- Home
- Business
- Business Ideas: నేపాల్ వెళ్లి ఫ్రీగా ఈ పురుగులను ఓ కిలో తెచ్చి అమ్మేస్తే చాలు అక్షరాలా రూ. 70 లక్షలు మీ సొంతం
Business Ideas: నేపాల్ వెళ్లి ఫ్రీగా ఈ పురుగులను ఓ కిలో తెచ్చి అమ్మేస్తే చాలు అక్షరాలా రూ. 70 లక్షలు మీ సొంతం
మీకు షార్ట్ టైంలో డబ్బు సంపాదించాలని ఉందా.. అయితే హిమాలయాలకు వెళ్ళండి.. అదేంటి హిమాలయాలకు వెళ్లి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా.ఇక్కడి ఫోటోలో ఎండు మిరపకాయల కనిపిస్తున్న ఈ వింత పదార్థాన్ని తెచ్చుకుంటే చాలు మీరు ఈజీగా కోటీశ్వర్లు అయిపోవచ్చు.

ఎండు మిరపకాయల్లాగా కనిపిస్తున్న ఈ వింత పదార్థం ధర ఒక కిలో సుమారు 70 లక్షలు రూపాయలు. ఒక గ్రాము విలువ అయితే దాదాపు 7000 రూపాయలు. ఈ పదార్థంలో ఏం స్పెషాలిటీ ఉందా అని ఆలోచిస్తున్నారా.. దీన్ని హిమాలయన్ వయాగ్రా (Himalayan Viagra) అని పిలుస్తారు. లైంగిక సంబంధిత వ్యాధులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని చైనా లో పేరు ఉంది. వీటికి చైనా తో పాటు కొరియా, థాయిలాండ్, జపాన్ వంటి దేశాల్లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది.
నిజానికి ఇక్కడ మిరపకాయలులా కనిపిస్తున్న ఈ వింత పదార్థం ఓ గొంగళి పురుగు. హిమాలయాల్లో సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఈ గొంగళి పురుగులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ గొంగళి పురుగులు ఓ వింత ఫంగస్ వల్ల చనిపోయి ఎండిపోతుంటాయి. అలా ఎండిపోయిన ఈ పురుగులను హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు. ఈ ఎండిపోయిన పురుగులతో అనేక లైంగిక సంబంధిత ఔషధాలను తయారు చేస్తారు.
మే జూన్ నెల వచ్చిందంటే చాలు విదేశాల నుంచి సైతం చాలామంది నేపాల్ భూటాన్ ఉత్తరాఖండ్, సిక్కిం ఇలా హిమాలయ పర్వతాలు ఉన్న ప్రదేశాలకు వచ్చి ఈ హిమాలయన్ వయాగ్రా పురుగులను సేకరిస్తూ ఉంటారు. మీ అదృష్టం బాగుంది ఒక కిలో పురుగులు కనుక దొరకాయి అనుకుంటే. అక్షరాల 70 లక్షలు మీ సొంతం అవడం ఖాయం.
కానీ ఒక్కోసారి ఈ పురుగుల వేటలో ప్రాణాలకు తెగించి మరి పర్వతాలు ఎక్కాల్సి ఉంటుంది. అందుకే ఈ రిస్క్ తీసుకునేందుకు చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ స్థానికులతో కలిసి చాలామంది విదేశీయులు ఈ పురుగులను సేకరించే పనిలో పడుతుంటారు. ఒక కిలో బంగారం కన్నా కూడా ఈ పురుగుల ధర చాలా ఎక్కువగా ఉంది.
అయితే ఈ హిమాలయన్ వయాగ్రా వేటలో ఒక కిలో పురుగులను సేకరించడం అనేది చాలా కష్టమైన పని, అంతే కాదు వీటికి సరైన మొత్తంలో ధర లభించాలన్నా కూడా, కొనుగోలుదారులు ఎవరో ముందే గుర్తించుకోవాలి.
హిమాలయన్ వయాగ్రా పురుగులు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువగా లభించడం లేదు. వీటి జాతి క్రమంగా అంతరిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి ధర మరింత పెరుగుతోంది. ఈ పురుగులను ఔషధాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇది కేవలం లైంగిక సామర్థ్యం కోసం మాత్రమే కాదు. క్యాన్సర్, డయాబెటిస్, ఆస్తమా సహా పలు వ్యాధులను తగ్గించుకునేందుకు వీటిని విరివిగా వినియోగిస్తు ఉంటారు.