Business Ideas: మహళలు మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు..నెలకు రూ. 50 వేలు మీ సొంతం..ఎలాగో తెలిస్తే షాక్ తింటారు
మహిళలు వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా. అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉండి చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రతినెల 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయలు మీటి సొంతం చేసుకునే అవకాశం ఉంది. అలాంటి ఓ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మహిళలు మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు ఇందుకోసం మీరు కేవలం ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు. మీరు ప్రతి నెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎందుకోసం మీరు చేయవలసిందిగా ఒకటే ఒకవేళ మీ ఇంటి పైన లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉన్నట్లయితే, అందులో మీరు గార్డెనింగ్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉదాహరణకు మీ ఇంటి డాబాపైన మిద్దె తోటలను పెంచాలి అనుకున్నట్లయితే అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. . మిద్దె తోటను ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు మొక్కలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అదే విధంగా మీరు ఉపయోగించే పద్ధతులను మొబైల్ ఫోన్ ద్వారా రికార్డు చేయండి. అనంతరం ఆ వీడియోలను చక్కగా ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే మహిళలు ఎంచక్కా ప్రతినెల ఆదాయం పొందే అవకాశం ఉంది.
యూట్యూబ్లో గార్డెనింగ్ వీడియోలు చాలా ట్రెండింగ్ లో ఉంటాయి. చాలామంది గార్డెనింగ్ వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే ఎంచక్కా అర ఎకరం నుంచి పావు ఎకరం స్థలంలో మంచి తోటను ఏర్పాటు చేసుకొని పువ్వులు పండ్లు అరుదైన వృక్షాలను పెంచడం ద్వారా అలాంటి వీడియోలను చూసేందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తద్వారా మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు యూట్యూబ్ లో మీరు ఫేమస్ అయిన తర్వాత మీరు ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను విక్రయించినట్లయితే మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇక యూట్యూబ్ ఛానల్ ఎలా స్థాపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు జిమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి యూట్యూబ్లోకి వెళ్లి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం మీ యూట్యూబ్ ఛానల్ కు ఒక చక్కటి పేరును పెట్టుకుని లోగో కూడా డిజైన్ చేయించుకోండి. తద్వారా మీరు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకోవచ్చు. వరుసగా వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా మీరు పెద్ద ఎత్తున వ్యూస్ కూడా సంపాదించుకోవచ్చు.
ఇక యూట్యూబ్ ద్వారా వీడియోలకు డబ్బులు ఎలా వస్తాయి అని మీరు ఆలోచిస్తున్నారా. అయితే మీరు చింతించవద్దు మీరు చేసే వీడియోలను ప్రేక్షకులు చూడడం ద్వారా వాటిపై ప్లే అయ్యే అడ్వర్టైజ్మెంట్లను బట్టి మీకు యూట్యూబ్ ఆదాయాన్ని షేర్ చేస్తుంది. . అవి నేరుగా మీ బ్యాంకు ఎకౌంట్లోకి వచ్చి పడతాయి. తద్వారా మీరు ఆదాయం సంపాదించుకోవచ్చు.