- Home
- Business
- Business Ideas: ఐటీ జాబ్స్ వదిలి మరీ యూత్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న బిజినెస్ ఇదే, నెలకు రూ. 1 లక్ష సంపాదన
Business Ideas: ఐటీ జాబ్స్ వదిలి మరీ యూత్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న బిజినెస్ ఇదే, నెలకు రూ. 1 లక్ష సంపాదన
బిజినెస్ చేయడమే లక్ష్యంగా ఉందా, అయితే వెంటనే ఓ చక్కటి బిజినెస్ ఐడియా ను అమలు చేయడం ద్వారా మీరు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది అది ఎలాగో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో వ్యవసాయం ద్వారా కూడా చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.

చాలామంది ఐటీ ఉద్యోగులు సైతం, ఉద్యోగం వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు కూడా అలాంటి వ్యవసాయ పద్ధతులను చేపట్టాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. పురుగుమందులు వాడకుండా ఫ్రెష్ ఆర్గానిక్ కూరగాయలు తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయడం అనేది, ఖర్చు తగ్గిస్తుంది, అలాగే మీ రాబడి కూడా పెంచుతుంది. ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ద్వారా ఎలా వ్యాపారం చేయాలో తెలుసుకుందాం.
మీ వద్ద వ్యవసాయ క్షేత్రం ఉన్నట్లయితే, అందులో మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చు. ఆర్గానిక్ వ్యవసాయం చేసే ముందు వ్యవసాయ క్షేత్రంలో, ఆర్గానిక్ ఎరువులతో వేయాల్సి ఉంటుంది. అలాగే సహజ పద్ధతుల్లో కీటక, శిలీంధ్ర నాశనులను వాడాలి. అలాగే ఆర్గానిక్ వ్యవసాయం చేసే సమయంలో, మీరు ఉద్యాన శాఖ నుంచి ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు సూచించిన ప్రమాణాల్లో వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ వ్యవసాయోత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికెట్ లభిస్తుంది.
<h1 itemprop="name">Organic Pesticides</h1>
ఆర్గానిక్ వ్యవసాయం వల్ల అతిపెద్ద ఛాలెంజ్ పురుగు మందులు లేకుండా పెంచడమే. ఎందుకంటే పంటను ఆశించే పురుగులు వస్తూనే ఉంటాయి. వీటిని సహజ పద్దతుల్లోనే ఏరి వేయాల్సి ఉంటుంది. ఇక ఆర్గానిక్ వ్యవసాయంలో సహజపద్ధతులను పాటించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలను కలిస్తే మంచిది. ఇందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అనేక మంది ప్రొఫెసర్లు మీకు సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉంటారు.
ఆర్గానిక్ పంటలను పండించడం ఒక ఎత్తు అయితే వాటిని మార్కెటింగ్ చేసి విక్రయించడం కూడా అతి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే మార్కెట్లో లభించే హైబ్రిడ్ పంటలతో పోల్చితే, ఆర్గానిక్ పంటలు కాస్త రంగు తక్కువగా ఉంటాయి. నిగనిగలాడుతూ కనిపించవు. కాస్త మచ్చలు, కొన్ని పుచ్చులు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఆర్గానిక్ పంటలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విషయం ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే వారు మీ పంటలను కొనేందుకు ముందుకు వస్తారు.
ఇక మీరు హోల్సేల్ మార్కెట్లో కూరగాయలను విక్రయిస్తే, మీకు గిట్టుబాటు కాకపోవచ్చు. కావున మీరు నేరుగా కస్టమర్లకి విక్రయించడం ద్వారా, లాభం లభిస్తుంది. ఇందుకోసం మీరు ఒక వాహనం ఏర్పాటు చేసుకొని, కూరగాయలను, కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ల్లో విక్రయించడం ద్వారా, మీరు ఎటువంటి దళారులు లేకుండానే, చక్కటి లాభం పొందే వీలుంది
ఏదైనా వ్యాపారం లో బిజినెస్ టు కస్టమర్ పద్ధతి పాటిస్తే, మీకు చక్కటి లాభాలు వస్తాయి. మీ పంటలో కనీసం 50 శాతం ఈ పద్ధతిలో విక్రయిస్తే, చాలా లాభం పొందే వీలుంది.