Business Ideas: ఫ్రాంచైజీ మోడల్ ద్వారా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఫ్రాంచైజీ బిజినెస్ ద్వారా వ్యాపారం చేయాలని భావిస్తున్నారా… తద్వారా సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా.. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు భారీ మొత్తంలో మోసపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు పెద్ద ఎత్తున డబ్బు కూడా నష్టపోతారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చాలామంది ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా మంచి వ్యాపారం చేయవచ్చని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఫ్రాంచైజీ ల కోసం కూడా వెతుకుతూ ఉంటారు. మీరు కూడా మంచి ఫ్రాంచైజీ ద్వారా వ్యాపారం చేయాలి అనుకుంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు లక్షలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉండదు. తాజాగా ఈ మధ్యకాలంలో ఫ్రాంచైజీ పేరిట చాలామంది మోసాలు చేస్తున్నారు. మోసపూరితమైన ప్రకటనలోను నమ్మి యువత లక్షలాది రూపాయలను ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోతున్నారు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు ఎంబీఏ చాయ్ వాలా. దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లతో, ఇది దాదాపు ప్రతి పెద్ద, చిన్న నగరంలో స్థిరపడింది ప్రజాదరణ పొందింది. MBA చాయ్ వాలా వ్యవస్థాపకుడు ప్రఫుల్ బిల్లోర్, ఇంత విజయాన్ని సాధించిన వెనుక ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్ కారణం అని చాలామంది చెబుతున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది ఎంబీఏ చాయ్ వాలా బిజినెస్ మోడల్ మొత్తం మోసం అని ఫ్రాంచైజీ పొందిన యువకులు ఆరోపిస్తున్నారు. తమ వద్ద నుంచి పది లక్షల చొప్పున వసూలు చేసి రోజుకు 10000 సంపాదించవచ్చని కంపెనీ హామీ ఇచ్చిందని వాళ్లంతా వాపోతున్నారు.
ఎంబీఏ చాయ్ వాళ్ళ బిజినెస్ మోడల్ నిజానికి సోషల్ మీడియాలో చాలా ప్రచారం పొందింది. అది చూసి చాలామంది నిరుద్యోగులు తమ గ్రామాల్లో చాయ్ బిజినెస్ ప్రారంభించి. రోజుకు పదివేలు సంపాదించవచ్చని అనుకున్నారు. కానీ తమ పెట్టుబడిన పెట్టుబడికి కనీస డబ్బులు కూడా ఖర్చులు కూడా రావడంలేదని వాపోతున్నారు. దీంతో ఎంబీఏ చాయ్ వాలా బిజినెస్ అంతా ఓ మోసమని సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. మరి ఫ్రాంచైజీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత పెట్టుబడి పెట్టవచ్చు లాంటివి తెలుసుకుందాం.
నిజానికి ఫ్రాంచేసి మోడల్ ద్వారా బిజినెస్ చేయడం అనేది పూర్తిగా నష్టదాయకం అని కొట్టి పారేయలేము. మీరు ఎంపిక చేసుకున్న కంపెనీ బ్రాండ్ నేమ్ మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. అందుకని ముందుగా మీరు ఫ్రాంచైజీ తీసుకున్నట్లయితే ఆ కంపెనీ బ్రాండ్ నేమ్ జనాల్లో ఎంత ముందుకు వెళ్తుందో అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఉత్పత్తికి జనాల్లో డిమాండ్ ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. అలాగే మీ పెట్టుబడిని నిజంగా తిరిగి వస్తుందా.. లేదో అధ్యయనం చేయాలి.
దీంతో పాటు ఫ్రాంజైజీ మోడల్ నిర్వాహకుల నిబద్ధతను కూడా పరిశీలించాలి. లిస్టెడ్ కంపెనీల ఫ్రాంచైజీలు అయితే కొంత, రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలను కూడా పూర్తిగా చదవాలి. దీంతో పాటు ఫ్రాంచైజీ మోడల్ సక్సెస్ అయ్యేందుకు మొదటి మెట్టు క్వాలిటీ. మాతృసంస్థ ఎలాంటి క్వాలిటీ ఇస్తుందో మీరు కూడా అదే క్వాలిటీ మెయిన్ టెయిన్ చేయాలి.