Business Ideas: మహిళలు మీ ఇంట్లో ఒక గది కేటాయించి ఈ బిజినెస్ చేస్తే చాలు...నెలకు రూ. 1 లక్ష మీ సొంతం.
మహిళలు వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఓ కొత్త వ్యాపార ఐడియా ద్వారా మీరు ఇంట్లో ఉండి లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యాపారంలో రాణించాలంటే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో మీరు వ్యాపారం చేయాలి అనుకుంటే, క్రమశిక్షణ నిబద్ధత అలాగే సమయపాలన ఉన్నట్లయితే చక్కటి విజయం సాధించవచ్చనే అనేక ఎగ్జాంపుల్స్ మన ముందు ఉన్నాయి. మీరు కూడా ఫుడ్ ఇండస్ట్రీ ద్వారా ఆదాయం పొందాలి అనుకుంటే ఏం చేయాలో ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో పిజ్జా బర్గర్ ఈ రెండు ఫాస్ట్ ఫుడ్ ఆహారాలను తినేందుకు ఎక్కువగా యువత ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. . ముఖ్యంగా కాలేజీ యువత అదేవిధంగా ఐటీ నిపుణులు దీంతో పాటు పిల్లలు పెద్దలు సైతం పిజ్జా బర్గర్ తినేందుకు ఎక్కువగా ఇష్టం చూపిస్తూ ఉంటారు. కొత్త కొత్త రుచులు చూడాలి అనుకునే వారికి పిజ్జా బర్గర్ ఆకట్టుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పవచ్చు.
అయితే పిజ్జా, బర్గర్ ఈ రెండు కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్ చైన్స్ సైతం తయారు చేస్తూ ఉంటాయి. అయితే వీటిలో ధర చాలా ఎక్కువగా ఉంటుంది దీంతో సామాన్యులు వీటిని తినాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది అయితే దీన్ని ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది. ముఖ్యంగా మహిళలు తమ ఇంటి వద్ద పిజ్జా బర్గర్ తయారుచేసి విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది అది ఎలాగో ఈ బిజినెస్ కోసం ఏమేం కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పిజ్జా బర్గర్ తయారీ కోసం ముందుగా మీరు ఇంట్లో ఒక గదిని కేటాయించుకోవాలి. ఆ గదిలో మైక్రోవేవ్ ఓవెన్ అలాగే పిజ్జా బర్గర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన బల్లలు, అలాగే పిజ్జా బేక్ చేయడానికి ఓవెన్, దాంతోపాటు పిజ్జా, బర్గర్ తయారీ సామాన్లను దాచుకోవడానికి ఓ ఫ్రిజ్ అవసరం అవుతాయి. వీటికోసం మీరు ప్రారంభంలో దాదాపు 50 వేల నుంచి 75 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
అనంతరం మీరు కస్టమర్ల నుంచి ఆర్డర్లను పొందాలంటే. క్లౌడ్ కిచెన్ రూపంలో ఆర్డర్లను పొందాల్సి ఉంటుంది అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఫుడ్ డెలివరీ యాప్స్ అయినా జొమాటో స్విగ్గి వంటి సంస్థలతో మీరు జతకట్టడం ద్వారా కస్టమర్లను సులభంగా పొందే వీలుంది. అలాగే మీ ఇంటి నుంచి 5 కిలోమీటర్ల వ్యాసంలో నివాసం ఉండే వారికి ఉచితంగా పిజ్జా బర్గర్ డెలివరీ చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా కూడా చక్కటి ఆర్డర్లను పొందే వీడు ఉంది ఇందుకోసం మీరు డెలివరీ బాయ్స్ ను అపాయింట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది.
వెజ్ నాన్ వెజ్ రుచుల్లో ఈ పిజ్జా బర్గర్లను అందించవచ్చు తద్వారా ఎక్కువ మొత్తంలో ఆర్డర్లను పొందే అవకాశం ఉంది. ఒకవేళ మీకు పిజ్జా బర్గర్ తయారు చేయడం రాకపోతే. హోటల్ మేనేజ్మెంట్ సంస్థల వద్ద షార్ట్ టర్మ్ కోర్సుల్లో ఈ పిజ్జా బర్గర్ తయారీ విధానాన్ని నేర్చుకుంటే సరిపోతుంది తద్వారా మీరు సులభంగా ఈ వ్యాపారం లోకి ప్రవేశించే అవకాశం దక్కుతుంది.
ఒక పిజ్జా ధర సుమారుగా 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు విక్రయించవచ్చు. రోజుకు 50 పీజాలు ఆర్డర్లు పొందిన మనం కనీసం 5000 రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది ఈ లెక్కన పది రోజుల్లో 50 వేల రూపాయలు పొందవచ్చు నెలకు లక్షన్నర రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది ఖర్చులు పోయిన నెలకు ఒక లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.