Weekly Horoscope: ఈ రాశి వారికి వారాంతంలో ఆర్థికంగా కలిసి వచ్చును
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు. స్థిరాస్తి కొనుగోలు దేశంలో తగు జాగ్రత్తలు వహించాలి. ఈ ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి.వృత్తి వ్యాపారాలలో లాభాలు.
Daily Horoscope 2022 - 23
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనుకున్న పనులలో జాప్యం జరిగిన పట్టుదలతోపూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో ధనలాభం. సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు. సత్కర్మలు చేస్తారు. దేవాలయ సందర్శన. అన్నదమ్ముల ఆదరణ. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు వారాంతంలో బావుంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.నిరుద్యోగులకు శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. ఈశ్వర సందర్శనం మంచిది.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు పదోన్నతులు ఆ బదిలీలు విషయంలో సానుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.నూతన ఆలోచనలు చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి.అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం. ప్రయాణాలు లాభిస్తాయి. స్థానచలనం. ఆదాయానికి మించిన ఖర్చులు. స్థిరాస్తి కొనుగోలు దేశంలో తగు జాగ్రత్తలు వహించాలి. ఈ ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి.వృత్తి వ్యాపారాలలో లాభాలు. తలపెట్టిన కార్యక్రమాలు వారాంతంలో పూర్తి చేస్తారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణం. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చంద్రశ్లోకం చదవాలి.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఆదాయ మార్గాలు సామాన్యంగా ఉంటాయి. ప్రాంతంలో ఆర్థిక పరమైన చిక్కులు. రుణాలు చేయవలసి రావచ్చు.ఉద్యోగులకు పదోన్నతులు. అనుకూలమైన బదిలీలు. దానధర్మాలు చేస్తారు. శుభ కార్యాచరణ వలన ధనవ్యయం. గృహంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైన పౌరుషాలకు పోయినా కొత్త సమస్యలు ఏర్పడును.వృత్తి వ్యాపారాలయందు సామాన్యంగా ఉంటుంది. చేయు పనులలో సమయానుకూల నిర్ణయాలు తీసుకోకపోవడం వలన విఫలమవుతారు.అన్నదమ్ములు మిత్రులతో వివాదాలు. శారీరక శ్రమ. భూ గృహ విక్రయములు వాయిదా వేసుకుంటే మంచిది. తలపెట్టిన పనులువాయిదా పడతాయి. వారం మధ్యలో కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. బుద్ధి చాతుర్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పై అధికారుల ద్వారా లాభం చేకూరును. వివాహ ప్రయత్నాలు ఫలించును. స్థానచలనం. సూర్యగ్రహ ధ్యానం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల కలయిక. సోదరులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.కొత్త వ్యాపారాల ఆలోచనలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. పరోపకారం చేస్తారు. మిత్రుల యొక్క ఆదరణ పొందుతారు. దైవ చింతన. అవసరాలకు ధనం చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. పై అధికారులతో ఇబ్బందులు. స్థిరాస్తి క్రయవిక్రయాల యందు ఆచి తూచి వ్యవహరించాలి.మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు కష్టపడాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శారీరక కష్టం.ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువు రుణ బాధలు. సంఘంలో చికాకులు. గృహము నందు ప్రతికూల వాతావరణం. వృత్తి వ్యాపారులకు సామాన్యం. జీవన విధానం సాఫీగా సాగును. బంధుమిత్రులతో అకారణంగా కలహాలు. నిస్సత్తువ. సంఘంలో జాగ్రత్తగా మాట్లాడవలెను. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ విషయంలో ప్రతికూల వాతావరణం. గృహంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి కొనుగోలు వాయిదా వేయడం మంచిది. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగ పదోన్నతులు బదిలీలు పట్టుదలతో సాధించవచ్చును. వారాంతంలో ఆర్థికంగా కలిసి వచ్చును. లక్ష్మీధ్యానం శుభప్రదం.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా కలిసి వచ్చును.ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఉద్యోగులకు పదోన్నతులు అనుకూలమైన బదిలీలు.కుటుంబ వృద్ధి. శత్రువుల పై పైచేయి సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. మంచి పనులకు ధనాన్ని వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలను పొందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు. వృత్తి ఉద్యోగాలకు అనుకూలం. ఆకస్మిక ధన లాభం. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సానుకూలం. అనుకున్న పనులు జాప్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కళత్ర సౌఖ్యం. ప్రయాణాల్లో తగు జాగ్రత్త వహించాలి. శ్రీరామనామాన్ని జపించండి.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
