Zodiac sign: వర్షంతో ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే.. ఈ రాశివారి రియాక్షన్ ఇలానే ఉంటుంది..!
వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా చాలా కామన్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే.. ఇలా వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినప్పుడు ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో ఓసారి చూద్దాం..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా.. ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షం కారణంగా.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా చాలా కామన్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే.. ఇలా వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినప్పుడు ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
వర్షం కారణంగా.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు మేష రాశివారు చాలా చిరాకుపడతారు. ఈ క్రమంలో.. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తారు. ప్రభుత్వం తమ దగ్గర నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ తో డ్రైనేజ్ సిస్టమ్ ని బాగు చేయవచ్చు కదా... అంటూ విమర్శిస్తారు.
2.వృషభ రాశి..
వృషభ రాశివారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో.. వర్షం కారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు కూడా టెన్షన్ పడరు. ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది కాబట్టి.. ఆ సమయంలో చిప్స్ తిందాం.. అని ప్రశాంతంగా వాటిని తినేస్తూ ఉంటారు.
3.మిథున రాశి..
మిథున రాశివారు.. ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వర్షం కారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు కూడా.. వారు టెన్షన్ పడకుండా.. ఆ సమయంలోనూ.. తమ ఇతర పనులు చేసుకుంటారు. ఆ సమయంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసుకోవడం లాంటివి చేసుకుంటారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామనే బాధని పక్కన పెట్టి.. వర్షాన్ని ఆస్వాదిస్తారు. వర్షం పడినప్పుడు వచ్చే.. మట్టి వాసనను వీరు మరింత ఎక్కువగా ఆస్వాదిస్తారు. కుదిరితే వర్షంలో తడుస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు.
5.సింహ రాశి..
సింహ రాశివారు వర్షం కారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు.. అయ్యో అని బాధ పడరు. కానీ.. ఈ సమమంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి.. వేడి వేడిగా టీ, స్నాక్స్ లాంటివి దొరికితే బాగుండు అని చూస్తారు.
6.కన్య రాశి..
కన్య రాశివారు.. వర్షం కారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు.. వర్క్ గురించి ఆలోచిస్తారు. తమ టీమ్ వారందరూ ఆఫీస్ కి చేరుకొని ఉంటారని.. తాము మాత్రం ఇలా వర్షంలో ఇరుక్కుపోయామని బాధ పడతారు. తమ కారణంగా వర్క్ ఆగిపోతుందేమోనని టెన్షన్ పడతారు.
7.తుల రాశి..
తుల రాశివారు వర్షం కారణంగా.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు బాధపడరు. వెంటనే తమ స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడతారు. వారందిరినీ తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. వారితో కలిసి.. ఇంటికి చేరుకున్న తర్వాత ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేస్తారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు వర్షం కారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు చాలా చిరాకు పడతారు. రోడ్ల మీద కూడా వర్షం ఆగిపోయి ఉంటుందని.. ఆ నీటిలో దిగడానికి కూడా కుదరదని.. ఒకవేళ దిగితే.. తమ షూస్ పాడైపోతాయని వారు చిరాకు పడతారు.
9. ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పటికీ.. వారు ఎలాంటి టెన్షన్ పడరు. పైగా ఆ సమయంలో కారులో తమతో ఉన్నవారితో కలిసి ఏదైనా సిల్లీ గేమ్స్ ఆడటానికి ప్లాన్ వేస్తూ ఉంటారు.
10.మకర రాశి..
వర్షం కారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు మకర రాశివారు.. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటారు. వీరు ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడరు. గతాన్ని తలుచుకుంటారు. లేదంటే.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తారు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు వర్షం కారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు చాలా టెన్షన్ పడతారు. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటామా అని ఎదురు చూస్తారు. ఇంటికి వెళ్లి.. అమ్మ చేతి టీ తాగాలని ఆరాటపడతారు.
12.మీన రాశి..
మీన రాశివారు.. వర్షం కారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఈ ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ అవ్వదులే కానీ... తాము కాసేపు పడుకుంటామని.. పక్క వారికి చెప్పి ఓచిన్నపాటి కునుకు తీస్తారు.