BSNL Caller Tune Setup: అదిరిపోయే కాలర్ ట్యూన్ సెట్ చేయాలా? ఇవిగో టిప్స్
BSNL Caller Tune Setup: ‘ఏం కాలర్ ట్యూన్ పెట్టావు బాసు.. చాలా బాగుంది’.. అని మీకు ఫోన్ చేసిన వాళ్లు అనాలంటే మీరు మంచి కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవాలి. కంపెనీ డీఫాల్ట్ గా ఇచ్చే కాలర్ ట్యూన్ కాకుండా మీ అభిరుచికి తగ్గ పాటను కాలర్ ట్యూన్ గా పెట్టుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మంచి టిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కంపెనీల యాడ్స్, డీఫాల్ట్ సాంగ్స్ కాలర్ ట్యూన్ గా విని వినీ విసుగొచ్చిందా? మీ వ్యక్తిత్వానికి తగ్గట్టు పాటను కాలర్ ట్యూన్‌గా మార్చడానికి బీఎస్ఎన్ఎల్ వద్ద సూపర్ ఐడియాలు ఉన్నాయి. మెలోడీస్, హుషారెత్తించే పాటలు, మంచి అర్థాన్ని, మీ భావాన్ని తెలిపే చక్కని తెలుగు పదాలున్న పాటలు, ఐటమ్ సాంగ్స్, మంచి బీట్ ఉన్న సాంగ్స్ ఇలా ఎన్నో రకాల పాటలు బీఎస్ఎన్ఎల్ లైబ్రరీలో రెడీగా ఉన్నాయి.
సాధారణంగా అందరూ ఏదోఒక సినిమా పాటను కాలర్ ట్యూన్ గా పెట్టుకుంటారు. కాని మీకు నచ్చిన మెసేజ్ ను కూడా కాలర్ ట్యూన్ గా పెట్టుకోవచ్చు. దీని కోసం బీఎస్ఎన్ఎల్ వద్ద మంచి మంచి మెసేజ్ లు సిద్ధంగా ఉన్నాయి.
ప్రతి ఒక్కరికీ ఒకే పాటను కాలర్ ట్యూన్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గరి వాళ్లకి, మనసుకు నచ్చిన వారికి, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి ఇలా ఎవరికి వారికి స్పెషల్ సాంగ్స్ ని సెలెక్ట్ చేయొచ్చు.
మీరు సెట్ చేసిన కాలర్ ట్యూన్ బోర్ కొడితే ఎప్పుడైనా మార్చేయొచ్చు.
కాలర్ ట్యూన్ సెట్ చేయడానికి సులువు మార్గాలు
మీ దగ్గర ఉన్న బీఎస్ఎన్ఎల్ సిమ్ ద్వారా 56700 లేదా 56789 డయల్ చేయండి. కంప్యూటర్ చెప్పేది విని, మీకు నచ్చిన పాటను సెలెక్ట్ చేసుకోండి.
"My BSNL Tunes" యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. మీ బీఎస్ఎన్ఎల్ నంబర్ ఇచ్చి లాగిన్ అవ్వండి. మీ అభిరుచికి తగ్గ పాటను సెలక్ట్ చేసుకోండి. "సెట్ ఫర్ ఆల్ కాలర్స్" బటన్‌పై క్లిక్ చేయండి.
మెసేజ్ పంపి కూడా కాలర్ ట్యూన్ సెట్ చేయొచ్చు. డిఫాల్ట్ ట్యూన్ కావాలంటే "BT ACT" అని టైప్ చేసి 56700 కి పంపండి. స్పెషల్ పాట కావాలంటే "BT [పాట కోడ్]" టైప్ చేసి 56700 కి ఎస్ఎంఎస్ పంపండి.
కాలర్ ట్యూన్ సెట్ చేయడానికి ఖర్చెంత?
మీకు నచ్చిన కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవడానికి నెలకు రూ.30 ఛార్జ్ చేస్తారు. అదే మీరు పాట మార్చాలనుకుంటే రూ.12 చెల్లించాలి.