రుణబాధలు తొలగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రోగ నివారణ. సంఘంలో తెలివి గా వ్యవహరిస్తారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబం నందు సమస్యలు తొలగుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.అన్నదమ్ముల సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించును. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పై అధికారుల నుండి ఒత్తిడి. శారీరక శ్రమ. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. వారాంతంలో ఆర్థిక సమస్యలు కొంతమేర రుణం చేయవలసి రావచ్చు.ఆదిత్య హృదయం చదవడం మంచి
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. తలపెట్టిన కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేస్తారు.శుభకార్యాలకు ఖర్చు చేస్తారు.ఉద్యోగులకు పదోన్నతులు అనుకూలమైన బదిలీలు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. పోయిన వస్తువులు తిరిగి లభించును. సంతాన విషయంలో జాగ్రత్త వహించవలెను. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. రుణ శత్రు బాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో చికాకులు. వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించాలి. భూ గృహ క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వారాంతంలో ధనాదాయం మార్గాలు బాగుంటాయి. శివారాధన శుభకరం.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. సామాన్య జీవన విధానం.పోయిన ధనాన్ని తిరిగి రాబట్టుకుంటారు. దేవాలయ సందర్శన. ఇతరులకు సహకారం చేసే మనస్తత్వం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారులకు ధనలాభం. ఉద్యోగులకు ప్రమోషన్లు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారాల నుండి విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం. వారాంతంలో కొన్ని సమస్యల నుండి బయట పడతారు. అన్నదమ్ములు సహకారం లభిస్తుంది. శత్రు బాధలు తొలగుతాయి. రావలసిన బాకీలు లో జాప్యం. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విష్ణు నామస్మరణ ఉత్తమం.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
వివాహ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమవుతాయి.ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు.ఉద్యోగస్తులకు స్థానచలనం.శారీరక శ్రమ, ఆరోగ్య పరమైన ఆలోచనలు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.జీవన విధానం సాఫీగా ఉండును. కష్టనష్టాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. రుణబాధలు కొంతవరకూ తీరును. దీర్ఘకాలిక రోగాల నుండి కొంత వరకు ఉపశమనం. బంధుమిత్రులతో అనవసరమైన కలహాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో ప్రతికూలమైన వాతావరణం. కుటుంబము నందు తగిన జాగ్రత్తలు వహించాలి. అన్నదమ్ముల సహకారం అంతంతమాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో సామాన్యం. ఆదాయ మార్గాలు కలిసిరాకపోవుట. అనవసరమైన ఖర్చు చేస్తారు. ప్రయాణాలలో చోర భయం. వారాంతంలో కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. శ్రీవేంకటేశ్వరుని ఆరాధించడం మంచిది.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నారు రుణ సమస్యలు కొంత వరకు ఉపశమనం కలిగించును. సంఘంలో పైచేయి కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు.అనుకూలమైన జీవన విధానం. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబ వృద్ధి. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. తలపెట్టిన పనులు జాప్యం ఏర్పడిన పట్టుదలతో ఉద్యోగులకు స్థానచలనం. చేతివృత్తుల వారు కష్టించిన విజయం సాధిస్తారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలకు పరిష్కార మార్గం లభించును. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు ఆచితూచి వ్యవహరించవలెను. వారాంతంలో కొంతమేర ఆర్థిక ఇబ్బందులు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. లక్ష్మీధ్యానం శుభప్రదం.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ధనాదాయం మార్గాలు బాగుంటాయి.సుఖ జీవనం. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. సంతాన మూలకంగా లాభం. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆస్తి విషయంలో ఏర్పడిన చిక్కులు తొలగును. ఉద్యోగులు పై అధికారుల యొక్క మన్ననలను పొందుతారు.సంఘంలో కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగి ఆనందంగా గడుపుతారు.రుణ శత్రుబాధలు ఉన్నప్పటికీ అంతగా బాధించవు. బంధుమిత్రుల సహకారం సామాన్యంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో కొంత వరకు రుణం చేయవలసి రావచ్చు. శ్రీవేంకటేశ్వరుని ఆరాధించడం మంచిది.