BSNL వినియోగదారులకు సూపర్ ఆఫర్.. రూ. 200కే 90 రోజుల వ్యాలిడిటీ ప్లాన్
ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలను పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ. 200కే 90 రోజుల వ్యాలిడిటీతో పాటు రూ. 499కే 90 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్‌ను కూడా అందిస్తోంది.
ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలు పెంచడంతో లక్షలాది మంది కస్టమర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల టెలికాం పరిశ్రమలో టారిఫ్ ధరల పెరుగుదలలు కంపెనీల మధ్య తీవ్ర పోటీని నెలకొల్పాయి. బీఎస్ఎన్ఎల్ టాటా కంపెనీతో కలిసి తన నెట్ వర్క్ ను బలోపేతం చేస్తోంది. దీంతో ఇప్పటికే BSNL లోకి కొన్ని లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇంకా కస్టమర్లను ఆకర్షించడానికి ధరల పెంపు లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.
Jio, Airtel, Viలు భారత టెలికాం రంగంలో మూడు ప్రధాన కంపెనీలు. అయితే ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL గత కొన్ని నెలలుగా ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ప్రైవేట్ కంపెనీల కస్టమర్ల సంఖ్య తగ్గుతుండగా BSNL కస్టమర్ల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది.
BSNL, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(MTNL)ల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ ప్యాకేజీల కారణంగా BSNL, MTNL FY 2021 నుండి నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి. ప్రస్తుతం BSNL 4G సేవలను వేగంగా అందించడానికి పనిచేస్తోంది.
మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్లా..? తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం శుభవార్త. BSNL రూ. 200కే 90 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తోంది.
ఇప్పుడు మీ సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. BSNL రూ. 200కే 90 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌ను అందిస్తోంది. ఇంటర్నెట్ ఎక్కువగా వాడని వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవలే ఇలాంటిదే మరో చక్కటి ప్లాన్ అందించింది. కేవలం 91 రూపాయలతో 60 రోజుల పాటు వ్యాలిడిటీ సర్వీసుతో రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఇలాంటి మరో ఆఫర్ రూ. 200కే 90 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్.
BSNL అందిస్తున్న ఈ ప్లాన్ 300 నిమిషాల కాల్స్, 6 GB డేటా, 99 SMSలు ఉచితంగా లభిస్తాయి. ఈ ఉచిత కాల్స్‌ను ఏ నెట్‌వర్క్‌కైనా ఉపయోగించుకోవచ్చు.
BSNLలో ఇలాంటి మరో ఆఫర్ ఏంటంటే.. రూ. 499కే 90 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, 300 SMSలతో కూడిన ప్లాన్ ఇది. ఇకపై మీ సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.