వారఫలితాలు జూలై 10 శుక్రవారం నుండి 16 గురువారం 2020 వరకు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి కుటుంబంలో క్లుప్తంగా శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశికి :- ఈ వారం వ్యాపారులకు విస్తరణ ప్రయత్నాలలో విజయం. ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. మిత్రులు అన్ని విధాలా సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. శత్రువులు సైతం అనుకూలురుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనసౌఖ్యం. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. సోదరులతో కలహాలు. ఆర్థికంగా బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు మీకు చేదోడుగా నిలుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిథునరాశి :- ఈ వారం మీ ఆశయాలు నెరవేరేందుకు మిత్రులు సహకరిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా నేర్పుగా ఆకట్టుకుంటారు. కుటుంబంలో క్లుప్తంగా శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త విధులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఈతి బాధలు తొలగుతాయి. కొత్త సంస్థలపై దృష్టి సారిస్తారు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. కుటుంబ సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి:- ఈ వారం ముఖ్యమైన పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం కావచ్చు. కళారంగం వారికి కొద్దిపాటి అవకాశాలు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఎంతటి వారినైనా మీదారికి తెచ్చుకుంటారు. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. బంధువుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. కోర్టు వ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి:- ఈ వారం వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. సోదరులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు, ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతోఅకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి:- ఈ వారం నిరుద్యోగుల ప్రయత్నాలలో కొంత పురోగతి ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో స్థాయి పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. శుభకార్యాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు.వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. ధన వ్యయం. కుటుంబంలో సమస్యలు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి:- ఈ వారం ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో తగాదాలు పరిష్కారం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి:- ఈ వారం శుభకార్యాల నిర్వహణ వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత బాధ్యతలు తప్పవు. పారిశ్రామిక వర్గాలకు పోటీదారులతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు కాస్త నిరాశ తప్పకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి:- ఈ వారం నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. భూసంబంధిత వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. కళారంగం వారికి ఒడిదుడుకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. సోదరులతో మాటపట్టింపులు. కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి మాటసహాయం అందుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి:- ఈ వారం వ్యాపారులకు తగినంతగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా సర్దుబాటు కాగలవు. మీ అంచనాలు ఫలించే సమయం. చేపట్టిన పనులు సమయానికి సాఫీగా సాగుతాయి. అందరిలోనూ తగిన గుర్తింపు పొందుతారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి:- ఈ వారం ప్రముఖులు పరిచయమై మాటసహాయం అందిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహన సౌఖ్యం. ముఖ్య విషయాలలో చర్చలు సఫలమవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి గతం కంటే కాస్త మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రుణదాతలు ఒత్తిడులు తగ్గిస్తారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. బంధువుల ద్వారా ముఖ్య సమాచారం రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి:- ఈ వారం ఆస్తి వివాదాల పరిష్కారంలో మీ చొరవను కుటుంబసభ్యులు ప్రశంసిస్తారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆలోచనలు కొంతవరకు కలిసివస్తాయి. ముఖ్యమైన పనులలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగవర్గాలకు అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి సహాయం అందుకుంటారు. వారం మధ్యలో అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.