Zodiac sign: తెలివైన వారిలా నటించడంలో వీరికి వీరే సాటి..!
తమను అందరూ గుర్తించాలనే తెలివి లేకపోయినా.. తాము చాలా తెలివిగల వారుగా నటిస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింద రాశులవారు అంతే.. అందరి ముందు తమను తాము తెలివైన వారుగా ప్రూవ్ చేసుకోవడానికి చాలా తిప్పలు పడుతూ ఉంటారు.

Daily Horoscope
మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారిలో తెలివిగల వారూ ఉంటారు. తెలివి తక్కువ గల వారు కూడా ఉంటారు. నిజంగా తెలివైన వారు అన్ని విషయాలను క్షున్నంగా తెలుసుకుంటారు. కానీ.. కొందరు ఉంటారు.. తమను అందరూ గుర్తించాలనే తెలివి లేకపోయినా.. తాము చాలా తెలివిగల వారుగా నటిస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింద రాశులవారు అంతే.. అందరి ముందు తమను తాము తెలివైన వారుగా ప్రూవ్ చేసుకోవడానికి చాలా తిప్పలు పడుతూ ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
1.మిథున రాశి..
ఈ రాశివారు ద్వంద్వ వైఖరిని కలిగి ఉంటారు. అందరూ ఉన్నప్పుడు ఒకలా.. ఎవరూ లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివారికి అవసరం లేకపోయినా.. ఈ రాశివారు తమ అభిప్రాయాలు చెబుతూనే ఉంటారు. సమయం సందర్భం లేకుండా.. అందరి ముందు తమ తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. అందరూ తమను ఎంత తెలివైన వారో అని గుర్తించాలని తాపత్రయపడుతూ ఉంటారు.
2.కర్కాటక రాశి..
తాము ఎంత తెలివైన వాళ్లమో ఇతరులకు చూపించాల్సిన అవసరం వారికి ఎప్పుడూ ఉంటుంది. ఎదుటివారికి అవసరమైన వాదన పెట్టుకొని మరీ తమ తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడల్లా తెలివి ప్రదర్శిస్తారు. వీరికి నిజంగా తెలివి ఉందో లేదో ఎవరికీ అర్థం కాదు.
3.సింహ రాశి..
వారు ఎల్లప్పుడూ వెలుగులో ఉండటానికి ఇష్టపడతారు. వారు ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తారు. సింహరాశివారు ఎల్లప్పుడూ జనాదరణ పొందేందుకు మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అందులో భాగంగానే అందరూ తమను తెలివైన వారుగా గుర్తించాలని ఆరాటపడుతూ ఉంటారు. తెలివి ప్రదర్శిస్తూనే ఉంటారు.
4.ధనస్సు రాశి..
వారు ఒక సమూహంలో అప్రయత్నంగా కలిసిపోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా వ్యక్తులతో కలవడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో.. తమను అందరూ గుర్తించేలా చేస్తారు. తాము చెప్పేది అందరూ వినాలని.. తమను సీరియస్ గా తీసుకోవాలని అనుకుంటారు. అలా అందరూ గుర్తించడానికి వీరు తమ తెలివంతా ప్రదర్శిస్తారు. తాము తెలివైన వారమని అందరూ నమ్మేలా చేస్తూ ఉంటారు.
5.కుంభ రాశి..
అన్ని సమస్యల గురించి శ్రద్ధ వహించినట్లే నటిస్తూ ఉంటారు. కానీ.. లోలోపల మాత్రం.. అందరూ తమను గుర్తించాలని కోరుకుంటారు. ఈ రాశివారు నిరంతరం.. ఇతరుల నుంచి మద్దతు కోసం చూస్తూ ఉంటారు. వారు తమను తాము కానట్లు నటించడం ద్వారా మాత్రమే అలా చేయవచ్చని వారు భావిస్తారు. ఇది పూర్తిగా నకిలీ అనిపించినా, కుంభరాశులు సవాలుకు సిద్ధంగా ఉన్నారు; వారు ఏమి మాట్లాడుతున్నారో వారికి తెలియక పోయినప్పటికీ వారు తెలివైన విషయాలను బయటపెట్టినట్లు నటిస్తారు.