Today Horoscope: ఓ రాశి హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకం
Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు శత్రువులపై పై చెయ్యి సాధిస్తారు. వ్యవహారం యందు విజయం సాధిస్తారు. నూతన వస్తువుల సేకరణ చేస్తారు.బంధువులు మిత్రులు తో అత్యంత కీలక విషయాలు గురించి చర్చిస్తారు.
25 -1-2024 గురు వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో నూతన ప్రయత్న కార్యాలకు గురించి చర్చిస్తారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతతను పొందవచ్చు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఓం అంగారకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఇతరుల యొక్క విషయంలో జోక్యం చేసుకోవద్దు ఈ కారణం చేత మీయొక్క గౌరవం తగ్గుతుంది. కొంత సమయాన్ని పిల్లలతో సరదాగా గడపండి.ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త గా ఉండాలి. కులదేవత నామస్మరణ చేయండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
శత్రువులపై పై చెయ్యి సాధిస్తారు. వ్యవహారం యందు విజయం సాధిస్తారు. నూతన వస్తువుల సేకరణ చేస్తారు.బంధువులు మిత్రులు తో అత్యంత కీలక విషయాలు గురించి చర్చిస్తారు. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది .నూతన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ఆలోచనలు నిజమవుతాయి.అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండును. ఓం నాగేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
పనుల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. సంఘంలో మీ మాట తీరు తో అందరినీ ఆకట్టుకుంటారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలెను. ముఖ్యమైన వ్యవహారాలు లో ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని వ్యవహారాలను పూర్తి చేయగలరు.సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఓం నారాయణ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
కొన్ని సమస్యలు మానసిక మానసికంగా బాధ కలిగించవచ్చు. గృహమునందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. విసుగుదల అలసట ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడవచ్చు. వ్యాపార మందు భాగస్తుల మూలకంగా కష్టనష్టాలు ఏర్పడగలవు. ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పనులు లో చిన్న పాటి ఆటంకాలు ఎదురవుతాయి. ఓం సోమాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. సంతానం అభివృద్ధి లోకి వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపార యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చేసే వ్యవహారంలో నూతన ఉత్తేజం తోటి చేస్తారు. ఆత్మవిశ్వాసం తో పనులన్నీ ముందు కు సాగును. ఓం బృహస్పతియే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు.విలాస వస్తువులు కొనుగోలుకు అధిక ధనం చేస్తారు. ఉద్యోగాల్లో లో పని ఒత్తిడి లు ఎన్ని ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు.ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ గ్రామ దేవత నామస్మరణ చేయండి శుభ ఫలితాలను పొందండి;
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం నందు శ్రద్ధ వహించవలెను. కొన్ని కొత్త సమస్యలు చికాకు పుట్టించును. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కీలకమైన సమస్య బుద్ధి బలం తోటి పరిష్కరించాలి. ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
చెడు స్నేహాలు దూరంగా ఉండాలి వాదోపవాదాలకు దూరంగా ఉండవలెను. ఆర్థిక ఇబ్బంది ఏర్పడి కొద్దిపాటి రుణాలు చేయవలసి వచ్చును. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడి ఆగిపోవచ్చు. శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు రాగలవు. కీలక విషయాలు లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు కొంత చిరాకు పరుస్తాయి. ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.ఉద్యోగాలలో సహోద్యోగులు సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానం అందుతుంది.చిన్ననాటి మిత్రులు తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న అవకాశాలు లభిస్తాయి. ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
అన్ని వర్గాల వారు నైపుణ్యం ప్రదర్శిస్తారు. శారీరక సుఖం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.నూతన పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. గత కొంతకాలంగా పూర్తి కాని పనులు పూర్తి కాగలవు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాదాలు నుంచి బయటపడతారు. ఈరోజు మీ ఇష్టదేవతా స్మరణ చేయండి శుభ ఫలితాలను పొందండి
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)
వివాదాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యం విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యాపారములో పెద్దలు సూచనలు సలహాలు తీసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకొనవలెను. అన్నదమ్ముల తోటి సఖ్యతగా మెలగవలెను. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా ఆందోళన గా ఉంటుంది.ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
ఓం కాలభైరవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.