Your Weekly Horoscopes:ఓ రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతోంది
Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
telugu astrology
19-5-24 నుంచి 25-5-24 వరకూ వార ఫలాలు
మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
శుభవార్తలు వింటారు.సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది.ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.బంధుమిత్రులతో నూతన ప్రయత్న కార్యాలకు గురించి చర్చిస్తారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది.తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు.కీలక పనుల యందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. సంఘంలో మీ మాట తీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలెను.చెడు స్నేహాలు కు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
ఎన్ని ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనుల్లో పట్టుదలతో పూర్తి చేయాలి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.కొత్త సమస్యలు చికాకు పుట్టించును.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.కీలకమైన సమస్య ను బుద్ధి బలంతో పరిష్కరించాలి.ఉద్యోగ వ్యాపారంలో శ్రమ అధికంగా ఉంటుంది.చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త గా ఉండాలి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ వారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.వివాదాలకు దూరంగా ఉండండి.దీర్ఘకాలిక అనారోగ్య విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యాపారములో పెద్దలు సూచన మేరకు పెట్టుబడులు పెట్టుకోవాలి.వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకొనవలెను.అన్నదమ్ములు తో సఖ్యతగా మెలగవలెను. ఉద్యోగాలలో సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు అందుతాయి.వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు.చేసే పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.విలువైన వస్తువులు యందు జాగ్రత్తగా ఉండాలి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
గతంలో పెట్టిన పెట్టుబడులు నుంచి మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పెద్దల యొక్క మన్ననలు లభించను.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు.ఇతరులతో వాదనలు వివాదాలకు దూరంగా ఉండాలి.కొత్త సమస్యలు చికాకు పుట్టించును.దీర్ఘకాలిక అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడతాయి.వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ధన నష్టం కలుగవచ్చు. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి.మనసునందు ఆందోళనకరంగా ఉంటుంది. గృహ నిర్మాణాధిపనులో ఆటంకాలు ఏర్పడవచ్చు.
telugu astrology
సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
కోపాన్ని అదుపు అదుపులో ఉంచుకుని వ్యవహరించాలి.ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు మాటలు తూలకొండ చూసుకోవాలి.బంధుమిత్రులతో కొద్దిపాటి మనస్పర్థలు రావచ్చు.మానసికంగా బలహీనంగా ఉంటుంది.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కొద్దిగా ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్న అవసరానికి ఏదో విధంగా ధనం చేకూరును.మనస్సునందు ఆందోళనగా ఉంటుంది.తలపెట్టిన పనులు పట్టుదల తోటి పూర్తి చేయాలి.గృహమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని కోవాలి.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి అగును.ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.నూతన పెట్టుబడులకు అనుకూల వాతావరణం.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.అకారణంగా భాగోద్వేగం చేత కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చు.వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది.ప్రయాణాలు అనుకూలిస్తాయి.విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో ప్రతిభ తగ్గ గౌరవం లభించును.ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు.అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభించును.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి ,విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.కీలకమైన విషయాలు లో ధైర్యంగా ముందడుగు వేయండి.కుటుంబ సభ్యులు యొక్క మద్దతు మీకు ఉంటుంది. అనవసరమైన విషయాలు తో సమయం వృధా చేయకుండా చూడండి.కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి.చెడు అలవాట్ల వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు.విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును.వివాదాలకు దూరంగా ఉండండి.తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడతాయి.భూ గృహ క్రయవిక్రయాలు వాయిదా వేట మంచిది. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండును.జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు కలగవచ్చు.దీర్ఘకాలిక సమస్యలు తీరి కొంతమేర ప్రశాంతత లభించును. బంధుమిత్రులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి.
telugu astrology
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
గృహంలో శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంఘంలో మాట తీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడతారు.రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి.విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.గృహ నిర్మాణాధి పనులు ముందుకు సాగుతాయి.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు.ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగును.పెట్టిన పెట్టుబడులు కు మించి ధన లాభం కలుగుతుంది.
telugu astrology
ధనుస్సు (మూల,పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
శారీరకంగా మానసికంగా బాగుంటుంది.కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.తలపెట్టిన అన్ని పనులు అనుకున్నట్లుగా జరుగును.పెట్టుబడులకు మించి ధన లాభం కలుగుతుంది.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. గృహంలో ఆనందకరమైన వాతావరణం.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.
telugu astrology
మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఇతరులతో వాదనలు వలన కొత్త సమస్యలు ఏర్పడతాయి.కీలకమైన సమస్య ను బుద్ధిబలంతో పరిష్కరించుకోవాలి. పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.విలువైన వస్తువుల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.చేయ ఖర్చుల యందు జాగ్రత్త వహించాలి.సంఘంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభించును.జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు ఏర్పడగలవు. దీర్ఘకాలిక సమస్య కు పరిష్కారం లభించి ప్రశాంతత లభించును.ప్రయాణాల్లో తగు జాగ్రత్త తీసుకోవాలి.ఉద్యోగాలలో సహోద్యోగులు వలన సహాయ సహకారాలు లభించును.మీరంటే గిట్టని వారి తోటి కొద్దిపాటి అపకారం జరగవచ్చు జాగ్రత్త. తలపెట్టిన పనులు పూర్తగును.
telugu astrology
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
భార్య భర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్థలు రావచ్చు.అధిక కోపం వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడగలవు.కొంత సమయాన్ని పిల్లలతో సరదాగా గడపండి.ఆరోగ్య సమస్యల మీద తగు శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఆకస్మిక అధిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.ఇతరుల యొక్క విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఈ కారణం చేత మీయొక్క గౌరవం తగ్గుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.గృహ నిర్మాణాధి పనులు ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.సంతానం అభివృద్ధి లోకి వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4,ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు.తలపెట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి.దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడి ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు.విలాస వస్తువులు కొనుగోలుకు అధిక ధనం ఖర్చు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి లు ఎన్ని ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.కొన్ని సమస్యలు మానసిక మానసికంగా బాధ కలిగించవచ్చు. గృహంలో పెద్ద వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొవాలి.
మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)