240కిమి మైలేజీ అందించనున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్, ధరెంతో తెలుసా?
పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ నేథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడౌతుున్న హోండా యాక్టివా , ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ గా విడుదల కానుంది. 240కిమీల పరిధిని అందించే బ్యాటరీత ఇది రానుంది.
Honda Activa Electric Scooter
ఎలక్ట్రిక్ వాహనాలకు రోజు రోజుకీ డిమాండ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా పెట్రోల్; డీజిల్ ధరలు ఎక్కువగా పెరిగిపోతుండటంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై వైపు మొగ్గుచూపుతున్నారు. హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Honda Activa
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రక్షన్ ఎలక్ట్రిక్‌తో పాటు స్పీడ్ రేంజ్, ట్రిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు ఈ స్కూటర్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఈడీ లైట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Honda Electric Scooter
క్లాసిక్ యాక్టివా డిజైన్‌తో వస్తున్నప్పటికీ, ఎలక్ట్రిక్ వేరియంట్ అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ వివరాలను హోండా ఇంకా వెల్లడించలేదు. అయితే పెద్ద బ్యాటరీ ప్యాక్ వస్తుందని భావిస్తున్నారు. ఇది స్కూటర్ పనితీరును బాగా పెంచుతుంది.
Honda Activa Electric Price
ఈ స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 240 కి.మీల దూరం ప్రయాణించవచ్చు. ధర విషయానికొస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1 లక్ష వరకు ఉండొచ్చని వాహన మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్కూటర్ ఇంకా విడుదల కాలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2025లో విడుదల కానుంది.