MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope:ఓ రాశివారి శత్రువులు మిత్రులుగా మారి సహాయం చేస్తారు..

Today Horoscope:ఓ రాశివారి శత్రువులు మిత్రులుగా మారి సహాయం చేస్తారు..

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 22 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- అనుకున్న సమయానికే ముఖ్యమైన పనులను పూర్తవుతాయి. మీరు అనుకుంటున్న భూమికి సంబంధించిన విషయాలు ఫలిస్తాయి. ఇంట్లో వారి సహాయ, సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయి.  ఆర్థిక వ్యవహారాలు లాభాదాయకంగా ఉంటాయి. వృత్తి  వ్యాపారాలు మంచి లాభాల్లో ఉంటాయి. కుంటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. పిల్లల ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముఖ్యమైన పనులను పూర్తి చేసే తీరుతారు. వృత్తి ఉద్యోగులు తమ నిర్ణయాన్ని ఉన్నపాటుగా మార్చుకోవాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగులకు పనిభారం బాగా పెరుగుతుంది. 
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- అప్పుల బాధలు పెరుగుతాయి. అవసరానికి ఇంట్లో వారు మీకు డబ్బు సహాయం చేయక ఇబ్బంది పడతారు. డబ్బు విషయంలో ఒకరితో గొడవలు వస్తాయి.  ఇతరులతో వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. వ్యాపార విస్తరణ ముందుకు సాగదు. ప్రయాణాల వల్ల నష్టం జరుగుతుంది. 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఆదాయం ఎక్కువగా, ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా మొదలు పెట్టిన పనులను మాత్రం సకాలంలోనే పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  వ్యాపారులకు పెట్టుబడులు బాగా వస్తాయి. వృత్తి ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ఈ రోజు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్థికి సంబంధించి వివాదం ఒకరి జోక్యంతో పరిష్కరించబడుతుంది. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిరుద్యోగులు బాగా కష్టపడతారు. శత్రువులు కాస్త మిత్రులుగా మారుతారు. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- ఈ రోజు నిరుద్యోగులు శుభవార్త వింటారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. అప్పుల బాధలు చాలా వరకు తీరిపోతాయి.  వ్యాపారులు నష్టాల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగులు సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతారు. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- పనిభారం పెరగడంతో విశ్రాంతి తీసుకునే సమయం లేక బాగా ఒత్తిడికి గురవుతారు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఒక విషయంలో బంధుమిత్రులతో వాదిస్తారు.  వృత్తి వ్యాపారులకు శత్రువుల భయం పెరుగుతుంది. మొదలుపెట్టిన పనులు ముందకు సాగవు. ఉద్యోగులకు పని ఎక్కువగా ఉంటుంది. 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగులకు అధికారులతో మంచి సత్సంబంధం ఉంటుంది. మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారులు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు. నూతన వ్యాపార ఆలోచన కార్యరూపం దాల్చదు. ఒకవిషయంపై ఇతరులతో గొడవకు దిగుతారు. ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగులకు వేరేవారితో విభేదాలు వస్తాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త పనికి రాదు. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మెరుగుపడుతుంది. భూమికి సంబంధించిన గొడవల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల సలహాలు మీ పనులను సులభతరం చేస్తాయి. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-మీరు ఊహించని విధంగా ఖర్చులు బాగా పెరుగుతాయి. డబ్బు విషయంలో ఒకరితో మాట పడతారు. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. ఆదాయం తగ్గుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈ రోజు ఉద్యోగులకు ఒత్తిడిని కలిగిస్తుంది. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులను చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మంచి లాభాల్లో నడుస్తాయి. నిరుద్యోగులు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఇన్నాళ్లుగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. పిల్లల చదువుపై ఓ కన్నేసి ఉంచాలి. ఉద్యోగులకు సంస్థలో మంచి పేరు వస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved