Zodiac Signs: ఈ రాశులవారు దేనికీ భయపడరు..!
చాలా మంది నిర్భయంగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఎలాంటి ప్రమాదం ఎదురైనా నవ్వుతూ ఎదుర్కొంటారు. ఎలాంటి తెలియని ప్రదేశంలో అయినా చాలా నమ్మకంగా అడుగులు వేస్తారు

మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది. కొందరికి చీకటి అంటే భయం, మరికొందరికి నీళ్లంటే భయం ఉంటుంది. మరి కొందరు.. ఇంట్లో పెద్దవాళ్లకో, ఆఫీసులో బాస్ కో భయపడతారు. ఇది చాలా కామన్. కానీ.. అసలు భయం అంటే మీనింగ్ తెలియని వాళ్లు కూడా ఉంటారు.వారు జీవితంలో ఎవరికీ భయపడరు... దేనికీ భయపడరు. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం భయం లేకుండా.. జీవించే రాశులేంటో చూద్దాం..
చాలా మంది నిర్భయంగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఎలాంటి ప్రమాదం ఎదురైనా నవ్వుతూ ఎదుర్కొంటారు. ఎలాంటి తెలియని ప్రదేశంలో అయినా చాలా నమ్మకంగా అడుగులు వేస్తారు. చిన్నతనంలో టీచర్స్ ని కూడా ఇబ్బంది పెట్టే వారు కూడా అవుతారు. ఏ విషయంలోనూ భయం కారణంగా వెనక్కి తగ్గరు. మరి, వారేవరో తెలుసుకుందాం.

telugu astrology
1.మేష రాశి..
మేష రాశివారు భయానికి భయపడరు. ఈ రాశిని అంగారకుడు పాలిస్తాడు. వారు సహజంగానే యోధులు. చిన్న తనం నుంచి వారి ధైర్యాన్ని చూపిస్తారు. టీచర్స్ కి కూడా భయపడరు. తరగతి గదిలో చిలిపి పనులు చేయడం, టీచర్స్ చెప్పిన మాట వినకుండా ఎదురుతిరిగి మాట్లాడటం లాంటివి వీరు చేస్తూ ఉంటారు. తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటారు కానీ భయపడరు. వీరికి ధైర్యం చాలా ఎక్కువ. కొత్త ఉద్యోగంలో చేరాలన్నా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా.. వీరితోనే సాధ్యం.
telugu astrology
2.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు పుట్టుకతోనే నిర్భయంగా ఉంటారు. సాధారణంగా ఈ రాశివారు నిశ్శబ్దదంగా ఉంటారు.ఎవరు ఎంత బెదిరించినా తొందరగా తొణకరు, బెనకరు. ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు. ఏ విషయంలోనూ భయపడరు.మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు పక్కన వృశ్చిక రాశివారు ఉంటే చాలు. సమస్య నుంచి భయటపడతారు.
telugu astrology
3.సింహ రాశి..
సింహ రాశిని సూర్యుడు పరిపాలిస్తాడు. ఈ రాశివారు కూడా తొందరగా దేనికీ భయపడరు. చిన్న తనంలో కూడా క్లాస్ లో లీడర్ గా ఉంటారు. టీచర్లకు భయపడరు. సింహ రాశి వారు నిర్భయులు. వారు శ్రద్ధతో అభివృద్ధి చెందుతారు.జీవిత ప్రయాణంలో ఇబ్బంది కలిగినా కూడా, వెలుగులోకి వచ్చేంత ధైర్యంగా ఉంటారు. ఉపాధ్యాయులు వారిని ప్రేమిస్తారు. కానీ వీరి ధైర్యం చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
telugu astrology
4.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు కూడా చాలా సాహసంగా ఉంటారు. ఎలాంటి అడ్వెంచర్లు చేయాలాన్నా వీరు ముందుంటారు.వారు చేయాలి అనుకున్నది చేస్తారు. దేనికీ భయపడరు. ఎలాంటి రిస్క్ తీసుకోవాలన్నా ముందుంటారు. ఫలితానికి భయపడరు. వారు చేయాలి అనుకున్న పని చేయాల్సిందే.