Vastu Tips: కరివేపాకు మొక్కను ఇంట్లో ఏ మూలలో నాటాలి..?
చెట్లు, మొక్కలకు సరైన దిశ వాస్తు శాస్త్రంలో సూచించారు. తద్వారా ఇది ఆనందం , శ్రేయస్సును కలిగిస్తుంది. వాటిలో కరివేపాకు మొక్క కూడా ఒకటి. ఇంట్లో ఏ దిశలో కరివేపాకు మొక్కలను నాటడం శుభప్రదంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరూ డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే అనుకుంటారు. కానీ, చాలా మందికి ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిల్వదు. కొందరు ఎంత సంతోషంగా ఉండాలన్నా, సమస్యలు ఎదురౌతూనే ఉంటాయి. అయితే, వాస్తు ప్రకారం మనం ఆ సమస్యలను పరిష్కరించవచ్చట. వాస్తు శాస్త్రం ప్రకారం, వాస్తు దోషాలను తొలగించడానికి , జీవితంలో ఆనందం శ్రేయస్సు కోసం అనేక రకాల నివారణలు సూచించాయి. మనిషి జీవితంలో చెట్లు , మొక్కలు చాలా ముఖ్యమైనవి. చాలా మంది తమ ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే, చాలా సార్లు, తెలిసి లేదా తెలియక, అవి అశుభ ఫలితాలకు కూడా దారి తీస్తాయి. చెట్లు, మొక్కలకు సరైన దిశ వాస్తు శాస్త్రంలో సూచించారు. తద్వారా ఇది ఆనందం , శ్రేయస్సును కలిగిస్తుంది. వాటిలో కరివేపాకు మొక్క కూడా ఒకటి. ఇంట్లో ఏ దిశలో కరివేపాకు మొక్కలను నాటడం శుభప్రదంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి పశ్చిమ దిశలో కరివేపాకును నాటండి
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి పశ్చిమ దిక్కు చంద్రుని దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో ఏదైనా దేశీయ మొక్కను నాటడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ దిశలో కరివేపాకు మొక్కను నాటడం వల్ల మనిషి ఆరోగ్యం బాగుంటుంది.
కరివేపాకు మొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది
ఇంటి తోటలో కరివేపాకును నాటడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని చెబుతారు.
వాస్తు కరివేపాకు మొక్క
కరివేపాకులను జ్యోతిష్య శాస్త్రంలోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కరివేపాకు క్యాన్సర్ , డయాబెటిస్ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని ఆకులలో యాంటీ మ్యుటాజెనిక్ గుణాలు ఉన్నాయి, ఇవి కడుపు క్యాన్సర్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాదు గుండె జబ్బులు రాకుండా చేయడంలో ఇది చాలా మేలు చేస్తుంది. కరివేపాకు కళ్లకు కూడా మంచిదని భావిస్తారు.
ఇంటి ఆగ్నేయ దిశలో కరివేపాకులను నాటండి
నిపుణుల సూచనల ప్రకారం, ఇంటి ఆగ్నేయ మూలలో కరివేపాకులను నాటడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. దీని ద్వారా, సంపద , శ్రేయస్సు పొందవచ్చు. కాబట్టి ఈ దిశలో కరివేపాకు మొక్కను నాటండి.