Bank FD Rates: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్...ఈ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది
ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచినప్పటి నుంచి అన్ని బ్యాంకులు కూడా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా..
బ్యాంక్ ఆఫ్ బరోడా ట్రైకలర్ ప్లస్ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేట్లను పెంచింది. 399 రోజుల బరోడా ట్రైకలర్ ప్లస్ డిపాజిట్ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్‌లకు 0.50 శాతం పెంచిన తర్వాత, అది 7.75 శాతంగా మారింది. సాధారణ పౌరులకు ఇది 7.25 శాతంగా ఉంది. ఈ పెంపు తర్వాత, మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, సాధారణ కస్టమర్‌లకు 3 శాతం నుండి 7.25 శాతం వరకు , సీనియర్ సిటిజన్‌లకు 3.5 శాతం నుండి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
SBIలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఎంత?
SBIలోని FDలపై, సాధారణ కస్టమర్‌లు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు చేసిన FDలపై 3 శాతం నుండి 7.1 శాతం వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ పొందుతారు. భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం నుండి రెండేళ్ల లోపు డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు 6.8 శాతం. రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీ రేటు 7 శాతం అందిస్తోంది.
HDFC బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు
HDFC బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో, మీరు మీ డబ్బును 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య ఎక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చు , డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని పొందవచ్చు. మీరు మీ డబ్బును బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 3 శాతం నుండి 7.1 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీ రేటును పొందవచ్చు. ఈ వడ్డీ రేటు 7 రోజుల నుండి 5 సంవత్సరాల కాలానికి -3.5 శాతం నుండి 7.6 శాతం. ఈ రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమలులోకి వస్తాయి.
ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
ICICI బ్యాంక్ 3.00 శాతం, 7.10 శాతం మధ్య వడ్డీ రేట్లతో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు అందిస్తోంది. ఈ పథకం కాలవ్యవధి 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది, దానిపై వడ్డీ 3.50 శాతం, 7.60 శాతం చొప్పున అందుబాటులో ఉంటుంది.
PNBలో వడ్డీ రేట్లు ఏమిటి,
PNBలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను లెక్కిస్తే, 5 సంవత్సరాల వరకు సామాన్యులకు 6.50 శాతం వడ్డీ లభిస్తుంది, అయితే సీనియర్ సిటిజన్లకు అదే వడ్డీ రేటు 7 శాతంగా ఉన్నాయి.