Astrology: జ్యోతిష్యం ప్రకారం పరీక్ష, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఇలా చేస్తే సక్సెస్ మీదే..!
మీకు నచ్చిన ఉద్యోగం లేదా పరీక్షలో మంచి మార్కులు రావట్లేదా? అన్ని రకాలుగా ట్రై చేసి అలిసిపోయారా? అయితే మీకోసమే ఈ టిప్స్. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ అడ్డంకులను దాటి సక్సెస్ ను సొంతం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలెంటో చూసేయండి.

చాలాసార్లు ఎంత ప్రయత్నించినా నచ్చిన ఉద్యోగం దొరకదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా జీతం సరిగ్గా ఉండదు. కొందరు పరీక్షలకు ఎంత ప్రిపేర్ అయిన రిజల్ట్ మాత్రం ఉండదు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

పెద్దల ఆశీర్వాదం
సాధారణంగా మనం పరీక్షలకు, ఇంటర్వ్యూలకు, లేదా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు హడావిడాగా వెళ్తుంటాం.కానీ జ్యోతిష్యం ప్రకారం బయటికి వెళ్లే ముందు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోవాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు వెళ్లిన పని సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుందని నమ్మకం.
ఇంటి గుమ్మానికి..
సక్సెస్ మీ వెంట రావాలంటే ఏదైనా పనిమీద బయటకు వెళ్లే ముందు ఇంటి గుమ్మం దగ్గర కొన్ని మిరియాలు చల్లండి. వాటిపై నుంచి నడుచుకుంటూ వెళ్ళండి. వెనక్కి తిరిగి చూడకండి.
స్వీట్
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా పని మీద బయటికి వెళ్లే ముందు స్వీట్ తిని వెళ్లండి. ఇది సక్సెస్ ఇస్తుంది. మీ జీవితాన్ని మరింత స్వీట్ గా మార్చేస్తుంది.
నిమ్మకాయలో..
పని మీద బయటికి వెళ్లే ముందు ఒక నిమ్మకాయలో నాలుగు లవంగాలు గుచ్చి ఈశాన్య దిక్కులో పెట్టి వెళ్ళండి.
తులసి ఆకులు
జ్యోతిష్యం ప్రకారం సక్సెస్ కోసం బయటికి వెళ్లే ముందు 5 తులసి ఆకులు తిని నీళ్లు తాగండి. లేదా ఒక స్పూన్ నెయ్యిలో కొంచెం చక్కెర కలిపి తిని వెళ్ళండి. ఇది సక్సెస్ ఇస్తుంది. ఆవుకు పచ్చ గడ్డి తినిపించండి. ఇది కూడా మీ విజయానికి సహాయపడుతుంది.

