బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్నవాళ్లు ఎలా ఉంటారో తెలుసా?
మన శరీరంలోని ప్రతిఒక్క భాగం మన వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను చెప్తాయని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. అయితే చాలా మందికి కాలి బొటన వేలి కంటే దాని పక్కన వేలే పొడుగ్గా ఉంటుంది. దీని గురించి సినిమాల్లో ఎక్కువగా చూసే ఉంటారు. అసలు బొటనవేలి కంటే పక్కన వేలు పొడుగ్గా ఉంటే అర్థమేంటో తెలుసుకుందాం పదండి.
మొండి స్వభావం
బొటనవేలు కంటే రెండో వేలు పొడవుగా ఉన్న వ్యక్తులు మొండి స్వభావం కలిగి ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీళ్లు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఎంతవరకైనా వెళ్తారు. వీళ్లకున్న మొండి స్వభావం వల్ల వీళ్లు ఇతరులను తమ ముందు నమస్కరించమని బలవంతం చేస్తారు. ఏదేమైనా వీరి మొండి స్వభావం వల్ల కొన్నిసార్లు తిప్పలు పడాల్సి వస్తుంది.
వీళ్లు ఎప్పటికీ వదులుకోరు
ఇలాంటి వారు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమించిన వారిని వదులుకోరు. అలాగే మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకుండా వదిలిపెట్టరు. వీళ్లు ఏ పని కోసం నిశ్చయించుకున్నారో.. దానిని పూర్తి చేయకుండా నిద్రపోరు. పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో వీరు ముందుంటారు. వీరికున్న అతిపెద్ద మంచి లక్షణం ఇది. దీనివల్ల మీరు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.
ఎవరి ముందు తలవంచరు
బొటనవేలు కంటే రెండో వేలు పెద్దగా ఉన్నవారు మొండి స్వభావం కలిగి ఉంటారు. అలాగే వీళ్లు ఎవరి ముందు అంత సులువుగా తలవంచరు. వీళ్లు తమ తప్పులను అంత తొందరగా ఒప్పుకోరు. అయితే వీరు తొందరపడి ఏ తప్పూ చేయరు. ఒకవేళ తప్పు చేసినా.. అంత సులువుగా ఒప్పుకోరు.
కాలి బొటనవేలు కంటే రెండో వేలు పొడవుగా ఉంటే అర్థమేంటి?
కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్నవారికి జ్యోతిషశాస్త్రంతో సంబంధం ఉన్న కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్తారు. జ్యోతిషశాస్త్రంలో.. ప్రతి రాశి నిర్దిష్ట శరీర భాగాలతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే పాదాలు మీన రాశితో సంబంధం కలిగి ఉంటాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు బొటనవేలి కంటే పక్కన వేళు పెద్దగా ఉంటే.. వీరు సున్నితమైన, ఊహాత్మక, దయగల వ్యక్తులు అని నమ్ముతారు.
Tonal Infection
ఊహాశక్తి, సృజనాత్మకత
బొటనవేలు కంటే రెండోవేలు పెద్దగా ఉన్నవారు ఊహాశక్తి, సృజనాత్మకతను కలిగి ఉంటారని నమ్ముతారు. విభిన్న ఆలోచనలు వీళ్ల మనస్సులో ఉంటాయి. రచన, చిత్రలేఖనం లేదా సంగీతం వంటి కళాత్మక రంగాల ద్వారా తమను తాము వ్యక్తీకరించడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారని నమ్ముతారు.
కరుణ, సహాయం
బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న వ్యక్తులు దయ, సానుభూతి స్వభావాన్ని చూపుతారు. వీళ్లు ఇతరుల భావోద్వేగాలతో గాఢంగా ముడిపడి ఉంటారని, వారు మంచి శ్రోత, మంచి సహాయక స్నేహితులుగా ఉంటారని నమ్ముతారు.
అంతర్దృష్టి, ఆధ్యాత్మికత
బొటనవేలి పక్కన వేలు పొడవు అంతర్దృష్టి, ఆధ్యాత్మిక అభిరుచిని సూచిస్తుంది. కాలి వేళ్లు ఇలా ఉన్న వారు ఆధ్యాత్మిక సత్యాన్ని కోరుకునే అవకాశం ఉంది. అలాగే ధ్యానం లేదా జ్యోతిషం వంటి అభ్యాసాలలో ఓదార్పును కనుగొంటారు. దీనితో పాటుగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీరు కూడా మారుతారు. మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీళ్లు తమ జీవితంలో ఒడిదుడుకులను దయ, వశ్యతతో అధిగమించగలరు.
ఎనర్జిటిక్ గా ఉంటారు
వీళ్లు చాలా శక్తివంతంగా ఉంటారు. అలాగే సాహసంతో ఉంటారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. కొత్త సవాల్లకు వీళ్లు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. ఇతరులను ప్రేరేపించడంలో, ప్రోత్సహించడంలో కూడా వీరు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వీళ్లు కలల శక్తిని నమ్ముతారు. అలాగే ఏదైనా సాధ్యమేనని నమ్ముతారు. స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటానికి ఇష్టపడతారు.