BSNLలో రూ.200 లోపు ఇంత మంచి రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయా? జియో, ఎయిర్‌టెల్‌కి దెబ్బే
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ BSNL తన కస్టమర్ల కోసం రూ.200 కంటే తక్కువ ధరలో 3 అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తోంది. ఇవి కచ్చితంగా జియో, ఎయిర్‌టెల్‌కి గట్టి పోటీనిచ్చే ప్లాన్సే. వీటి గురించి తెలిస్తే ఇతర నెట్వర్క్ వినియోగదారులు కూడా ఆకర్షితులవుతారు. ఆ ప్లాన్ ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
ప్రైవేట్ కంపెనీలు తమ సర్వీస్ ఛార్జీలను పెంచడంతో, వినియోగదారులు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ BSNL ప్లాన్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. BSNL కూడా టాటా కంపెనీతో కలిసి మెరుగైన సర్వీసులు అందించేందుకు అప్ గ్రేడ్ అవుతోంది. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్‌లు వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి బడ్జెట్‌కు సరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లను BSNL అందిస్తోంది. BSNL ఒక ప్రభుత్వ టెలికాం కంపెనీ కాబట్టి రీఛార్జ్ ప్లాన్‌లు ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే చౌకగా ఉంటున్నాయి. దీంతో ఇతర నెట్వర్క్ ల వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ లోకి మారుతున్నారు.
మీరు మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న BSNL కస్టమర్ అయితే మీ కోసం మూడు అద్భుతమైన ప్లాన్‌లు ఉన్నాయి. ఇవన్నీ రూ.200 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్ డేటా ఇంకా అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.
BSNL రూ.199 రీఛార్జ్ ప్లాన్
BSNL రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అనేక మంచి ఫీచర్లను అందిస్తోంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. వినియోగదారులు ఒక నెల పాటు రోజుకు 2 GB డేటా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజూ 100 SMSలను పంపవచ్చు. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నెట్ 40 kbps వేగంతో కొనసాగుతుంది.
BSNL రూ.153 రీఛార్జ్ ప్లాన్
BSNL నుంచి వచ్చిన మరో అద్భుతమైనది రూ.153 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 26 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు 25 GB డేటా, 100 SMSలను పొందుతారు.
అన్‌లిమిటెడ్ కాల్స్ ఉండటంతో కస్టమర్లు దీన్ని బాగా ఇష్టపడుతున్నారు. రోజుకు వచ్చే డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ 40 kbps వేగంతో కొనసాగుతుంది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉండటంతో కస్టమర్లు ఈ రెండు ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకుంటున్నారు.
BSNL రూ.187 ప్లాన్
BSNL రూ.187 ప్లాన్ కూడా అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. వినియోగదారులు రోజుకు 1.5 GB డేటా పొందుతారు. రోజుకు వచ్చే డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ సేవలు 40 Kbps వేగంతో అందుతాయి. దీంతో పాటు ఈ ప్లాన్‌లో 100 SMSలు కూడా పొందవచ్చు.
ఈ ప్లాన్ ఛాలెంజ్ అరీనా మొబైల్ గేమింగ్ సర్వీస్ + హార్డీ గేమ్స్ సర్వీస్ + BSNL ట్యూన్‌ల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందిస్తుంది. మీరు ఈ ప్లాన్‌ను BSNL యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.