- Home
- Business
- Business Ideas: మహిళలు మీ వంటగదిలో రోజకు 2 గంటలు కష్టపడితే చాలు..నెలకు రూ. 1 లక్ష సంపాదించే అవకాశం..
Business Ideas: మహిళలు మీ వంటగదిలో రోజకు 2 గంటలు కష్టపడితే చాలు..నెలకు రూ. 1 లక్ష సంపాదించే అవకాశం..
మహిళలు మీరు ఇంటి వద్ద ఉండే మంచి బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా. తద్వారా మీ నెల వారీ ఇంటి ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నారా. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే ఒక మంచి బిజినెస్ ప్లాన్ ద్వారా మీరు ఆదాయం సంపాదించడం ప్రారంభించండి. తద్వారా మీ నెలవారీ ఖర్చుల భారాన్ని క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మంచి బిజినెస్ ఐడియాను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫుడ్ బిజినెస్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా మహిళలు ఇంటి వద్ద ఉంటూనే కేవలం ఒక గదిలో కాస్త సమయం కేటాయిస్తే చాలు నెలకు ఒక లక్ష రూపాయల వరకు సంపాదించుకునే వీలుంది. దీనికి సంబంధించిన ఓ బిజినెస్ ఐడియాను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని ప్రతినెల చక్కటి ఆదాయాన్ని పొందండి.
రాత్రిపూట భోజన సమయంలో అన్నం తినవద్దని చాలామంది డాక్టర్లు డైటీషియన్లు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల రక్తంలో షుగర్ పెరుగుతుందని అందుకే అన్నం బదులుగా ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి చిరుధాన్యాలు అలాగే ఇతర ధాన్యాలను తినాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రాగులు సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలతో చేసిన చపాతీలను తినమని పలువురు డైటీషియన్లు సలహా ఇస్తున్నారు.
ముఖ్యంగా చిరు ధాన్యాలతో చేసిన చపాతీలు, పుల్కాలు తినడం వల్ల బరువు తగ్గడమే కాదు శరీరానికి అనేక పోషక పదార్థాలు కూడా అందుతాయి. ఇలా చిరుధాన్యాలతో చేసిన చపాతీలు పుల్కా తయారైన మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది. ప్రతిరోజు సాయంత్రం చిరుధాన్యాలతో చేసిన రోటీలను విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది.
ముందుగా మీరు ఇంట్లోనే చిరుధాన్యాలతో చేసిన చపాతీలను ఒక హాట్ ప్యాక్ లో ప్యాక్ చేసుకొని ఏదైనా మంచి కమర్షియల్ సెంటర్లో విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది. లేదా మీరే ఒక షాపును రెంటుకు తీసుకొని అక్కడ రోటీ పాయింట్ను ప్రారంభించి మంచి ఆదాయం పొందవచ్చు. లైవ్ లోనే మీరు చపాతీలను తయారు చేసి అప్పటికప్పుడే ప్యాక్ చేసి విక్రయించడం ద్వారా కస్టమర్లు పెద్ద ఎత్తున మీ దగ్గర రోటీలను తినేందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విధంగా చేయాలంటే స్థానికంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. రోటీలతోపాటు కొన్ని రకాల కూరలు, పప్పు కూడా తయారు చేసుకుంటే మంచిది. . మీ షాపులోనే సెల్ఫ్ సర్వీస్ ద్వారా తినే అవకాశం కల్పిస్తే మరింతమంది కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది.
ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడితే చాలు రోజుకు కనీసం 5000 నుంచి పదివేల వరకు సంపాదించుకునే వీడింది ఈ లెక్కన నెలకు కనీసం ఒక లక్ష రూపాయలు వెనకేసుకునే అవకాశం లభిస్తుంది.
నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.