అయితే మీరు నేరుగా రైతుల వద్ద నుంచి సేకరించిన పాలను కస్టమర్లకు సమయాభావం లేకుండా చేరవేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.