MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు

Today Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శుభకార్యాల నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం.

4 Min read
Author : ramya Sridhar
Published : Jun 04 2022, 03:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

పంచాగం

తేది : 04, జూన్  2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : పంచమి రాత్రి.12.46ని.ల వరకు
నక్షత్రం :పుష్యమి సాయంత్రం 06.43ని.ల వరకు
వర్జ్యం : వర్జ్యం లేదు
దుర్ముహూర్తం : ఉదయం 05:28ని.ల నుంచి ఉదయం 07:11ని.లవరకు 
పితృ తిథి పంచమి.
రాహుకాలం : ఉదయం 09:00 ని.ల నుంచి  ఉదయం 10: 30 ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 01:30ని.ల నుంచి మధ్యహ్నం 03:00ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:28 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:27ని.ల వరకు
 

314


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. వ్యాపారాలు హెచ్చుతగ్గులు ఉన్నా మొత్తానికి లాభాలు అందుతాయి. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు.

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక.  కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే చాకచక్యంగా వ్యవహరిస్తారు. శుభకార్యాల నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి వృద్ధి చేస్తారు. కొత్త వస్తువులు, వస్త్రాలు కొంటారు. శుభకార్యాలపై బంధువులతో చర్చలు సాగిస్తారు.అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు.
 

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులను సాఫీగా పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు రావచ్చు.  మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలకు అనుకూలం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు.

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వివాహాది వేడుకల నిర్వహణపై తుది నిర్ణయానికి వస్తారు. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు.

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.కుటుంబసభ్యులతో లేనిపోని విభేదాలు నెలకొని మనశ్శాంతి లోపిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.  వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట.దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు.

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాల దిశగా నడుస్తారు. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు.  స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సహోద్యోగులతో సఖ్యతగా మెలుగుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు, గందరగోళం తొలగుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు మరింత చేరువ కాగలవు.  మిత్రుల సహకారంతో చేయు పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి. స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు సానుకూలత. మిత్రులతో చర్చాగోష్టి. కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు.

1114


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో అపనిందలు . వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. అనవసరమైన పనుల యందు ఆసక్తి కనబరుస్తారు. శారీరక కష్టం. కోర్టు వ్యవహారాలలో నిరాశ.

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.  ఆస్తుల విషయంలో గందరగోళం తొలగి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు కు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
అనవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. అనుకోని ధనవ్యయం. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం.  కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో చోర భయం.
 

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి.  ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved