MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు సాధ్యం కాని హామీలు కు దూరంగా ఉండాలి

Today Horoscope: ఓ రాశివారు సాధ్యం కాని హామీలు కు దూరంగా ఉండాలి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సాధ్యం కాని హామీలు కు దూరంగా ఉండాలి. విద్యార్థులు ఆందోళన చెందుతారు.ఇతరులతో అకారణ కలహాలు . 

ramya Sridhar | Updated : Nov 21 2023, 04:23 AM
7 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
Asianet Image

21-11-2023, మంగళవారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

పంచాంగం
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               
తేది :    21నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం 
మంగళవారం
తిథి :- నవమి/రాత్రి 12.53 ని॥వరకు
నక్షత్రం :- శతభిషం రాత్రి 8.36 ని॥వరకు
యోగం:- వ్యాఘాతం రాత్రి 6.57 ని॥వరకు
కరణం:- బాలవ మ॥2.05 కౌలవ రాత్రి 12.53 ని॥వరకు
అమృత ఘడియలు:- మ॥1.54 ని॥ల 3.23 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:25 ని॥ల ఉ॥ 09:10ని॥వరకు  తిరిగి రా.10:28 ని॥ల రా.11:20 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥శే 6.26 ని॥వరకు తిరిగి రాత్రి 2.33 ని॥ల 4.03 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల ఉ॥10:30 ని॥వరకు
సూర్యోదయం :- 6.09ని॥లకు
సూర్యాస్తమయం:- 5.21ని॥లకు


 

213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (సాధన తార)
భరణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
కృత్తిక నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-వ్యవహారాలలో కోపము ఒత్తిడి ఎక్కువగా నుండును. సమాజంలో అపనిందులు రాగలవు. ఆరోగ్యం సామాన్యంగా ఉండును. శారీరక శ్రమ పెరుగుతుంది. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను .ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధు వర్గం తో విమర్శలు రాగలవు. సాధ్యం కాని హామీలు కు దూరంగా ఉండాలి. విద్యార్థులు ఆందోళన చెందుతారు.ఇతరులతో అకారణ కలహాలు . ప్రముఖులతో పరిచయాలు ఏర్పడను. ఓం భాస్కరాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (క్షేమతార)
రోహిణి నక్షత్రం వారికి  (విపత్తార)
మృగశిర నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు సజావుగా జరుగును. నూతన వస్తు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సాంఘికముగా గౌరవ మర్యాదలు పెరుగును. భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. తోటి వారిని  అధిగమించి పురోగమిస్తారు. సమయానకూలముగా తెలివితేటలతో సకల కార్యములను చక్కగా సాధించుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఓం దుర్గా యై నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (సంపత్తార)
ఆరుద్ర నక్షత్రం వారికి  (జన్మ తార)
పునర్వసు నక్షత్రం వారికి  (పరమైత్ర తార)

దిన ఫలం:-పనులలో శారీరక కష్టం పెరుగును. వ్యక్తిగత లేక వృత్తిపరమైన వ్యవహారాలలో ఆత్మ పరిశీలన అవసరము. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు కలుగును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. మానసిక ఆందోళన నిరాసక్త కలుగును. సహోద్యోగులతో  వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఓం గణపతయే నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
పుష్యమి నక్షత్రం వారికి  (మిత్ర తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (నైధన తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములలో అధికశ్రమైనను తగినంత ధనాదాయం లభిస్తుంది. పనులలో తెలివితేటలు ప్రదర్శిస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. వ్యసనముల యందు ఆసక్తి పెరగకుండా చూసుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. మానసికంగా భయాందోళన ఉంటుంది. తలచిన పనులు పూర్తిగా నెరవేరకపోవుట వలన చికాకుగా నుండను. ఓం రాహువే నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (సాధన తార)
పూ.ఫ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-చేతి వృత్తుల వారికి  అధిక కష్టముగా నుండును. సమాజంలో విమర్శలకు గురియగుదురు. కుటుంబ విషయాలలో అన్యోన్యత తగ్గి పేచీలు రాగలవు. ఉద్యోగాల్లో అధికారుల ఆదేశాలను పాటించడం మంచిది. వ్యవహార విషయాలలో నిదానముగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పోయిన వస్తువులు లభించును. స్త్రీల తో వాదోపవాదములకు దూరంగా ఉండాలి. ఓం నీలకంఠాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (క్షేమతార)
హస్త నక్షత్రం వారికి  (విపత్తార)
చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-వ్యాపారస్తులు అఖండ లాభములను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగను. వ్యక్తిగత విషయాలలో మీ ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొనవలెను. ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అత్యంత ప్రకాశవంతముగా ఉల్లాసంగా ఉంటారు. కళల వైపు మొగ్గు చూపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాల కలిసి వచ్చును. ఓం నమో నారాయణాయ అని జపించండి .శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)
స్వాతి నక్షత్రం వారికి (జన్మ తార)
విశాఖ  నక్షత్రం వారికి  (పరమైత్ర తార)

