ఈ రాశులవారు ది బెస్ట్ తండ్రులు..!
పిల్లలకు అన్ని అవసరాలను అందించి.. బాద్యతగా పెంచేవారిని మంచి తండ్రిగా చెప్పొచ్చు. జోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటి రాశులు ఉన్నాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం..

father
పిల్లల బాద్యత కేవలం తల్లి మీద మాత్రమే ఉండు. తండ్రిపై కూడా ఉంటుంది. పిల్లలను పెంచడంలో.. తల్లిదండ్రులు ఇద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. పిల్లల జీవితంలో తండ్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పిల్లలకు తల్లి సంరక్షణ ఎంత ముఖ్యమో.. వారి శారీరక, మానసిక అభివృద్ధికి తండ్రి కూడా అంతే ముఖ్యం. పిల్లల ఆరోగ్యకరమైన భావోద్వేగ అభివృద్దికి తండ్రి ఉనిఖి చాలా ముఖ్యం. అయితే.. పిల్లలకు అన్ని అవసరాలను అందించి.. బాద్యతగా పెంచేవారిని మంచి తండ్రిగా చెప్పొచ్చు. జోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటి రాశులు ఉన్నాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం..
మేష రాశి...
జోతిష్య శాస్త్రంలోని అన్ని రాశులలో మొదటిది మేష రాశి. ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తమ పిల్లలను కూడా గొప్ప నాయకుల్లా మార్చగలరు. నిజాయితీ, దృఢత్వం, ఆశయాలు వీరికి ఎక్కువ. ఇవే లక్షణాలు పిల్లలకు కూడా ఉండేలా చూస్తారు. పిల్లలతో చాలా ఆప్యాయంగా ుంటారు. పిల్లలకు రక్షణగా నిలుస్తారు. ది బెస్ట్ తండ్రిగా ఈ రాశి వారిని చెప్పొచ్చు.
సింహ రాశి..
సింహ రాశివారు రాజుల్లా ఉంటారు. వీరు చాలా ధృఢంగా ఉంటారు. వీరి మనసు చాలా బాగుంటుంది. వీరు చాలా విధేయులుగా ఉంటారు. సింహ రాశి పురుషులు చాలా ఔదార్యంగా ఉంటారు. వీరికి ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువ. పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇలాంటి తండ్రి ఉంటే.. పిల్లలు చక్కగా పెరగగలరు అన్నట్లుగా ఉంటారు.
కన్య రాశి..
కన్య రాశి పురుషులు ఆచరణాత్మకంగా ఉంటారు. చాలా చురుకుగా ఉంటారు. ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించగలరు. గొప్ప ఆలోచనా పరుచులు. పిల్లల విషయంలో చాలా శ్రద్దగా ఉంటారు. సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు. ఉత్తమ తండ్రులుగా ఉంటారు. పిల్లలకు ఎప్పుడూ ఆర్థికంగా అండగా ఉంటారు. వారు కూడా ఆర్థికంగా మంచిగా ఎదిగేలా చేస్తారు.
వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా ఆప్యాయంగా ఉంటారు. పిల్లలతో చాలా ప్రేమగా ఉంటారు. అన్ని విషయాల్లోనూ పిల్లలకు రక్షణగా నిలుస్తారు. ఈ రాశివారు గొప్ప తండ్రిగా నిలుస్తారు. కుటుంబ విలువలు వీరికి చాలా ఎక్కువ. పిల్లలను చాలా ప్రేమగా పెంచుతారు.
మకర రాశి..
ఈ రాశివారు కూడా ది బెస్ట్ తండ్రిగా చెప్పొచ్చు. వీరికి బాధ్యతలు తీసుకోవడం ఎక్కువ ఇష్టం. ఆ బాధ్యతలు తీసుకోవడంతోనే వీరిని మంచిగా చేస్తుంది. తమ ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయిస్తారు. తమ వారికోసం ఏదైనా చేస్తూ ఉంటారు. వీరు పిల్లలను బాగా పెంచుతారు. ఈ రాశివారికి ది బెస్ట్ తండ్రి అని చెప్పొచ్చు.