కలలో ఎవరైనా చనిపోయినట్టు కనిపిస్తే ఏమవుతుంది?
మనకు ఎన్నో కలలు పడుతుంటాయి. కలలో ఏడవడం, నవ్వడం లాంటివి చేస్తుంటారు. ఇది చాలా కామన్. జ్యోతిష్యం ప్రకారం.. మనకు పడే ప్రతి కల మనకు ఏదో ఒక సంకేతాన్ని ఇస్తుంది. అయితే ఎప్పుడో కొంతమందికి ఎవరో చనిపోయినట్టుగా కలలు పడుతుంటాయి. అసలు ఇలా కల పడితే ఏం అర్థమొస్తుంది? ఇది మనకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్రపోతున్నప్పుడు మనకు రకరకాల కలలు పడుతుంటాయి. చాలా మటుకు నిద్రలేచిన వెంటనే మర్చిపోతుంటాం. కానీ కొన్ని కలలను మాత్రం అస్సలు మర్చిపోలేం. మనకు పడే కలల్లో కొన్ని మంచివి ఉంటే.. మరికొన్ని చెడ్డవి ఉంటాయి. ఏదేమైనా ప్రతి కలకూ ఏదో ఒక అర్థం ఉంటుందంటారు జ్యోతిష్యులు. అయితే కొంతమందికి చావు గురించి కలలు పడుతుంటాయి. ఇలాంటి చావు కలలు పడ్డప్పుడు చాలా మంది బయటికే ఏడిచేస్తుంటారు. కానీ చావు కలలు మంచివేనంటున్నారు జ్యోతిష్యులు. పెద్దలైతే కలలో చినపోయిన వ్యక్తి ఆయుష్షు పెరుగుతుందని చెప్తుంటారు. అసలు చావు కలలు మనకు ఎలాంటి సంకేతాలను చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మరణం
రోగాలతో బాధపడుతున్న వ్యక్తి చనిపోయినట్టు మన కలలో చూడటం శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి కల పడితే ఆ వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుందని అర్థం వస్తుంది. అందుకే ఇలాంటి కల పడ్డప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు.
మీరు చనిపోయినట్టు..
వాస్తు శాస్త్రాల ప్రకారం.. మీ కలలో మీరు చనిపోయినట్టు కల పడితే కూడా మంచిదే. ఈ కల.. మీరు ఎక్కువ కాలం జీవించబోతున్నారనడాన్ని సూచిస్తుంది. ఇలా కల పడితే ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు.
కష్టాలు తీరిపోతాయి.
మీరే చనిపోయినట్టు మీరు కలలో చూడటం అంటే మీ జీవితంలోని అన్ని కష్టాలు ముగియబోతున్నాయని అర్థం వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది మీకు ఉన్న అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది.
చనిపోయిన వ్యక్తి గురించి కల
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీరు చనిపోయిన వ్యక్తి గురించి కలలు కంటుంటే.. మీరు వారితో అనుబంధం కలిగి ఉన్నారని అర్థం. ఇది వారిపై మీకున్న అనుబంధాన్ని సూచిస్తుంది.
కలలో పూర్వీకులను చూడటం
మీరు కలలో మీ తాతలు, ముత్తాతలను చూస్తే.. మీ కొన్ని కోరికలు నెరవేరకుండా మిగిలిపోయాయని అర్థం. అంటే మీకు ఏదో జరగబోతోందని ఈ కల సూచిస్తుంది.
అనారోగ్యంగా ఉండటం చూస్తే..
పురాణాల ప్రకారం.. మీరు కలలో అనారోగ్యంతో కనిపిస్తే అది అశుభంగా పరిగణించబడుతుంది. దీని అర్థం మీరు ఎన్నో సమస్యలను, బాధలను ఎదుర్కోవలసి ఉంటుంది.
అనారోగ్యంతో ఉన్న మరో వ్యక్తిని చూస్తే..
జ్యోతిషశాస్త్రం ప్రకారం కలలో.. ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైతే అది మంచిదని జ్యోతిష్యులు చెప్తారు. ఈ కల అర్తం మీ కష్టాలు తీరబోతున్నాయని అర్థం.