MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Monthly Horoscope: ఓ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం

Monthly Horoscope: ఓ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ నెలలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు సమకూరుతుంది. 

5 Min read
Author : ramya Sridhar
Published : Aug 01 2022, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలు అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పినవి మాత్రమే. మీకు పూర్తి స్దాయి ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది,సమయం తీసుకుని జాతక చక్రం వేయించుకోండి.సమస్యలు ఉంటే రెమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. చక్కటి తరుణోపాయలతో శుభ ఫలితాలను పొందగలరు. 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈ నెల మీకు కొన్ని ప్రత్యేకమైన శుభ ఫలితాలు తెచ్చి పెడుతుంది.  లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు సమకూరుతుంది. కొంతమేర రుణములు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.  వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడును. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. తలపెట్టిన పనులలో జాప్యం ఏర్పడును. మాసాంతంలో స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు.

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ నెలలో  గ్రహాల సంచారం అనుకూలంగా వుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సన్నిహితుల సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ధనాధాయ మార్గాలు బాగుంటాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు. శుభకార్యాల ప్రస్తావన. పోయిన వస్తువులు తిరిగి లభించును. సంఘంలో గౌరవం. ఉద్యోగ అభివృద్ధి. అధికారుల యొక్క మన్నన. దేవాలయ సందర్శన. రుణాలు తీరి ఊరట చెందుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్థి క్రయవిక్రయాల యందు జాగ్రత్తలు వహించవలెను. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.
 

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ నెలలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు సమకూరుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం. అనుకోని అవకాశాలు లభిస్తాయి.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈనెల ఈ రాశి వారికి జీవన విధానం సాఫీగా సాగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.  ఆర్థిక లావాదేవీలతో తీరిక వుండదు. ఖర్చులు విపరీతం. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. అవసరమైన మేరకు ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు డబ్బు వెచ్చిస్తారు. దూర ప్రయాణాలలో ఆకస్మిక ధన లాభం. వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలెను. స్థిరాస్తి క్రయవిక్రయాలలో జీవిత భాగస్వామితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలెను. రుణ బాధలు తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. తలపెట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గృహం నందు శుభకార్యా చరణ. విందు వినోదాల్లో పాల్గొంటారు.
 

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ నెల మీకు అన్ని విధాల కలిసి వస్తుంది. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. శ్రమకు మించి ఫలితం లభిస్తుంది. సంతాన ప్రయత్నాలు ఫలించును. గృహం నందు పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారం నందు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు. గృహం నందు ప్రతికూల వాతావరణం. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు. శారీరక శ్రమ.
 

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ నెలలో మీరు ఊహించని కొన్ని విషయాలు తెలుసుకుంటారు. మొదట్లో కంగారు పెట్టినా  అవి అంతిమంగా మీకు మేలు చేస్తాయి. సంతానం మూలకంగా లాభాలు. కొంతమేర రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్యముల నుండి ఉపశమనం పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణముల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలలో ఆటంకాలు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం. సంఘం నందు గౌరవ ప్రతిష్టలు.
 

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ నెల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘం నందు గౌరవ ప్రతిష్టలు. సన్నిహితుల సహకారం లభిస్తుంది.  ఆర్థికంగా బాగున్నా సంతృప్తి వుండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. రుణ బాధలు తీరి ఊరట పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి క్రయవిక్రయాలను వాయిదా వేసుకోవడం మంచిది. సంతాన అభివృద్ధి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు పై అధికారులతో చిక్కులు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మాసాంతంలో ఆకస్మిక ధన లాభం.

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ నెల ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులలో సమస్యలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. సంతానం యొక్క అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. గృహములందరు ప్రతికూల వాతావరణం. భూముల క్రయవిక్రయాలలో ఆచితూచి వ్యవహరించవలెను. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. రావలసిన బాకీలు వసూలగును. కొంతకాలం నుండి ఇబ్బంది పడుతున్న సమస్యల నుండి కొంతమేర ఉపశమనం లభిస్తుంది.
 

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ నెల మొదట్లో కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పటికీ మధ్య నుంచి అన్ని సర్దుకుంటాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడును. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుండి గుర్తింపు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ నెలలో కొద్ది పాటి మార్పులు ,చేర్పులతో  ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వృద్ధి కోసం తగు నిర్ణయాలు తీసుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించును. అనవసరమైన ఖర్చులు. గృహ నిర్మాణ ఆలోచనలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. సంతాన మూలకంగా లాభాలు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం.
 

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి.  మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. సన్నిహితుల ప్రోత్సాహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సఫలీకృతం. రుణాలు తీరి కొంతమేర ఉపశమనం పొందుతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. పాత మిత్రులను కలిసి ఆనందంగా  గడుపుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. వస్తు వాహన సౌఖ్యం. ప్రయాణాల్లో లాభాలు. చేతి వృత్తుల వారికి ధన లాభం. రావాల్సిన బకాయిలు వసూలగును.
 

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన పదోన్నతులు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహము నందు శుభకార్యాచరణ. కుటుంబ వృద్ధి కోసం తగు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. రుణ బాధలు తొలుగుతాయి. సంఘంలో తగిన గుర్తింపు లభించును.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
November 2026 Horoscope: నవంబర్ లో ఈ రాశులవారికి అదృష్టం! డబ్బు, ఉద్యోగం, పెళ్లి విషయంలో శుభవార్తలు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ 3 రాశులవారికి చిన్ననాటి మిత్రులతో వివాదాలు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved