పాత కార్లు, బైకులు కొనకండి: ఎందుకంటే..
ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే.. పాత కార్లు, బైకులు కొనుక్కొని వాడుకోవడం. ఎందుకంటే ఆ కాలం నాటి మోడల్ ఇప్పుడు మార్కెట్ లో లేకపోవడంతో పాత వాహనాలనే కొంటున్నారు. అయితే మీరు అలా చేస్తే త్వరలోనే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకో తెలియాలంటే ఈ వివరాలు చూడండి.
సాధారణంగా తక్కువ పెట్టుబడితో మంచి కారు కొనుక్కోవాలనుకుంటే సెకండ్స్ చూస్తాం. ఈ వాహనాలు అవి తయారైన సంవత్సరం ఆధారంగా రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు అమ్ముడవుతాయి. బడ్జెట్ తక్కువ అని పాత కార్లు ఏది పడితే అది కొంటే త్వరలోనే మీరు భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. మీ వాహనాలను ప్రభుత్వాలు సీజ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే రూల్స్ అలా మారిపోతాయి.
పాత వాహనాలను తొలగించాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. కార్లకు ఉన్న 15 సంవత్సరాల లైఫ్ టైమ్ పూర్తయిన వాటిని తర్వలోనే నిలిపివేసేలా చర్యలు తీసుకోనున్నారు. అందువల్ల మీరు పాత కార్లు కొనే ఆలోచనలో ఉంటే మానుకోవడం మంచిది. ఈ విషయాన్ని రవాణా శాఖ అధికారులు కూడా చెబుతున్నారు.
ఈ కారణమే కాకుండా పాత కార్ల వాడకం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది పొల్యూషన్ కంట్రోల్ రూల్స్. ఇవి త్వరలోనే మారనున్నాయి.
పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ మారితే మీ పాత వాహనాలకు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఒకవేళ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ మారితే మీ వాహనం లైఫ్ టైమ్ ని బట్టి అర్హత ధ్రువపత్రం తీసుకోవాల్సి ఉంటుంది. మీ కారు, లేదా బైకు లైఫ్ టైమ్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రాంగ్ ఉంటే ఆ విషయాన్ని కన్పర్మ్ చేస్తూ రవాణా శాఖ అధికారులు సర్టిఫికేట్ ఇవ్వాలి. దాని కోసం అధికారులు ఇక పూర్తిగా యంత్రాలతో మీ కారు లేదా బైకును పరీక్షిస్తారు.
వాహనాలకు పొగ పరీక్ష కూడా ఈ మధ్య బాగా స్ట్రిక్ట్ గా నిర్వహిస్తున్నారు. దీనికి కారణం అదే. పాత వాహనాల సంఖ్య ఎంతలా పెరుగుతోందో చెక్ చేసుకొని కొంత శాతం పాత వాహనాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా 25 ఏళ్లు దాటిన వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని ఆలోచిస్తోంది. ఒకవేళ మీ వెహికల్ లైఫ్ టైమ్ పూర్తయిన తర్వాత కూడా బాగానే వర్క్ చేస్తుంటే ట్రాన్స్ పోర్ట్ అధికారులు టెస్ట్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. అది లేకుండా మీరు మీ పాత వాహనాలు నడపలేరు.
కాలుష్య నిబంధనలకు అనుగుణంగా పాత వాహనాల ఇంజిన్ మరమ్మతు చేయించుకుందామని మీరు ఆలోచిస్తే భారీగా డబ్బు ఖర్చవుతుంది. దీని కన్నా ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు తీసుకొని కొత్త వాహనం కొనుక్కోెవడం మంచి ఆలోచన అవుతుంది. పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీలు అందుతున్నాయి. అందువల్ల పాత వాహనాలు కొనే ఆలోచన విరమించుకొని కొత్తవి, లేటెస్ట్ కార్లు, బైకులు కొనేందుకు ప్రయత్నించండి.