ఈ రాశుల వారు దేనినీ లెక్కచేయరు, పట్టించుకోరు..
జ్యోతిష్యం ప్రకారం.. ఒక్కో రాశివారు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. అయితే కొన్ని రాశుల వారు సునామీ వస్తుందని తెలిసినా.. కేర్ చేయరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే?
చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించేవారు కొందరైతే, మరికొందరు ఆ కొద్ది సేపు మాత్రమే ఆలోచించి తర్వాత ఆలోచనలను పక్కన పెట్టేస్తుంటారు. ఇంకొందు ఏ విషయాలను కూడా కేర్ చేయరు. అస్సలు వాటి గురించే పట్టించుకోరు. ఏదైతే అది అయితదని అనుకుంటారు. పర్సనల్ జీవితంలో జరిగే వాటిని గురించి కూడా లెక్క చేయరు. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారే ఇలా ఎక్కువగా ప్రవర్తిస్తారు. వారెవరెవరంటే?
Sagittarius
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఆశ ఎక్కువ. అలాగే వీరు సాహసానికి ప్రసిద్ది చెందిన వారు. ఈ రాశివాళ్లు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. వీళ్లు తమను ఎవరూ నియంత్రించబడటానికి ఇష్టపడరు. ధనుస్సు రాశివారికి అన్వేషణ, కొత్త అనుభవాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉొంటుంది. అంతా సవ్యంగానే జరుగుతుందని అనుకుంటారు. అందుకే వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. వీరికి నిర్లక్ష్యం చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీరు విషయాల గురించి ఆలోచించడం కంటే.. అంతా సవ్యంగానే జరుగుతుందని అని లైట్ తీసుకోవడంపైనే దృష్టి పెడతారు. అలాగే జీవితం తమను సరైన మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ ప్రపంచాన్ని చాలా స్పెషల్ గా చూస్తారు. వీళ్లు సృజనాత్మకంగా ఉంటారు. అలాగే అభ్యుదయ దృక్పథంతో వ్యవహరించడానికి ఇష్టపడతారు. కానీ వీళ్లు నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ ప్రవర్తన సామాజిక నియమాలు, అంచనాల నుంచి వేరు చేస్తుంది. ఈ రాశివాళ్లు అంతర్దృష్టిని అనుసరిస్తారు. అలాగే మనసులోని మాటలను ఎలాంటి సంకోచం లేకుండా చెప్తారు.
Gemini
మిథున రాశి
మిథున రాశి ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. వీళ్లు తమ తెలివైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. అలాగే మంచి స్థాయికి చేరుకుంటారు. వీళ్లు జీవితంలో కొత్త అనుభవాలను పొందుతారు. ఈ రాశి వారి సహజమైన కుతూహలం, జ్ఞానం పొందాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీళ్లు చాలా నిర్లక్ష్యంగా కూడా ఉంటారు. ఈ రాశివాళ్లు బాధ్యతలలో చిక్కుకోవడానికి బదులుగా క్షణంలో జీవించడానికి ఇష్టపడతారు. అలాగే వీరి మార్గంలో వచ్చే ప్రతి సాహసాన్ని ఆస్వాదిస్తారు.
మీన రాశి
మీన రాశి వారు సహజంగా ఉంటారు. వీళ్లు అపరిమితమైన ఊహాశక్తికి ప్రసిద్ధి చెందారు. ఈ రాశి వారు జీవితాన్ని ఆశ్చర్యంగా, భ్రమతో చూస్తారు. అలాగే వీరి నిర్లక్ష్య స్వభావం వల్ల వీరు ప్రాపంచిక క్షణాలలో కూడా అందాన్ని చూడగలుగుతారు. వీరికి సానుభూతి, కరుణ ఎక్కువ. రాశి వారు జీవితంలోని హెచ్చుతగ్గులను దయ, అంగీకారంతో నావిగేట్ చేస్తారు.