ఈ AMT కార్లు రూ. 6 లక్షల కంటే తక్కువే
కొత్తగా కారు నడపడం నేర్చుకుంటున్న వారికి, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో సులభంగా ప్రయాణించాలనుకునే వారికి ఆటోమేటిక్ కార్లు చాలా సౌకర్యంగా ఉంటాయి. మీరు ఇలాంటి కారు కొనే ఆలోచనలో ఉంటే రూ. 6 లక్షల లోపు లభించే ఆటోమేటిక్ కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మంచి ఇంజన్ కెపాసిటీ, చిన్న కార్లు కోరుకునే వారికి ఆటోమేటిక్ కార్లు మంచి ఎంపిక. ఇవి రోజు కారు ఉపయోగించే వారికి బాగా ఉపయోగపడతాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగానికి వెళ్లే యువకులైనా, కాలేజీకి వెళ్లే విద్యార్థులైనా, చిన్న కుటుంబాలైనా, నగరంలో తిరగడానికి ఇష్టపడేవారైనా వీటినే ఎక్కువ ఉపయోగిస్తున్నారు.
1. మారుతి సెలెరియో
ఫ్యూయల్ ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే సెలెరియో మీకు బాగా ఉపయోగపడుతుంది. మారుతి సెలెరియోలోని ఆటో గేర్ షిఫ్ట్ (AGS) టెక్నాలజీ, ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో సులభమైన డ్రైవింగ్ అనుభవాన్ని మీకు అందిస్తుంది. ఇందులో డ్యూయల్ జెట్ టెక్నాలజీతో కూడిన 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. దీని శక్తి 68 PS, 89 Nm టార్క్ రోజువారీ వాడకానికి సరిపోతుంది.
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్ వంటి ఆధునిక ఫీచర్లు డ్రైవింగ్ ను ఈజీ చేస్తాయి. దీని ధర రూ.4.99 లక్షల నుండి రూ.7.04 లక్షల వరకు ఉంది.
2. టాటా పంచ్
టాటా పంచ్ చాలా నమ్మకమైన, దృఢమైన డిజైన్ కలిగి ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పంచ్ 5-స్టార్ రేటింగ్ పొందింది. టాటా టాప్ రేటెడ్ మోడల్స్ అయిన అల్ట్రాజ్, నెక్సాన్‌లతో సమానంగా పంచ్ నిలిచింది. ఇందులో విశాలమైన క్యాబిన్ ఉంది. ఇది డ్రైవర్, ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. టాటా పంచ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది మంచి శక్తి, పనితీరును అందిస్తుంది. దీని ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.20 లక్షల వరకు ఉంది.
3. మారుతి బాలెనో
కొత్త బాలెనో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 90PS, 113Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌లలో ఒకదాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇంజిన్ సున్నితంగా, వేగంగా స్పందిస్తుంది. టాప్ గేర్‌లో కూడా తక్కువ వేగంతో సులభంగా నడపవచ్చు. దీని ధర రూ. 6.66 లక్షల నుంచి రూ. 9.83 లక్షల వరకు ఉంది.
4. హ్యుందాయ్ ఎక్స్‌టర్
ఎక్స్‌టర్ SUV లుక్ కలిగి ఉంది. కానీ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. స్లోపింగ్ విండ్‌స్క్రీన్, బాడీ క్లాడింగ్ వంటి కఠినమైన డిజైన్ ఎలిమెంట్స్, LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, EBDతో ABS, హిల్ స్టార్ట్ అసిస్ట్‌లతో వస్తుంది. ఈ మోడల్ కారు 391 లీటర్ల బూట్ స్పేస్ అందిస్తుంది. ఇది విశాలమైన, పెద్ద వస్తువులను సులభంగా సర్దుబాటు చేస్తుంది. అదనపు స్థలం కోసం మీరు సూట్‌కేసులను అమర్చవచ్చు లేదా సీట్లను మడత పెట్టవచ్చు. ఇందులో 1.2L పెట్రోల్ ఇంజిన్ AMT, CNG ఆప్షన్లతో వస్తుంది. నగరంలో డ్రైవింగ్ చేయడానికి ఇది సున్నితంగా, నిశ్శబ్దంగా ఉంటుంది, దీని ధర రూ.6.13 నుంచి రూ. 10.43 లక్షల వరకు ఉంది.
5. రెనాల్ట్ క్విడ్
క్విడ్ చక్కని, స్టైలిష్ ఇంటీరియర్ కలిగి ఉంది. ఇది 68 PS/91 Nm 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కారు ధర రూ. 4.70 లక్షల నుంచి రూ.6.45 లక్షల మధ్య ఉంది.