MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: సిటీలో ఉద్యోగం కోసం వెయిట్ చేసే బదులు, ఉన్న ఊళ్లో ఈ బిజినెస్‌ చేస్తే ఏడాదికి రూ.20 లక్షలు మీవే

Business Ideas: సిటీలో ఉద్యోగం కోసం వెయిట్ చేసే బదులు, ఉన్న ఊళ్లో ఈ బిజినెస్‌ చేస్తే ఏడాదికి రూ.20 లక్షలు మీవే

నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే బదులు, చక్కటి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటే, ప్రతి నెల మంచి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా గ్రామీణ యువత వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని వ్యాపార అవకాశాలుగా మార్చుకుంటే ఉన్న ఊరిలోనే చక్కటి చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Apr 25 2023, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్రామీణ యువత ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా…గొర్రెల పెంపకం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే మార్గం ఉంది.  గొర్రెల పెంపకానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గొర్రె పిల్లల పంపిణీని ప్రారంభించింది.  అయితే అటు కేంద్ర ప్రభుత్వం కూడా గొర్రెలు పెంచుకోవడానికి నాబార్డు ద్వారా రుణాలను అందిస్తోంది.  ఈ రుణాలపై సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది నాబార్డ్ రుణం కోసం ముందుగా మీ ప్రాజెక్టు వివరాలను పూర్తిగా మీ సమీప నాబార్డు గారికి సమర్పించాల్సి ఉంటుంది అప్పుడు మీకు సబ్సిడీ లభిస్తుంది. 
 

26

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల పెంపకం సాంప్రదాయ పద్ధతిలో చేసే కన్నా కూడా ఆధునిక పద్ధతులను అవలంబిస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది  అయితే ముందుగా గొర్రెల పెంపకంలో మెలకువలను నేర్చుకోవాల్సి ఉంటుంది.  తెలంగాణ రాష్ట్రంలోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గొర్రెల పెంపకానికి సంబంధించి నిపుణులు పలు సూచనలు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు.  తెలంగాణ రాష్ట్రంలో దక్కన్ జాతి గొర్రె పిల్లలను పెంచడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జాతికి చెందినటువంటి గొర్రె పిల్లలను పెంచుతారు వీటి మాంసం ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది 
 

36
Sheep dog

Sheep dog

దక్కన్ జాతి గొర్రె పిల్లలు  నల్లగా పొట్టిగా ఉంటాయి వీటి నుంచి ఉన్ని మాంసం లభిస్తుంటాయి ఇక గొర్రెల ఫామ్ లో ప్రారంభించాలి అనుకుంటే అర ఎకరం స్థలంలో 30 నుంచి 50 వరకు ఆడ గొర్రె పిల్లలను రెండు పొట్టేళ్లతో ప్రారంభించాల్సి ఉంటుంది వీటిని పగటిపూట ఖాళీ భూముల్లోనూ బంజరు భూముల్లోనూ తిప్పాలి ఎక్కువసేపు పశువుల కొట్టాన్ని ఏర్పాటు చేసుకొని కాస్త ఎత్తైన ప్రదేశంలో గొర్రెలను ఫారం కట్టుకుంటే మంచిది. సమీపంలో పచ్చికబయళ్ళు బంజరు భూములు ఉంచుకుంటే మంచిది చుట్టూ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వాడితే మంచిది తద్వారా కుక్కలు వేట కుక్కలు తోడేళ్లు నక్కలు ఇతర అటవీ జంతువులు దొంగలు రాకుండా రక్షణ ఉంటుంది
 

46

గాలి ప్రసరించేలా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పశువైద్యులతో  ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తూ ఉండాలి. గొర్రెలకు జొన్న, మొక్కజొన్న, రాగి, సబ్జా వంటి ధాన్యాలకు చెందిన గడ్డిని పెడితే మంచిది. అలాగే అలసంద, పిల్లి పెసర, సుబాబుల్ స్థాయిలో వంటిగ్రాసాలను కూడా పెట్టవచ్చు. అయితే గొర్రె పిల్లలకు గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడితే మంచిది. . అలాగే వేరుశనగపొట్టు ఉలవపట్టు లేపడం కూడా మంచిది 
 

56

ఆడ గొర్రెలు 8 నుంచి 12 మాసాలకు ప్రత్యుత్పత్తికి సిద్ధమవుతాయి.  గొర్రె పిల్లలను పెట్టడం ప్రారంభిస్తాయి గొర్రె పిల్ల పుట్టిన తరువాత 16 వారాల వరకు తల్లిపాలు తాగనివ్వాలి. అలాగే గొర్రె పిల్లలకు ఎప్పటికప్పుడు నట్టల మందులను ఇస్తూ ఉండాలి. మూడు నెలల తర్వాత గొర్రె పిల్లలకు గడ్డి తినడం అలవాటు చేయాలి ఒక్కో గొర్రె కనీసం రెండు పిల్లలు పెడుతుంది. 
 

66

మీ సమీపంలోని మార్కెట్ సదుపాయాలను చూసుకోవాల్సి ఉంటుంది.  నేరుగా కస్టమర్లకు విక్రయించడం ద్వారా మీరు ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంది. అందుకే ఆధునిక పద్ధతుల్లో మీట్ షాపును ఏర్పాటు చేసుకొని పట్టణ ప్రాంతాల్లో విక్రయించడం ద్వారా అధిక మొత్తంలో లాభం పొందవచ్చు. వ్యాపారులకు అమ్మడం ద్వారా మీరు కొత్తిమీర నష్టపోయే అవకాశం ఉంది. కనుక మీరే నేరుగా మీ వ్యాపారంలో కనీసం 30% గొర్రెలను మీరు ఏర్పాటు చేసిన మీట్ షాప్ ద్వారా అమ్మినట్లయితే చక్కటి లాభం పొందే అవకాశం ఉంది.

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Diesel Price: లీటరుకు రూ. 28 పెరుగుతుందా? పెట్రోల్ ధరల పెంపు పై కేంద్రం ఏం చెప్పిందంటే?
Recommended image2
Apartment: అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటే కొన్ని ఏళ్ల తర్వాత దాని విలువ తగ్గిపోతుందా.? మీ కళ్లు తెరిపించే నిజం..
Recommended image3
Money: కేవలం రూ. 10 వేలు కడితే చాలు.. జీవితాంతం మీరు కట్టిన డబ్బుకు డబుల్ వస్తుంది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved