- Home
- Business
- Amazon GSTBachatUstav : రూ.43,749 కే ఐఫోన్ .. అమెజాన్ గ్రేట్ సేవింగ్ సెలబ్రేషన్ లో ఆఫర్లే ఆఫర్లు
Amazon GSTBachatUstav : రూ.43,749 కే ఐఫోన్ .. అమెజాన్ గ్రేట్ సేవింగ్ సెలబ్రేషన్ లో ఆఫర్లే ఆఫర్లు
Amazon GSTBachatUstav : అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కు ఒకరోజు ముందుగానే ఆఫర్ల వర్షం ప్రారంభమయ్యింది. ఇందులో ఐఫోన్ 15 ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అమెజాన్ లో జిఎస్టి బెనిఫిట్స్
Amazon GSTBachatUstav : భారత ప్రభుత్వం వస్తు సేవల పన్ను (GST) సంస్కరణలతో చాలా వస్తువుల ధరలు తగ్గాయి... ఈ పండగ సీజన్లోనే ఈ తగ్గింపు ధరలు అమలులోకి వచ్చాయి. సెప్టెంబర్ 22 నుండి అంటే ఇవాళ్టి నుండి కొత్త జిఎస్టి ప్రకారం వస్తువుల ధరలు ఉంటాయి. ఈ క్రమంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ వినియోగదారులు జిఎస్టి తగ్గింపు బెనిఫిట్స్ నేరుగా అందించేందుకు సిద్దమయ్యింది... ఇందుకోసమే ''ది గ్రేట్ సేవింగ్ సెలబ్రేషన్, జిఎస్టి బచత్ ఉత్సవ్ చేపట్టింది. దీనిద్వారా ఇంట్లోకి అవసరమైన వస్తువులు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసర వస్తువులు, హెల్త్ కేర్, ఫ్యాషన్ ఇలా అన్నిరకాల వస్తువులపై జిఎస్టి బెనిఫిట్స్ పొందవచ్చు.
ఇప్పటికే అమెజాన్ బతుకమ్మ, విజయదశమి పండగల నేపథ్యంలో 'ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025' ని ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుండి ఈ సేల్ ప్రారంభంకానుంది... ప్రైమ్ మెంబర్స్ కి సెప్టెంబర్ 22 అర్ధరాత్రి నుండే ఈ ఆఫర్ లో భాగంగా భారీ తగ్గింపు ధరలకే అన్నిరకాల వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. దీనికి ముందే జిఎస్టి తగ్గింపు అందుబాటులోకి రావడం అంటే వివిధ వస్తువులు మరింత తక్కువ ధరకే లభించనున్నాయి.
ఏమిటీ గ్రేట్ సేవింగ్ సెలెబ్రేషన్స్?
అమెజాన్ లో #GSTBachatUtsav (ది గ్రేట్ సేవింగ్ సెలబ్రేషన్) కింద వివిధ ఉత్పత్తులపై ప్రత్యేక బ్యాడ్జీలు కనిపిస్తాయి... ఇవి జిఎస్టి తగ్గింపు ద్వారా ఎంత ఆధా అవుతుందో వినియోగదారులకు తెలిజేస్తుంది. అంటే జిఎస్టి తగ్గింపు వల్ల ఆ వస్తువు ధర ఎంత తగ్గిందో వినియోగదారులకు తెలుస్తుంది. ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సమయంలో అయితే “Prime Deal + GST Savings” అని, ప్రధాన ఈవెంట్‌లో “Deal with GST Savings” అని ప్రత్యేక బ్యాడ్జీలు కనిపిస్తాయి. అలాగే అమెజాన్ పే ద్వారా పేమెంట్ చేస్తే నో కాస్ట్ ఈఎంఐ, అమెజాన్ పే రివార్డ్స్ గోల్డ్ ద్వారా పేమెంట్ చేసే ప్రైమ్ సభ్యులకు 5శాతం వరకు తప్పనిసరి క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు లభిస్తాయి.
అమెజాన్ సెల్లర్స్ కి సహకారం
కేంద్ర ప్రభుత్వ జిఎస్టి సంస్కరణలకు తగ్గట్లుగా అమ్మకందారులు తమ వస్తువుల ధరలను మార్చుకునేందుకు అమెజాన్ ప్రత్యేక సహకారం అందిస్తోంది... ఇందుకోసమే వివిధ చర్యలు చేపట్టింది. సరైన GST రేట్లు, ప్రోడక్ట్ ట్యాక్స్ కోడ్స్ (PTCs) వినియోగంపై సపోర్ట్ అందిస్తోంది. కొన్ని కేటగిరీల్లో ఆటోమేటిక్ అప్‌డేట్స్ కూడా చేసింది. అయితే జిఎస్టికి అనుగునంగా ధరలు నిర్ణయించాల్సిన బాధ్యత ఉత్పత్తిదారులదేనని అమెజాన్ తెలిపింది.
అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్లు
ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులకు అమెజాన్ భారీ ఆఫర్లను అందిస్తోంది. సామ్‌సంగ్, ఆపిల్, ఇంటెల్, టైటాన్, లిబాస్, లోరియల్ వంటి బ్రాండ్ల నుండి 30,000కి పైగా కొత్త ఉత్పత్తులు లాంచ్ అవుతున్నాయి. ఐఫోన్ 15 కేవలం ₹43,749కి, సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ₹71,999కి అందుబాటులోకి వచ్చాయి. అదనంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ప్రొడక్ట్స్‌పై 80% వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఇతర బ్యాంక్ ఆఫర్లు, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదనంగా నవరాత్రి, దసరా స్టోర్‌లో పండుగ అవసరాలపై 50% పైగా డిస్కౌంట్లు ఉంటాయి.
జిఎస్టి సేవింగ్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో అతి తక్కువ ధరకే వస్తువులు...
1. సోనీ బ్రావియా 3 సీరిస్ 189సెంమీ (75 ఇంచెస్) 4K అల్ట్రా స్మార్ట్ ఎల్ఈడి టిడి K-75S30B (బ్లాక్) - రూ.2,69,900 ధర కలిగిన ఈ టీవి 54 శాతం తగ్గింపు ధరతో రూ.1,24,990 కే వస్తుంది. దీనికి అదనంగా బ్యాంక్ ఆఫర్లు వర్తిస్తాయి... ఈఎంఐ సౌకర్యం ఉంది.
2. జియోమి138 సెం.మీ (55 ఇంచెస్) FX Pro QLED అల్ట్రా హెచ్డి 4K స్మార్ట్ ఫైర్ టివి 49శాతం తగ్గింపుతో రూ.62,999 కేవలం రూ.31,999 కి వస్తుంది.
3. ఎల్జి 1.5 టన్ స్టార్ డ్యుయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి 52 శాతం తగ్గింపుతో రూ.85,999 ధర కలిగినది రూ.41,490 కే వస్తుంది.
4. బోస్13 ప్లేస్ సిట్టింగ్ డిష్ వాషర్ 22 శాతం తగ్గింపుతో రూ.52,990 ధరది రూ.41,500 వస్తుంది.
5. హీరో మోటోకార్ప్ డెస్టిని 125 FI DRSC (OBD2B) స్కూటర్ రూ.77,442 కే వస్తుంది. దీనికి ఈఎంఐ సదుపాయం, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.