Business Ideas: ఉన్న ఊరిలోనే అతి తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే నెలకు 1 లక్ష మీ సొంతం..
నిరుద్యోగులారా ఉద్యోగం కోసం ఎదురుచూసి చూసి విసుకు చెందుతున్నారా అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి ఒక చక్కటి వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీరు ప్రతి నెల భారీ ఎత్తున ఆదాయం పొందే అవకాశం ఉంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల పెద్ద ఎత్తున ఆదాయం పొందే అవకాశం ఉంది అలాంటివి బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్రేక్ ఫాస్ట్ టిఫిన్ సెంటర్ ప్రారంభించడం ద్వారా మీరు చక్కటి మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు ప్రజలు బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు చేసుకున్నారు ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే అని డాక్టర్లు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ఉదయం పూట అల్పాహారం తీసుకునేందుకు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకునేందుకు టిఫిన్ సెంటర్ ప్రారంభించడం ద్వారి మంచి ఆదాయం పొందవచ్చు. నిజానికి టిఫిన్ సెంటర్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ ఒకసారి కస్టమర్ మీ రుచికి అలవాటు అయ్యాడు అంటే ఏళ్ల తరబడి అదే టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా టిఫిన్ సెంటర్ పెట్టుబడి విషయానికి వచ్చినట్లయితే. చిన్న తోపుడు బండి నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు మీరు టిఫిన్ సెంటర్ ను ఓపెన్ చేసుకోవచ్చు. . మీరు ఉన్న ప్రాంతంలో జనాభా, అదేవిధంగా డిమాండ్ ను అంచనా వేసుకొని టిఫిన్ సెంటర్ ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
ఇక మీరు చిన్న స్థాయిలో టిఫిన్ సెంటర్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఒక లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. టిఫిన్ మెనూ విషయానికి వచ్చినట్లయితే ఇడ్లీ, వడ, దోశ, పూరి, బోండా వంటివి అందుబాటులో ఉంచినట్లయితే జనం ఎక్కువగా తినే అవకాశం ఉంది.
బ్రేక్ ఫాస్ట్ టిఫిన్ సెంటర్ కోసం మీరు ఒక జన సమర్థం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటే మంచిది. అలాంటి ప్రదేశంలో అయితేనే మీకు బ్రేక్ ఫాస్ట్ సెంటర్ వర్కౌట్ అవుతుంది. వర్కర్స్ మీద ఆధారపడి మీరు టిఫిన్ సెంటర్ నడిపినట్లయితే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు స్వయంగా టిఫిన్ తయారు చేయడంలో ప్రావీణ్యం ఉన్నవారైతే నే ఈ వ్యాపారంలో లాభదాయకంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
ముడి సరుకులు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే నాణ్యత క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదు. శుభ్రత విషయంలో కూడా అసలు రాజీ చెందకూడదు. అప్పుడే మీరు ఈ వ్యాపారంలో రాణిస్తారు. ఉదాహరణకు మీరు మీ గ్రామంలోనే టిఫిన్ సెంటర్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీ గ్రామం జనాభాను అంచనా వేసుకొని టిఫిన్ సెంటర్ ప్రారంభించినట్లయితే, దాదాపు పెట్టుబడి పైన రెండింతలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.