MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారి రుణబాధల నుంచి విముక్తి

Today Horoscope: ఓ రాశివారి రుణబాధల నుంచి విముక్తి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.  వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట.దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు.

4 Min read
ramya Sridhar
Published : Jun 03 2022, 04:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Horoscope

Horoscope

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

214

పంచాగం

 తేది : 03, జూన్  2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : శుక్రవారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : చవితి రాత్రి.11.06ని.ల వరకు
నక్షత్రం :పునర్వసు సాయంత్రం 04.21ని.ల వరకు
వర్జ్యం : రా.01:28ని॥ నుంచి రా. 02:54 ని॥ వరకు 
దుర్ముహూర్తం : ఉదయం 08:03ని.ల నుంచి ఉదయం 08:55ని.లవరకు తిరిగి మధ్యాహ్నం 12:23ని.ల నుండి 01:15ని.ల వరకు
పితృ తిథి చవితి.
రాహుకాలం : ఉదయం 10:30 ని.ల నుంచి  మధ్యాహ్నం 12: 00 ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 03:00ని.ల నుంచి మధ్యహ్నం 04:30ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:28 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:27ని.ల వరకు

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు జరిగే సూచనలు.కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు.

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.  వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట.దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు.

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
అనవసరమైన గొడవలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో చోర భయం.

614


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలలో చిక్కులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ పరిష్కారమవుతాయి. భూములు కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. సహోద్యోగులతో సఖ్యతగా మెలుగుతారు. మిత్రుల సహకారంతో చేయు పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి. స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు సానుకూలత. మిత్రులతో చర్చాగోష్టి. కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు.

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో అపనిందలు . వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. అనవసరమైన పనుల యందు ఆసక్తి కనబరుస్తారు. శారీరక కష్టం. కోర్టు వ్యవహారాలలో నిరాశ.
 

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి వృద్ధి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి  ధనలాభాలు కలిగే సూచనలున్నాయి. సంఘంలో కీర్తి గడిస్తారు. ఎన్నడో పోగొట్టుకున్న కొన్ని డాక్యుమెంట్లు తిరిగి లభ్యమవుతాయి. అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు. 
 

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  సోదరులు, మిత్రుల ప్రోత్సాహంతో కీలక విషయాలలో ముందడుగు వేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.  జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు.
 

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు
 

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి.  బంధువుల నుంచి ఆస్తిలాభ సూచనలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలకు అనుకూలం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు.

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. సేవాతత్పరతతో కొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం ఉండవచ్చు. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Meaning: క‌ల‌లో ఈ వ‌స్తువులు క‌నిపిస్తే.. శ‌ని దేవుడి ఆశీర్వాదం ఉన్న‌ట్లే, మీ సుడి తిర‌గ‌డం ఖాయం
Recommended image2
Rahu Transit: 2026 లో రాహువు సంచారం... ఈ నాలుగు రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే
Recommended image3
Name Astrology: ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved