ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ వెంటనే అప్రూవ్ కావాలంటే ఈ 5 టిప్స్ పాటించండి
మీకు డబ్బులు వెంటనే కావాలా? అయితే ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ కు అప్లై చేయండి. ఇది అప్రూవ్ అయితే డబ్బులు వెంటనే మీ అకౌంట్ లోకి వచ్చి చేరతాయి. ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ త్వరగా అప్రూవ్ కావాలంటే ఈ 5 టిప్స్ పాటించండి.
అత్యవసరంగా డబ్బులు అవసరమైతే బయట అధిక వడ్డీలకు అప్పులు చేసే బదులు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్ తీసుకోవడం ఒకరకంగా మంచి విషయం. ఈ అప్పు తీసుకోవడానికి ఎలాంటి తాకట్టు పెట్టక్కర లేదు. వెంటనే డబ్బులు కావాలనుకునే వారు ఎక్కువగా ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. పర్సనల్ లోన్‌తో పోల్చినప్పుడు, ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఒక రకంగా సెక్యూర్ కాని రుణం. కాని ఇందులోనే మీకు వెంటనే డబ్బు లభిస్తుంది. అయితే ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ వెంటనే అప్రూవ్ కావాలంటే ఈ టిప్స్ పాటించడం చాలా అవసరం.
1. లోన్ అమౌంట్, టైమ్ పీరియడ్
ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు అవసరమైన డబ్బును సరిగ్గా అంచనా వేయండి. ఇది మీ ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యానికి అనుగుణంగా ఉందో లేదో చెక్ చేసుకోండి.
లోన్ టైమ్ పీరియడ్ ని అంచనా వేయండి. లాంగ్ టైమ్ పీరియడ్ ని మీరు ఎంచుకుంటే ప్రతి నెలా తక్కువ EMIలు చెల్లించవచ్చు. అయితే మొత్తం లోన్ పై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోండి.
2. ఇన్ కమ్ సోర్స్(ఆదాయ వనరు)
చాలా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు స్థిరమైన ఆదాయాలు, స్థిరమైన ఉపాధి కలిగిన వారికి ఇన్ స్టంట్ పర్సనల్ లోన్స్ వెంటనే ఆమోదిస్తాయి. వాస్తవానికి ఇన్ స్టంట్ పర్సనల్ లోన్స్ వెంటనే ఆమోదం పొందాలంటే ఎక్కువ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మినిమం మంత్లీ ఇన్ కమ్ ని చూస్తాయి. మీకు గాని ఇన్ స్టంట్ పర్సనల్ లోన్స్ కావాలంటే ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు సెల్ఫ్ ఇన్కమ్ కలిగి ఉండి ఇన్ స్టంట్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసి ఉంటే మీ IT రిటర్న్స్ ను బ్యాంకులు అడుగుతాయి. మీరు ఈ అర్హతలు కలిగి ఉంటే మీకు లోన్ రావడం సులభం అవుతుంది.
3. మంచి క్రెడిట్ స్కోర్
ఇన్ స్టంట్ పర్సనల్ లోన్ ఆమోదించేటప్పుడు రుణదాతలు(బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు) చూసే ప్రధాన ప్రమాణాలలో ఒకటి క్రెడిట్ స్కోర్. ఈ స్కోర్ సకాలంలో మీరు రుణాన్ని తిరిగి చెల్లిస్తారనడానికి ఒక ఆధారంగా పనిచేస్తుంది. అందువల్ల మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటెయిన్ చేయడం చాలా అవసరం. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇది ఆటోమెటిక్ గా మీకు ఇన్ స్టంట్ పర్సనల్ లోన్ అప్రూవ్ కావడానికి సహాయపడుతుంది.
4. డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి
పర్సనల్ లోన్‌తో పోల్చినప్పుడు తక్షణ పర్సనల్ లోన్‌లకు తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం. అయితే మీరు అడ్రస్ ప్రూఫ్, ఇన్ కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్, సెల్ఫ్ ఐడెంటిటీ మొదలైన డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోండి. లోన్ అప్రూవ్ కావడంలో లేట్ జరగకుండా ఉండాలంటే ఈ పత్రాలన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి.
5. EMI కాలిక్యులేటర్ ఉపయోగించండి
తక్షణ వ్యక్తిగత రుణాన్ని పొందాలనుకున్నప్పుడు మీ ఫైనాన్స్ ప్లాన్ లకు చక్కని రూపాన్ని ఇవ్వడానికి EMI కాలిక్యులేటర్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి మీకు ఎంత డబ్బు కావాలి? నెలనెలా ఎంత డబ్బు కట్టగలరు? ఎంత కాలం కట్టగలరు లాంటి వివిధ అంశాలను కరెక్ట్ గా అంచనా వేయగలరు. ఎక్కువగా లోన్స్ తీసుకొనే వారికి ఇన్ స్టంట్ పర్సనల్ లోన్స్ త్వరగా లభిస్తాయి. అయితే మీ క్రెడిట్ హిస్టరీ సరిగ్గా ఉందో లేదో దీనికి చాలా అవసరం.
అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే ఇన్ స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవడం మంచి ఎంపిక. అయితే ఇతర రుణాల మాదిరిగానే ఈ లోన్ కూడా సకాలంలో, కరెక్ట్ గా కట్టాల్సి వస్తుందని మర్చిపోకూడదు. డబ్బులు పొందాలనే హడావిడిలో రుణాన్ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని అంచనా వేయడం మర్చిపోవద్దు. అవసరం లేకపోయినా రుణం ఎక్కువగా ఇస్తున్నారని తీసేసుకుంటే తిరిగి చెల్లించడంలో మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ లోన్ తీసుకోవాలనుకున్నా తిరిగి చెల్లించే మీ కెపాసిటీని గుర్తించి లోన్ తీసుకోవడం చాలా అవసరం.