MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Business Ideas: ఒక ఎకరం ఉంటే చాలు ప్రతీ ఏడాదికి రూ. 6 లక్షలు వెనకేసుకోవచ్చు..ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు..

Business Ideas: ఒక ఎకరం ఉంటే చాలు ప్రతీ ఏడాదికి రూ. 6 లక్షలు వెనకేసుకోవచ్చు..ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు..

ఉన్న ఊరిలోనే మీరు మీ వ్యవసాయ క్షేత్రంలోనే మంచి ఆదాయం పొందాలని భావిస్తున్నారా అయితే మీ ప్రాంతంలో నీటి వసతులు సరిగా లేకపోయినా సరే ప్రతి నెల లక్షల్లో ఆదాయం  పొందే ఓ పంట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేవలం ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఈ పంట వేయడం ద్వారా మీరు ప్రతి నెల లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Aug 24 2023, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డ్రైఫ్రూట్స్ లో అందరికీ ఇష్టమైనటువంటి, పండు ఏదైనా ఉందంటే అది ఖర్జూరం అనే చెప్పాలి. ఖర్జూర పంట ఎక్కువగా  అరబ్ దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పంటను మన దేశంలో కూడా విజయవంతంగా సాగు చేస్తున్నారు. తద్వారా దేశీయంగానే ఖర్జూర పంటకు ఉన్న డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి  ఇక్కడ లభిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మొత్తం మార్కెట్ లోనే ఉత్పత్తి అయ్యే 38 శాతం ఖర్జూర పంటను భారతదేశమే దిగుమతి చేసుకుంటుంది. అంటే ఖర్జూర పంటకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో కేవలం గుజరాత్ రాజస్థాన్ వంటి ప్రదేశాల్లోనే ఈ ఖర్జూర పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు తీసుకున్నటువంటి కొన్ని ప్రయోగాల ఫలితంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో సైతం ఖర్జూర పంట సక్సెస్ ఫుల్ గా సాగవుతోంది. దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు కూడా మనకు లభిస్తున్నాయి. 
 

36

చాలామంది రైతులు ఖర్జూరం చెట్లను నాటి ఖర్జూర పంటను ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించి మంచి ఆదాయం పొందుతున్నారు.  తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా,  రంగారెడ్డి జిల్లా,  నల్లగొండ జిల్లాలో  కొంతమంది రైతులు ఖర్జూర పంటను  ఉత్పత్తి చేస్తున్నారు.  హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖర్జూర పంట గురించి నిపుణులు సలహాలు అందిస్తున్నారు. . వారి నుంచి మెలకువలను నేర్చుకోవచ్చు. 

46

 ఇక ఖర్జూర పంట విషయానికి వచ్చినట్లయితే మీ వద్ద అర ఎకరం నుంచి ఒక ఎకరం స్థలం ఉన్నప్పటికీ ఈ చెట్లను రాట్టుకోవచ్చు అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్న సమాచారం ప్రకారం ఖర్జూర తోట సాగు చేయాలంటే మొదటి సంవత్సరం పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా మొక్కలు కొనడం వాటిని నాటడం డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాల్ చేయడం ఇలా ఎకరానికి దాదాపు 5 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని చెబుతున్నారు నాలుగో ఏడాది నుంచి రాబడి మొదలవుతుందని సూచిస్తున్నారు
 

56

ఎకరానికి 200 నుంచి 250 మొక్కలు నాటవచ్చని అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్నారు. ఒక్క మొక్క సుమారు 3000 రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఖర్జూర పంటకు పెద్దగా తడి అవసరం లేదు నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో కూడా పెరుగుతుంది.  అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో హెక్టార్కు 2 లక్షల రూపాయల వరకు రాయితీ కూడా అందిస్తున్నట్లు చెబుతోంది ఇందుకోసం రైతులు ఉద్యాన శాఖను  సంప్రదించాల్సి ఉంటుంది
 

66

మార్కెట్లో ఒక కిలో ఖర్జూరం ధర కనీసం 150 రూపాయలు ఉంటుంది. ఒకటన్ను ధర 1 లక్ష రూపాయల పైనే ఉంటుంది. ఎకరాకు కనీసం నాలుగు టన్నుల పంట వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసినట్లయితే సంవత్సరానికి కనీసం ఐదు లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం రాబడి పెరిగే అవకాశం ఉంది ఒక్కో చెట్టుకు ఏడాదికి పదివేలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: బంగారం ధరలపై దిగుమతి సుంకం ఎఫెక్ట్...దిగొచ్చిన పసిడి
Recommended image2
September 1 Rule Changes: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ సిలిండర్, ఐటీఆర్, ఎఫ్‌డీపై బిగ్ అప్‌డేట్
Recommended image3
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved