ఈ రాశుల వారు తమ ఎమోషన్ ని ఎవరితోనూ పంచుకోరు..!
అందరికీ చెప్పుకునే మనస్తత్వం వీరిది కాదు. ఏ విషయమైనా వీరు అందరికీ చెప్పుకొని.. ఇతరులను గాయపరచాలని అనుకోరు. తమ భాగస్వామిని కూడా పూర్తిగా నమ్మిన తర్వాతే వారికి కూడా ఏదైనా చెప్పుకోగలరు. వీరేనే కోల్డ్ హార్ట్ పీపుల్ అంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

Astrology-
మనలో చాలా మంది ఆనందం వచ్చినా.. దుఖం వచ్చినా.. కోపం వచ్చినా దేనినీ ఆపుకోలేరు. అందరికీ చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ అందరూ అలా ఉండరు. కొందరు కనీసం తమ ఆత్మీయులతో కూడా ఏ ఎమోషన్ ని పంచుకోలేరు. ఏ విషయాన్ని అయినా తమలో తామే ఉంచుకుంటారు. అందరికీ చెప్పుకునే మనస్తత్వం వీరిది కాదు. ఏ విషయమైనా వీరు అందరికీ చెప్పుకొని.. ఇతరులను గాయపరచాలని అనుకోరు. తమ భాగస్వామిని కూడా పూర్తిగా నమ్మిన తర్వాతే వారికి కూడా ఏదైనా చెప్పుకోగలరు. వీరేనే కోల్డ్ హార్ట్ పీపుల్ అంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
1.వృషభ రాశి..
వారు మొండి పట్టుదలగలవారు. ఎదుటివారికి బండ రాయిలా కనిపిస్తారు. సరైన కారణాన్ని కనుగొనే వరకు వారు చలించరు. వారు కూడా చాలా అహంభావంతో ఉంటారు. వారి కంటే ఇతరుల భావాలను గుర్తించడానికి నిరాకరిస్తారు. తమ విజయానికి, అదృష్టానికి ఎవరు అడ్డు వచ్చినా వారు నాశనం చేస్తారు.
2.కర్కాటక రాశి..
వీరు ఇతరుల ప్రేమ లేకుండా అస్సలు బతకలేరు. కానీ.. అదే సమయంలో.. ఎవరైనా తమను చీట్ చేయడం లాంటివి చేస్తే మాత్రం వీరు తట్టుకోలేరు. వీరు కోల్డ్ హార్టెడ్ గా మారిపోతారు.వారి సున్నితమైన స్వభావం విపరీతమైన బాధను తట్టుకోదు, కాబట్టి కర్కాటక రాశివారు దయగా, మంచిగా ప్రవర్తిస్తారు, కానీ వీరు తమ గురించి తొందరగా ఎవరికీ బయటపెట్టరు.
3.కన్య రాశి..
ఈ రాశివారు మొద్దుబారినట్లుగా కనపడతారు. ఇతరులను సంతోషపెట్టడం కూడా వీరికి రాదు. వీరు ఎవరితోనూ ఎమోషనల్ టీ కనెక్ట్ అవ్వరు. వీరికి ప్రేమ కంటే... అధికారం ఎక్కువ కావాలి. వీరు ఎవరినీ పెద్దగా ఇష్టపడరు. ఆవిషయం ఎవరికీ చెప్పరు.
4.వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా కోల్డ్ హార్ట్ పర్సన్స్. ఈ రాశివారు ఎవరైనా తమను బాధపడితే అస్సలు ఊరుకోరు. బదులుగా ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారు ఎవరినైనా తారుమారు చేయగలరు. విషయాలు అసహ్యంగా మారినప్పుడు వారు శత్రుత్వం కూడా చేయవచ్చు. స్కార్పియన్‌కు ఎప్పుడూ కోపం తెప్పించకపోవడం మంచిది
5.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎవరిపైనా పెద్దగా ప్రేమ చూపించరు. వారు తమ హృదయాన్ని చాలా విలువైనదిగా కాపాడుకుంటారు, ఎందుకంటే వారు గాయపడతారని భయపడతారు. ప్రేమ, భావోద్వేగాల విషయానికి వస్తే వారు చాలా సున్నితంగా ఉంటారని వారికి తెలుసు, కాబట్టి వారు తమను తాము రక్షించుకోవడానికి ఉత్తమమైన మార్గంగా భావిస్తారు.