Petrol: రూ. 100, 200లకు పెట్రోల్ ఎందుకు కొట్టించుకోరు? వాస్తవం ఇదే
చాలామంది పెట్రోల్ బంక్‌కి వెళ్లినప్పుడు రౌండ్ ఫిగర్ లకి [రూ.100, 200, 500] పెట్రోల్ కొట్టించుకోరు. వాటికి రూ. 5, 10, 15 అలా ఎక్ట్రా ఆడ్ చేసి ఆయిల్ పోయించుకుంటారు. అలా చేస్తే పెట్రోల్ కరెక్టుగా వస్తుందనో లేక ఎక్కువ వస్తుందనో అనుకుంటారు. నిజంగానే అలా వస్తుందా? ఇందులో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

చాలామంది పెట్రోల్ బంక్ కి వెళ్లినప్పుడు రౌండ్ ఫిగర్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు ఇష్టపడరు. 100 కి బదులు 105, 110, 200 కి బదులు 210, 500లకి బదులు 510 ఇలా ఆయిల్ కొట్టిస్తూ ఉంటారు. ఇది పెట్రల్ బంకులో జరిగే మోసాన్ని నివారించే ఉపాయం అనుకుంటారు చాలామంది. ఇలా కొంటే నిజంగానే ఎక్కువ పెట్రోల్ వస్తుందా?
ఎందుకు అలా?
పెట్రోల్ లేదా డీజిల్ ఇలా కొంటే మోసం జరగదని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే చాలామంది ఇలా ఎందుకు కొంటున్నారు? అసలు రహస్యమెంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగానే కోడ్ సెట్టింగ్
పెట్రోల్ పంపులలో సాధారణంగా 100, 200, 300 లేదా 500 రూపాయలకు ముందుగానే కోడ్‌లను సెట్ చేస్తారు. అంకెల ఎంట్రీ కోసం వన్ బటన్ సిస్టమ్ ఉంటుంది. అక్కడి సిబ్బందికి ఇది ఈజీగా ఉంటుంది. పదే పదే మొత్తం నెంబర్లను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
పెట్రోల్ తక్కువ వస్తుందా?
ఇది గమనించని చాలామందికి సున్నాతో ముగిసే ధరకు తక్కువ పెట్రోల్ ఇస్తున్నారనే అనుమానం కలుగుతుంది. మీటర్‌లో ముందుగానే సెట్ చేయడం వల్ల ఆయిల్ తక్కువ వస్తుందని భావిస్తుంటారు.
ఫ్లో మీటర్
పెట్రోల్ పంపులలో లీటర్ల ఆధారంగా పెట్రోల్ లేదా డీజిల్‌ను కొలవడానికి ఫ్లో మీటర్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఎన్నిలీటర్లకు ఎంత డబ్బు అవుతందనేది ఈ సాఫ్ట్ వేేర్ లెక్కిస్తుంది. ఆయిల్ ధరను బట్టి లీటర్లు లెక్కించి దాన్ని రూపాయాల్లోకి మార్చుతారు.
కచ్చితమైన కొలత
ఈ వ్యవస్థ వల్ల మీరు లీటర్లలో కొన్నా, డబ్బులతో కొన్నా ఖచ్చితమైన లెక్క ఉంటుంది. 100, 200, 300 లేదా 400 రూపాయలకు కొంటే ఆ డబ్బుకు తగ్గ ఆయిల్ వస్తుంది.
అది అవాస్తవం
210, 510, వెయ్యి పదిలకు పెట్రోల్ కొంటే ఎక్కువ వస్తుందనేది పూర్తిగా అవాస్తవం. అక్యూరేట్ గా పెట్రోల్ లేదా డీజిల్ పొందడానికి లీటర్లలో అడగండి. ఆ మేరకు డబ్బు చెల్లించండి. అప్పుడు ఎలాంటి సందేహం ఉండదు.
కొన్నిచోట్ల మోసాలు
కొన్ని పెట్రోల్ బంకులలో మోసాలు జరగవని కాదు. మీటర్‌లో మార్పులు, పైప్‌లైన్‌లో గాలిని కలపడం లేదా కల్తీ చేయడం ద్వారా కొందరు మోసం చేయవచ్చు. మీకు ఏదైనా అనుమానం కలిగితే అక్కడే పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించవచ్చు. ఆ బంకుపై ఫిర్యాదు కూడా చేయవచ్చు.