MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: వేసవిలో చల్లగా ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ. 50 వేలు సంపాదించడం పక్కా..ఇంకెందుకు ఆలస్యం..

Business Ideas: వేసవిలో చల్లగా ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ. 50 వేలు సంపాదించడం పక్కా..ఇంకెందుకు ఆలస్యం..

సమ్మర్ సీజన్లో మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా. అయితే ఈ వేసవిలో మీరు ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా ఐస్ అనేది  అన్ని సమయాలలోనూ, ముఖ్యంగా వేసవిలో అధిక డిమాండ్ ఉంటుంది. నగరం, గ్రామం అనే తేడా లేకుండా ప్రతిచోటా ఐస్ క్యూబ్స్ కు డిమాండ్ ఉంటుంది. మీరు ప్రాంతంలో ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించవచ్చు. 

Krishna Adhitya | Published : Apr 27 2023, 05:59 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

ఈ రోజుల్లో మీరు చాలా ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీలను చూడవచ్చు. అయినా దానికి డిమాండ్ తగ్గడం లేదు. ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి మీరు స్థానిక మునిసిపాలిటీ నుంచి అనుమతి పొందాలి. మీ ఫ్యాక్టరీ రిజిస్టర్ అయి ఉండాలి. ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి మీకు ఫ్రీజర్ అవసరం.మీరు వివిధ ఆకారాలు, డిజైన్లలో ఐస్ క్యూబ్‌లను తయారు చేయవచ్చు. 
 

24
money

money

ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి? : 
ఐస్‌ క్యూబ్‌ ఫ్యాక్టరీని నెలకొల్పాలంటే మొదట్లో రూ. 1 లక్ష రూపాయలు ఖర్చు చేయాలి. మీరు డీప్ ఫ్రీజర్‌ను కొనుగోలు చేయాలి. దీని ధర 50,000 రూపాయల నుండి మొదలవుతుంది. ఇది కాకుండా మీరు కొన్ని అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలి. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతున్నప్పుడు మీరు మరిన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు.  ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి ముందు, మీరు మార్కెట్ గురించిన సమాచారాన్ని పొంది ఉండాలి. మీ ఫ్యాక్టరీ సిద్ధంగా ఉన్న ఐస్ క్యూబ్‌ను ఎక్కడ విక్రయించాలో మీరు తెలుసుకోవాలి. 
 

34
Asianet Image

వేసవిలో ఐస్ క్యూబ్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే పెళ్లిరోజుల్లో ఐస్ క్యూబ్ బిజినెస్ బాగా సాగుతుంది. బార్లు, రెస్టారెంట్లకు కూడా ఐస్ క్యూబ్స్ డిమాండ్ ఉంటుంది. జనవరి నుండి జూన్ చివరి వరకు మీరు చాలా వరకు లాభపడవచ్చు. అలాగే మీరు అందించే ఐస్ క్యూబ్ నాణ్యత కూడా ముఖ్యం. 1 లక్ష ప్రారంభ పెట్టుబడితో మీరు నెలకు రూ. 50 వేల వరకు లాభం పొందవచ్చు. వేసవి, పెళ్లిళ్ల సీజన్‌లో మీరు హాయిగా నెలకు 50 వేల రూపాయలు సంపాదించవచ్చు.

44
Asianet Image

ఐస్ క్యూబ్ విక్రయాల కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న వ్యాపారవేత్తలు కొనుగోలు కోసం మీ ఫ్యాక్టరీకి వస్తారు. మీరు ఫ్యాక్టరీ సిద్ధంగా ఉన్న ఐస్ క్యూబ్‌ని ఐస్‌క్రీమ్ షాప్, హోటల్, రెస్టారెంట్, ఫ్లవర్ షాప్, మాంసం, చేపల దుకాణాలకు అమ్మవచ్చు. సొంతంగా ఫ్యాక్టరీ ప్రారంభించి చేతులు దులుపుకుంటే అమ్మకాలు జరగవు. మీ ఫ్యాక్టరీని ప్రచారం చేయడం ముఖ్యం. అందుకు మీ సమీపంలో పోస్టర్లను బ్యానర్లను తగిలించి ప్రచారం చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుంది. 

Krishna Adhitya
About the Author
Krishna Adhitya
 
Recommended Stories
Top Stories