వార ఫలాలు( 28 ఫిబ్రవరి నుంచి 5 మార్చి వరకు)
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఖర్చులు పెట్టుబడులుంటాయి. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి లభిస్తుంది. విందులు, విహారాలు, వినోదాలుంటాయి. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కీర్తి ప్రతిష్ఠల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆత్మ విశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతల నిర్వహణలో సంతోషం ఏర్పడుతుంది. సంతృప్తి లభిస్తుంది. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతలు అధికం అవుతాయి. అన్ని పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త పనులపై దృష్టి సారిస్తారు. ప్రయోజనాలుంటాయి. సంతోషం కలుగుతుంది. స్త్రీ వర్గీయుల సహకారం లభిస్తుంది. పెద్దల అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు గౌరవం పెరుగుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉన్నా శ్రమ తప్పదు. కుటుంబంలో అనుబంధాలు మెరుగుపడతాయి. బ్యాంకు వ్యవహారాలు పూర్తి చేసుకునే సమయం.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఖర్చులు పెట్టుబడులుంటాయి. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి లభిస్తుంది. విందులు, విహారాలు, వినోదాలుంటాయి. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కీర్తి ప్రతిష్ఠల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆత్మ విశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతల నిర్వహణలో సంతోషం ఏర్పడుతుంది. సంతృప్తి లభిస్తుంది. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. దూర ప్రయాణ భావనలుంటాయి. స్త్రీ వర్గ సహకారం లభిస్తుంది. ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగాదుల్లో అనుకోని సమస్యలుంటాయి. సామాజిక గౌరవం తగ్గే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయం జాగ్రత్త అవసరం. ఖర్చులు పెట్టుబడులుంటాయి. సంతోషంగా కాలం గడుపుతారు. విశ్రాంతి లభిస్తుంది. విందులు వినోదాలుంటాయి. ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత పెరుగుతుంది. అధికారిక కార్యక్రమాలను నిర్వహించే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. శ్రమాధిక్యం ఉంటుంది. అందరినీ తొందరగా నమ్మరాదు. భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఉ:టుంది. అధికారిక పరిచయాలున్నా అప్రమత్తంగా మెలగాలి. కార్యనిర్వహణలో ప్రయోజనాలు చేకూరుతాయి. లాభాలు సంతోషాన్ని సంతృప్తిని ఇస్తాయి. నిర్ణయాదులకు అనుకూలమైన సమయం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఉన్నత విద్య ఉద్యోగాదులపై ఆలోచన పెడతారు. సుదూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. పోటీరంగంలో గుర్తింపు ఏర్పడుతుంది. గెలుపు ఉన్నప్పటికీ శ్రమ అనేది తప్పదు. మొండితనం పెరగవద్దు. వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి. ఖర్చలు పెట్టుబడుల వల్ల సామాజిక హోదా పెంచుకుంటారు. విశ్రాంతి లభిస్తుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలు ఉంటాయి. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. కొత్త నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. స్త్రీలతో సమస్యలు. కాంట్రాక్టు వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతానంతో సమస్యలుంటాయి. అన్ని పనుల్లోనూ చికాకులు ఏర్పడతాయి. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉ:టుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. సుదూర ప్రయాణాలుంటాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు, అనుబంధాలపై ప్రత్యేకదృష్టి సారిస్తారు. పాతమిత్రుల కలయిక పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. క్రియేటివీటీ పెరుగుతుంది. సంతానవర్గ సంతృప్తి పెరుగుతుంది. నిర్ణయాదుల్లో వేగం పెరుగుతుంది. సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులుంటాయి. గృహవాహనాది నిర్ణయాల్లో ఆచి, తూచి వ్యవహరిస్తారు. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు వస్తాయి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వ్యతిరేక ప్రభావాలు అధికం అవుతాయి. అన్ని పనుల్లోనూ పోటీలు, ఒత్తిడులుంటాయి. విజయంపై దృష్టి ఉన్నా శ్రమ తప్పకపోవచ్చు. గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లోనూ కొంత జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. పితృవర్గ సహకారం లభిస్తుంది. అధికారిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. స్నేహాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలుంటాయి. సంతానవర్గసంతోషం ఏర్పడుతుంది. క్రియేటివిటీతో పనిచేస్తారు. స్త్రీ వర్గంతో సంప్రదింపులు. కాంట్రాక్టు వ్యవహారాలు ఉంటాయి. వ్యాపారాల్లో రాణిస్తారు. దగ్గరి ప్రయాణాలు. సహకారం లభిస్తుంది. కుటుంబ, ఆర్థికాంశాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. మాటల్లో అధికారిక ధోరణి కూడదు. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు, ఒత్తిడులు చికాకులుంటాయి. విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. సౌకర్యాలు పెంచుకుంటారు. శ్రమతో కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబంలో సంతృప్తి పెరుగుతుంది. ఆర్థిక నిర్ణయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మాటల్లో చమత్కారం పెరుగుతుంది. విందులు వినోదాలకై కాలం, ధనం, వెచిచంచే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఇబ్బందిపడే అవకాశం. నిర్ణయాదులు శ్రమకు గురి చేస్తాయి. తొందరపాటు కూడదు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి.
సంప్రదింపులకు అనుకూలమైన సమయం. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. ఇతరుల సహకారం లభిస్తుంది. నిర్ణయాదుల్లో సంతోషం ఏర్పడుతుంది. సంతృప్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారిక వ్యవహారాలకోసం కొంత కాలం, ధనం వెచ్చించాలి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. సౌకర్యాలు పెంచుకుంటారు. శ్రమ ఉన్నా ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది.
కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తారు. బ్యాంకు వ్యవహారాలు పూర్తి అవుతాయి. నిల్వధనంపై దృష్టి పెరుగుతుంది. బంధువర్గంకోసం సమయం వెచ్చిస్తారు. విందులు, వినోదాలు, విహారాలు, ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. మాట విలువ పెరుగుతుంది. చమత్కారంగా మాట్లాడుతారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దలతో అనుకూలత పెరుగుతుంది. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. సంప్రదింపులుంటాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానంతో ప్రయాణాలు.