దిన ఫలం:-నూతన యంత్ర సామాగ్రి కొనుగోలు చేస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరము. కోపము అధికమై ,వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఏర్పడను. దూర ప్రాంతం నుండి వర్తమానాలు అందుకుంటారు. అన్నదమ్ముల తో మనస్పర్ధలు రాగలవు. వ్యవహారములలో ప్రతికూల ఆలోచనలు కలుగును. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. బాంధవ్యాల విషయాలలో జాగ్రత్త అవసరము. ఓం కుమారాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (పరమైత్ర తార)
అనూరాధ నక్షత్రం వారికి (మిత్ర తార)
జ్యేష్ట నక్షత్రము వారికి (నైధన తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములలో ధన లాభములు పొందగలరు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల మన్ననలు పొందగలరు. దైవ సంబందిత కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అనుకోని అవకాశాలు వచ్చి లాభపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సనాయాసముగా పూర్తి కాగలవు. ఓం గురవే నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (సాధన తార)
పూ.షా  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
ఉ.షా నక్షత్రము వారికి (క్షేమ తార)

దిన ఫలం:-శుభ మూలక వ్యవహారాలకు ధనం ఖర్చు చేస్తారు. ప్రతి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. అధికారులతో పరిచయాలు పెరుగును. అన్ని రంగముల వారు లాభించి రాణిస్తారు. వ్యవహారములలో ఉండే చిక్కులు పరిష్కారమగును. కుటుంబ సౌఖ్యం పొందగలరు. అన్ని విధములుగా ప్రోత్సాహకారముగా ఉండును. ఓం విష్ణువే నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి  (క్షేమతార)
శ్రవణం నక్షత్రం వారికి  (విపత్తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (సంపత్తార)

ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడను. దేవాలయ దర్శనం. వృత్తి వ్యాపారాలలో అధిక ధన లాభం పొందగలరు. ఉద్యోగస్తులకు ఉన్నతి అవకాశాలు. సమాజంలో గౌరవం పలుకుబడి పెరుగును. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వినడం ద్వారా ఆనందము కలుగును. మానసకంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి(సంపత్తార)
శతభిషం నక్షత్రం వారికి  (జన్మ తార)
పూ.భా నక్షత్రం వారికి (పరమైత్ర తార)

దిన ఫలం:-గృహావసర వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవహార ప్రతి బంధకములు తొలగి ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి కాగలవు. గృహ అలంకరణ వస్తువులు నిమిత్తం అధిక ధనము ఖర్చు చేస్తారు. హోదా గల వ్యక్తులతో స్నేహ లాభాలు కలుగును. కళాకారులకు అనుకూలం గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరియు, బుద్ధి కుశలత పెరిగి సకల కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చ)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.భా  నక్షత్రం వారికి (మిత్ర తార)
రేవతి నక్షత్రం  వారికి (నైధన తార)

దిన ఫలం:-పని ఒత్తిడి తట్టుకొని నిలబడ కష్టముగానుండను. వ్యాపారస్తులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించెను చిన్నపాటి నష్టములు రాగలవు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహాలకు గురియగుదురు. ఇచ్చిన ధనము వసూలు అవ్వక ఇబ్బందులకు గురి అవుతారు. చేతి వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. యంత్ర పనిముట్లు తో జాగ్రత్త అవసరం. ఓం రుద్రాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories