MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఈ ఒక్క విషయం తెలుసుకోకపోతే మీ వెహికల్ టైర్ పేలిపోయే ప్రమాదం ఉంది

ఈ ఒక్క విషయం తెలుసుకోకపోతే మీ వెహికల్ టైర్ పేలిపోయే ప్రమాదం ఉంది

మీ బైక్ లేదా మీ కారు లో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా టైర్ పేలడం జరిగిందా? ఈ ఒక్క విషయం తెలుసుకుంటే మీరు టైరు పేలడం లాంటి ప్రమాదాల బారిన పడుకుండా ఉంటారు. అదేంటో, దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

3 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Oct 15 2024, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వెహికల్స్ నడిపేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అది కారైనా, బైక్ అయినా చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ వస్తువైనా తయారు చేసేటప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలని ప్రత్యేక సూచనలు ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ చెబుతుంది. దాన్నే మనకు బుక్ లెట్ లా తయారు చేసి ఇస్తారు. అయితే దాన్ని 99 శాతం మంది చదవరు. కేవలం కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది చెప్పింది విని ఉపయోగించేస్తాం. అయితే వారు అన్ని విషయాలు చెప్పరు. చాలా ఇంపార్టెంట్ విషయమైనా చిన్నదే కదా కొన్ని విషయాలను పట్టించుకోరు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అలాంటి ఇంపార్టెంట్ విషయం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మనం సాధారణంగా బైక్ పై కాని, కారు మీద కాని ఎంత స్పీడ్ తో వెళ్తాం. ఓ 70 కి.మీ., 80 కి.మీ., వేగంతో వెళతాం. రోడ్డు ఖాళీగా ఉంటే 100, 120 కి.మీ. కూడా క్రాస్ చేసేస్తాం. ఇదే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ఏ వెహికల్ మీద ఎంత వేగంతో వెళ్లాలన్న విషయం చాలా మందికి తెలియదు. అందువల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టైర్లు పేలడం అనే వాహనం వెళ్లే స్పీడ్ పై ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే నిపుణులు చెప్పే విషయం ఏమిటంటే, కార్లు లేదా బైకుల్లోని టైర్లలో గాలి ఎక్కువున్నా, తక్కువున్నా పేలిపోతాయని చెబుతున్నారు. 
 

35

అసలు వాహనాల టైర్లు పేలిపోవడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే టైర్లలో గాలి ఒత్తిడి. ఏ టైర్ కు ఎంత గాలి పట్టాలో  వెహికల్ కొన్నప్పుడు కంపెనీ ఇచ్చిన మాన్యువల్ లో ఉంటుంది. కారు, బైకులో గాలి తగ్గితే వెంటనే మనం దగ్గర్లోని మెకానిక్ షాప్ కి వెళ్లి గాలి పట్టమని చెబుతాం. మెకానిక్ సిబ్బంది వాహనాన్ని బట్టి గాలిపడుతుంటారు. చాలా కార్ల టైర్లలో 30-35 PSI గాలి ఒత్తిడిని ఎక్కిస్తారు. అయినప్పటికీ కొన్ని కార్లకు 35-40 PSI వాయు పీడనాన్ని మెయింటెన్ చేస్తుంటారు.  టైర్‌లో ఎంత గాలి ఉండాలి అనేది కారు లేదా బైకు మోడల్, టైర్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. 

45

టైర్‌లో గాలి ఒత్తిడిని మెయింటెయిన్ చేయడానికి మీరు ప్రతి రెండు వారాలకు ఒకసారి టైర్ గాలిని చెక్ చేయించాలి. ఇది కాకుండా లాంగ్ డ్రైవ్ కి వెళ్లే ముందు టైర్ ఎయిర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. దీని కోసం మీరు ఎయిర్ ప్రెజర్ గేజ్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లో అనేక రకాల పోర్టబుల్ ఎయిర్ ప్రెజర్ గేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు కారులోనే ఉంచుకోవడం వల్ల అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. 

55

టైర్లు పేలిపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే వెహికల్ స్పీడ్. మీ వాహనం కారు, బైకు ఏదైనా కావచ్చు. కంపెనీతో కూడా సంబంధం లేదు. మీరు వెళ్లే స్పీడ్ ను బట్టి టైర్ ప్రెషర్ కి గురవుతుంది. ఈ ప్రెషర్ ఎక్కువైపోతే టైరు పేలిపోతుంది. మరి ఏ టైరు ఎంత ప్రెషర్ తట్టుకోగలదో తెలుసుకొనేందుకు వాటిని తయారు చేసిన కంపెనీలే ఒక కోడ్ ఇస్తాయి. ఉదాహరణకు 134/76 G 14 75 L ఇలాంటి సీరియల్ నంబర్ ఉంటుంది. వీటిని కంపెనీలు టైర్లపైనే కనిపించే విధంగా ప్రింట్ చేస్తాయి. ఆ కోడ్ చివర ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్ టైర్లలో గాలి ఎంత ఉండాలో ఇండికేట్ చేస్తుంది. 

ఆ ఆల్ఫాబెట్ L అయితే మాక్సిమం స్పీడ్ 120 కి.మీ.  M అయితే 130 కి.మీ, N అయితే 140 కి.మీ., P అయితే 150 కి.మీ., Q అయితే 160 కి.మీ., R అయితే 170 కి.మీ., S అయితే 180 కి.మీ., T అయితే 190 కి.మీ., U అయితే 200 కి.మీ., H అయితే 210 కి.మీ., V అయితే 240 కి.మీ., W అయితే 270 కి.మీ., Y అయితే 300 కి.మీ. స్పీడ్ తో వెళ్లాల్సి ఉంటుంది. ఈ వేగం మించి కారు లేదా బైక్ నడిపితే టైర్లు పేలిపోతాయి. ఇకపై మీ టైరును బట్టి గాలి పట్టించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Recommended image2
Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?
Recommended image3
ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved