MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • జీవితం మారాలంటే అద్భుతాలు అవసరం లేదండి.. ఈ చిన్న మార్పులు చాలు

జీవితం మారాలంటే అద్భుతాలు అవసరం లేదండి.. ఈ చిన్న మార్పులు చాలు

దీ.. మ్మా జీవితం అంటూ తిట్టుకోని వారు ఎవరైనా ఉంటారా? ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరి నోటి నుంచి ఈ డైలాగ్ వస్తూనే ఉంటుంది కదా.. మనలో ప్రతి ఒక్కరూ జీవితాన్ని మరింత మెరుగ్గా బతకాలని ఆశపడుతుంటాం. కాని మీకు తెలుసా? జీవితం మారాలంటే అద్భుతాలు జరిగేలా పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అవే జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. కొత్త సంవత్సరంలోనైనా ఈ చిన్న మార్పులు  చేసుకొని జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలో నేర్చుకుందాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 25 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

2024 అయిపోయినట్టే.. ఈ సంవత్సరం మొత్తంలో ఏం సాధించామని ఆలోచిస్తే 90 శాతం మంది ఏం లేదనే చెబుతారు. ఎందుకంటే 2024 అంత స్పీడ్ గా అయిపోయింది మరి.. ఎప్పటికప్పుడు ఏదో చేయాలని అనుకోవడం, ప్లానింగ్ చేస్తుండగానే రోజులు గడిచిపోయాయి కదా.. ఎందుకంటే జీవితంలో మార్పు అంటే అదో పెద్ద విషయం. దాన్ని అంత త్వరగా ఆచరణలో పెట్టలేం. ఇదే చాలా మందిలో ఉన్న అభిప్రాయం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే నిజానికి జీవితం మారాలంటే పెద్ద మార్పులు అవసరం లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు. డైలీ మనం జీవించే విధానంలోనే ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి చిన్న మార్పులు చేసుకుంటే ఆనందంగా జీవించొచ్చని చెబుతున్నారు. పాజిటివ్ గా ఆలోచిస్తూ చిన్న టిప్స్ పాటిస్తూ జీవిత గమనాన్ని ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం రండి. 
 

35

1. ప్రతి రోజూ కారులో వెళ్లేటప్పుడు అందరూ  రేడియోని ఆన్ చేసి పాటలు వింటుంటారు. కాని రేడియోని ఆఫ్‌ చేసి, నిశ్శబ్దంగా డ్రైవ్ చేసి చూడండి. సైలెన్స్ లో ఉండే శక్తి మీకే అర్థమవుతుంది. ఆ సమయంలో వచ్చే నెగెటివ్ ఆలోచనలను పక్కకకు తోసేసి పాజిటివ్ గా ఆలోచిస్తూ డ్రైవ్ చేయండి. మీ అనేక సమస్యలకు మానసికంగా సొల్యూషన్ దొరుకుతుంది. 

2. మీ భావోద్వేగాలను తెలపడం కోసం ఇతరుల మీద ఆధారపడవద్దు. మీ మనసుతో మాట్లాడండి. మీ భావాలు కరక్టో కాదో ఇన్నర్ వాయిస్ తో చర్చించండి. 

3. ప్రకృతితో మమేకమై నడవండి. మీకిష్టమైన వ్యక్తులు లేదా పెంపుడు జంతువులను తీసుకొని అందమైన ప్రకృతి ఆస్వాధిస్తూ నడక సాగించండి. ఇది మీలో స్ట్రెస్ ని తగ్గించి, కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. 
 

45

4. మీ పిల్లలు మీకు ఎన్నో విషయాలు నేర్పుతారు.
వారితో స్వేచ్ఛగా, నిస్వార్థంగా మాట్లాడుతుంటే మీ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లోని సమస్యలకు కూడా పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది.  

5. ప్రతి రోజును పాజిటివ్ ఆలోచనలతో స్టార్ట్ చేయండి. ఇతరులతో దయతో ఉండండి. సాయం చేయండి. మీకు సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపండి. ఎదుటి వారిని ఇష్టపడటం కంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా ఇష్టపడండి. 

6. వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మీరు అనుకున్నట్లు సమాజం, వ్యక్తులు లేరని చింతిస్తూ కూర్చోకండి. మీకు నచ్చని విషయాలను వదిలేసి ముందుకు వెళ్లిపోండి.  
 

55

7. యోగ, ధ్యానం, శ్వాస మీద పట్టు సాధించేందుకు ప్రతి రోజు ప్రయత్నించండి. ఈ నైపుణ్యాలు మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి.

8. మీ శరీరం ఇస్తున్న సంకేతాలను అర్థం చేసుకోండి. అవి తెలుసుకోకపోవడం వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ శరీరానికి అవసరమైన వ్యాయామం మాత్రమే చేయండి. శరీరాన్ని కష్టపెడుతూ, బలవంతంగా ఏదీ చేయొద్దు. 

9. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోకుండా, ఒక క్షణం ఆగి కూల్ గా స్పందించండి. ఇది మీ ఆలోచనా శక్తిని రెట్టింపు చేస్తుంది. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో అద్భుతమైన మార్పును తెస్తాయి.
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image2
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image3
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved