కాకి తలపై తన్నితే ఏమౌతుంది?
చాలాసార్లు మనం బయటకు వెళ్లినప్పుడు కాకులు ఉన్నపాటుగా వచ్చి తలపై తన్నుతుంటాయి. దీన్ని అశుభంగా భావిస్తారు. తలపై కాకి తన్నితే తలస్నానం చేసి పూజలు చేస్తారు. అసలు తలపై కాకి తన్నితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
శుభ ప్రదంగా, అశుభంగా భావించే ఎన్నో ఘటనలు మన జీవితంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. శకున శాస్త్రం ప్రకారం.. ఇలాంటి కొన్ని ఘటనలు లేదా ఒకరి రూపం మంచి, చెడును సూచిస్తుంది. అదే విధంగా.. కాకి తలను తాకడం కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అసలు కాకి తలను తన్నితే ఏం జరుగుతుంది.
Crow
యముడి దూతగా..
హిందూ మతంలో కాకిని యముడి దూతగా భావిస్తారు. కాకి మన తలను తాకితే ఇది ముందస్తు సమాచారం ఇస్తుందని నమ్ముతారు. అందుకే కాకి తల తన్నడాన్ని అశుభంగా భావిస్తారు.
కాకి తాకితే
చాలాసార్లు కాకి మన తలను అలా తాకి.. ఇలా వెళ్లిపోతుంది. శకున శాస్త్రం ప్రకారం.. ఈ సంఘటనను శుభప్రదంగా భావించరు. ఇది రాబోయే చెడు ఘటనకు సంకేతం కావొచ్చని జ్యోతిష్యులు అంటున్నారు.
జీవితంలో సమస్యలు
కాకి మన తలను తాకడం అస్సలు మంచిది కాదు. దీన్ని అశుభంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో ఎన్నో సమస్యలు రావడాన్ని సూచిస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Crow
ఆర్థిక సమస్య
కాకి తలపై తన్నడం అంత మంచి విషయం కాదు. ఒకవేళ మీ తలపై కాకి తన్నిందంటే.. ఇది మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది. ఇది మీ లైఫ్ లో డబ్బుకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది.
తలపై కూర్చోవడం
ఒక కాకి ఒకరి తలపై కూర్చుంటే.. దానిని మరణానికి సంకేతంగా భావిస్తారు. ఇది శివ పురాణంలో ప్రస్తావించబడింది.
శారీరక సమస్యలు
కాకి తలపై తన్నితే మంచిది కాదని చాలా మంది నమ్ముతారు. ఇలా కాకి తన్నడం ఒక రకమైన ఆర్థిక లేదా శారీరక సమస్యకు సంకేతం కావొచ్చంటున్నారు జ్యోతిష్యులు.