- Home
- Astrology
- Varalakshmi Vratham Wishes: వరలక్ష్మీ వ్రతం రోజున మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి
Varalakshmi Vratham Wishes: వరలక్ష్మీ వ్రతం రోజున మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి
వరలక్ష్మీ వ్రతం వచ్చిందంటే తెలుగిళ్లల్లో మహిళలు పూజలు పునస్కారాలతో బిజీ అయిపోతారు. వరలక్ష్మి వ్రతం రోజు మీ బంధుమిత్రులకు శుభం కలగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం 2025కు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలుగులోనే పంపించండి.

వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
హిందూ సంవత్సరాలలో శ్రావణమాసం ఎంతో ముఖ్యమైనది. ఆధ్యాత్మికంగా దీన్ని విశిష్టమైనదిగా చెప్పుకుంటారు. శ్రావణమాసంలోనే శివుడిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతంగా నిర్వహించుకుంటారు. ఈసారి పౌర్ణమి ఆగస్టు 9వ తారీఖున వస్తుంది. అందుకే దాని ముందు రోజు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం గా నిర్వహించుకుంటాము. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలు కావాలని కోరుకుంటాము. ఆరోజు నా బంధుమిత్రులను శుభాకాంక్షలు తెలిపి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆశిస్తాము. ఇక్కడ మేము తెలుగులోనే కొన్ని శుభాకాంక్షలు తెలియజేశాము. వాటిని స్నేహితులకు పంపండి.
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలుగులో
మీ ఇంట వరలక్ష్మి వ్రతం పూజకు
ఆ లక్ష్మీదేవి సంతోషించి
అనుగ్రహం, అష్టైశ్వర్యాలు అందించాలని
కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు
వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు
పవిత్ర శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకుంటున్న మహిళలకు
వారి కుటుంబ సభ్యులకు
ఆ లక్ష్మీదేవి కృప ఉండాలని కోరుకుంటూ
వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
ఆ లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికీ
లభించాలని కోరుకుంటూ
అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలుగులో
తెలుగింటి ఆడపడుచులకు
సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందించే
పండుగ వరలక్ష్మి వ్రతం
మీకు మీ కుటుంబ సభ్యులకు
వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
వరలక్ష్మీ వ్రతం లక్ష్మీదేవి
కృపాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని
సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ
వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలుగులో
శ్రావణమాసంలో ఆ శ్రావణ లక్ష్మి
దీవెనలు మీకు ఎల్లప్పుడూ కలగాలని
కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
వరలక్ష్మీదేవి మీకు సకల సిరిసంపదలు
అందించాలని మీ కుటుంబ సభ్యులకు
ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ
వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలుగులో
తెలుగు మహిళలకు సౌభాగ్యాన్ని
ఐశ్వర్యాన్ని ఇచ్చే శ్రావణమాసం
పండుగ వరలక్ష్మి వ్రతం.
ఈ సందర్భంగా మీ అందరికీ
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు
లక్ష్మీదేవి అనునిత్యం
మిమ్మల్ని కాపాడాలని
మీకు సకల సౌభాగ్యాలు అందించాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
మీకు ఎల్లప్పుడూ అంతా మంచే జరగాలని
శ్రావణమాసంలో లక్ష్మీదేవి దీవెనలు
లభించాలని కోరుకుంటూ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు