Business Ideas: మహిళలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండానే నెలకు రూ. 1 లక్ష సంపాదించుకునే అవకాశం..
మహిళలు వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా, అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఓ మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. అలాంటి ఓ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా ఫుడ్ బిజినెస్ లో మంచి లాభం లభిస్తుందని అందరూ అంటారు. మంచి నాణ్యత అలాగే పరిశుభ్రత రుచి మైయిన్ టెయిన్ చేసినట్లయితే, మీరు ఫుడ్ బిజినెస్ లో చక్కగా రాణించవచ్చు. రానున్న మూడు నెలల కాలంలో మనకు ఫెస్టివల్స్ భారీగా జరగనున్నాయి. వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు నాలుగు నెలల పాటు పండగలు వస్తాయి. ఈ పండగ వేళ పిండి వంటలు తినేందుకు అలాగే చేసుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.
ఈ బిజీ యుగంలో ఇంటి వద్ద పిండివంటలు చేసుకోవడం అనేది గగనం అనే చెప్పాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, మీరు ఇంటి వద్ద పిండి వంటలు బిజినెస్ చేసినట్లయితే, చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా ఆన్లైన్ ఫుడ్ యాప్స్ ద్వారా పెద్ద పెద్ద రెస్టారెంట్లు సైతం తమ బిజినెస్ పెంచుకుంటున్నాయి. దీన్నే మీరు ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా మీరు బిజినెస్ ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీరు ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా మీరు ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత FSSAI ప్రాధికారిక సంస్థ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే జీఎస్టీఐఎన్ నెంబర్ కూడా పొందాల్సి ఉంటుంది. అనంతరం మీరు ఇంటి వద్ద ఒక క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకొని పిండివంటలను తయారు చేసుకుంటే మంచిది.
ఈ పిండివంటలను ప్యాకింగ్ చేసుకునేందుకు ప్యాకింగ్ మెటీరియల్ కొనుగోలు చేసుకుంటే మంచిది. అనంతరం మీరు ఫుడ్ డెలివరీ యాప్ లలో రిజిస్టర్ అవడం ద్వారా మీ సంస్థ పేరు సదరు యాప్ లలో కనిపిస్తుంది. ఆ విధంగా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్లను పొందవచ్చు. ఈ మధ్యకాలంలో ఫుడ్ డెలివరీ యాప్ లు చాలా ఫేమస్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కేవలం రెస్టారెంట్ నుంచి మాత్రమే కాదు ఇలాంటి చిరుతిళ్లను కూడా ఆర్డర్ చేసి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పండుగల వేళ పిండి వంటలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మెనూ తయారు చేసుకుంటే మంచిది.
సాంప్రదాయ పిండి వంటలను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే విదేశాలకు సైతం ప్యాకింగ్ చేయించుకొని తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు మంచి నాణ్యమైన పిండివంటలను తయారు చేయడం మాత్రమే కాదు నాణ్యమైన ప్యాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవడం ద్వారా చక్కటి వ్యాపారం చేయవచ్చు. ఇందుకోసం మీరు పెట్టుబడి కూడా తక్కువ మొత్తంలో పెట్టుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ఒక లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు పెద్ద ఎత్తున ఈ రంగంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆర్డర్లను బట్టి మీకు కనీసం నెలకు ఒక లక్ష రూపాయల వరకు మిగిలిన అవకాశం ఉంటుంది.