MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Samsung నుంచి Motorola వరకు బెస్ట్‌ లోబడ్జెట్‌ ఫోన్లు మీ కోసం

Samsung నుంచి Motorola వరకు బెస్ట్‌ లోబడ్జెట్‌ ఫోన్లు మీ కోసం

స్మార్ట్‌ ఫోన్‌ కొనుక్కోవాలనుకుంటున్నారా? మీ బడ్జెట్‌ రూ.15 వేల లోపు అయితే మీ కోసం కొన్ని రకాల ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో టాప్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో Samsung, Vivo, CMF, Poco, Motorola కంపెనీలకు చెందిన కొన్ని ఫోన్లు ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటి 5G సపోర్ట్ చేస్తుంది. అధిక రిఫ్రెష్ రేట్లు, స్ట్రాంగ్‌ బ్యాటరీ మొదలైన ఫీచర్‌లను అందిస్తున్నాయి.  

2 Min read
Naga Surya Phani Kumar
Published : Sep 08 2024, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

1. CMF ఫోన్‌ 1
CMF ఫోన్ 1  కేవలం రూ.15,999కే మార్కెట్‌లో లభిస్తుంది. 6GB RAM/128GB స్టోరేజ్ కలిగి ఉంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ డిస్కౌంట్‌ల కారణంగా రూ. 15,000 కంటే తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా CMF ఫోన్ 1 పనిచేస్తుంది. ఇందులో నథింగ్ OS 2.6 సాఫ్ట్‌వేర్‌ ఉంది. 4nm-ఆధారిత MediaTek డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ CMF ఫోన్‌ స్పెషాలిటీ. ఇది గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Mali G615 MC2 GPUతో టైఅప్‌ అయ్యింది. 256 GB UFS 2.2 నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి 2TBకి పెంచుకోవచ్చు. LPDDR 4X RAMను 8 GB వరకు అప్‌గ్రేట్‌ చేయవచ్చు.

25

2. Vivo T3x
Vivo T3x 6.72-అంగుళాల ఫ్లాట్ ఫుల్ HD+LCD డిస్‌ప్లేతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్ దీని ప్రత్యేకత. మాక్సిమం 1,000 nits బ్రైట్‌నెస్‌తో Snapdragon 6 Gen 1 SoC T3xకి శక్తినిస్తుంది. ఇంటర్‌నల్‌ స్టోరేజ్‌ కెపాసిటీ వచ్చి128GB ఉంది. మైక్రో SD కార్డ్ ను ఉపయోగించి దీన్ని 1TB వరకు స్టోరేజ్‌ కెపాసిటీ పెంచుకోవచ్చు. 6000mAh బ్యాటరీతో 44W కెపాసిటీతో వేగంగా ఛార్జింగ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ FuntouchOS 14-ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్-బాక్స్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.13,499.

35

3. Poco M6 ప్లస్
Poco M6 ప్లస్‌ 6.79-అంగుళాల LCD స్క్రీన్ తో ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది. రిఫ్రెష్ రేట్ 120 Hz, ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణగా ఉంటుంది. అధిక బ్రైట్‌నెస్ మోడ్‌లో మాక్సిమ్‌ 550 నిట్‌ల బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. దీని రిజల్యూషన్ 2400 x 1080 పిక్సెల్స్. ఈ ఫోన్ 5,030mAh బ్యాటరీని కలిగి ఉంది. 33W ఛార్జర్‌తో త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది.

అన్ని గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ ఆపరేషన్‌లను నిర్వహించడానికి, ఇది Adreno A613 GPU కెపాసిటీని కలిగి ఉంది. Qualcomm Snapdragon 4 Gen 2 AE చిప్‌సెట్‌ ఇందులో ఉంది. 6 GB RAM/128GB స్టోరేజ్ కెపాసిటీ ఒక మోడల్‌ కాగా, 8 GB RAM/128 GB స్టోరేజ్ తో మరో మోడల్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ మినిమం ధర రూ.13,499, గరిష్ఠ ధర రూ.14,999.

45

4. Samsung Galaxy F15

Samsung Galaxy F15 4GB RAM/128GB స్టోరేజ్ తో ఉన్న ఈ మోడల్‌ మార్కెట్లో రూ. 12,999లకే లభిస్తుంది. ఈ ఫోన్‌ 6.5-అంగుళాల HD+ sAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz వరకు రిఫ్రెష్ రేట్‌ దీని కెపాసిటీ. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+CPU స్మార్ట్‌ఫోన్‌కు శక్తినిస్తుంది. మరో మోడల్‌ గా 6GB RAM, 128 GB స్టోరేజ్‌ కెపాసిటీ ఫోన్‌ కూడా మార్కెట్‌లో అందుబాటుతో ఉంది. Galaxy F15 5Gను అదనంగా 1 TB వరకు మెమొరీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 

55

5. Motorola G64

Motorola G64 5G 6.5-అంగుళాల పొడవున్న స్మార్ట్‌ ఫోన్‌. ఇది HD+ IPC LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, మాక్సిమ్‌ 560 nits బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. Android 15 వెర్షన్‌ను ఇది సపోర్ట్‌ చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను కోసం ధృవీకరించబడిన అనుకూలతతో, ఇది MediaTek డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌, Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అదనంగా స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. ఇది గణనీయమైన 6,000 mAh బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఇది మినిమం ప్రైస్‌ వచ్చి రూ.13,999. మాక్సిమం ప్రైజ్‌ వచ్చి రూ.15,999.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
Recommended image2
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !
Recommended image3
Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved