MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Old Smart Phone to CC Camera: మీ పాత స్మార్ట్ ఫోన్ ని.. సీసీ కెమేరాగా మార్చేయచ్చు.. ఎలానో తెలుసా?

Old Smart Phone to CC Camera: మీ పాత స్మార్ట్ ఫోన్ ని.. సీసీ కెమేరాగా మార్చేయచ్చు.. ఎలానో తెలుసా?

 Old Smart Phone to CC Camera: ఇంటి భద్రత కోసం.. చాలా మంది ఇంట్లో సీసీ కెమేరాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ, సీసీ కెమేరా కొనాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఖర్చు లేకుండా.. పాత ఫోన్ ని సీసీ కెమేరాలా మార్చేయచ్చు. అదెలాగో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 29 2026, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Smart Phone to CC Camera
Image Credit : Chat GPT

Smart Phone to CC Camera

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడకునే వరకు ఫోన్ తోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే.. చాలా మంది మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ రాగానే.. దానిని కొని.. తమ పాత ఫోన్ ని పక్కన పడేస్తూ ఉంటారు. కానీ.. మీరు పక్కన పడేసిన పాత ఫోన్ ని.. మీ ఇంటిని భద్రంగా ఉంచుకోవడానికి సీసీ కెమేరాను తయారు చేసుకోవచ్చు. కేవలం కొన్ని సింపుల్ పద్దతులతో స్పెషల్ గా సీసీ కెమేరా కొనాల్సిన అవసరం లేకుండా.. పాత ఫోన్ ని మీకు ఉపయోగపడేలా మార్చుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు...
Image Credit : our own

ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు...

దీని కోసం.. మీరు పాత ఫోన్ లో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా.. మీ ఫోన్ లో స్టోరేజ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం.. ఫోన్ లో పనికిరాని యాప్స్ అన్నీ తీసేయాలి. మీ పాత ఫోన్ స్లోగా పనిచేస్తుంటే...దానిని రీసెట్ చేయాలి. అప్పుడు మళ్లీ మంచిగా పనిచేస్తుంది. తర్వాత మీ ఫోన్ ను వైఫై కి కనెక్ట్ చేసి, దాని కెమేరా, మైక్రో ఫోన్, ఇంటర్నెట్ సరిగా పనిచేస్తున్నాయో లేదో సరి చూసుకోవాలి.

సెక్యూరిటీ కెమేరా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి..

మీ ఫోన్ సీసీ కెమేరాలా పనిచేయాలి అంటే.. దానిలో ఒక సెక్యూరిటీ యాప్ ని డౌన్ లోడ్ చేయాలి. మార్కెట్లో చాలా రకాల యాప్స్ ఉన్నాయి. వాటిలో ఏది డౌన్ లోడ్ చేసినా మీ ఫోన్ సీసీ కెమేరాలా పని చేస్తుంది. మీ పాత ఫోన్ కెమేరాలా పనిచేస్తే.. అందులో రికార్డు అయిన దానిని చూడటానికి మీ ప్రెజెంట్ ఫోన్ ని దానికి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు ఫోన్ లని ఒకే యూజర్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి.అప్పుడు పాత ఫోన్ కెమేరాలా పనిచేస్తే.. మీరు ఇప్పుడు వాడుతున్న ఫోన్ లో ఎక్కడి నుంచి అయినా లైవ్ ఫుటేజ్ చూడటానికి వీలుగా ఉంటుంది.

34
కెమేరాను ఉంచే ప్రదేశం...
Image Credit : stockPhoto

కెమేరాను ఉంచే ప్రదేశం...

మెరుగైన భద్రత కోసం.. మీ ఫోన్ ని ఉంచే ప్రదేశం చాలా ముఖ్యం. మీ ఫోన్ కాస్త ఎక్కువ ఎత్తులో ఉండేలా సెట్ చేయాలి. ముఖ్యంగా.. ఇంటి మెయిన్ డోర్, బాల్కనీ ఇలా.. మీకు ఎక్కడ భద్రత అవసరమో.. అక్కడ సెట్ చేయాలి. కాస్త ఎత్తులో పెడితే.. మీకు టోటల్ ఫుటేజ్ చూడటానికి వీలుగా ఉంటుంది.

విద్యుత్ సరఫరా..

అయితే.. మీరు సీసీ కెమేరా కోసం అమర్చిన ఫోన్ నిరంతరం ఆన్ లో ఉంటుంది. దీని వల్ల మీ ఫోన్ బ్యాటరీ తొంరదగా అయిపోయే అవకాశం ఉంది. అందుకే ఫోన్ కి ఎప్పుడూ ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. అందుకే.. ఆ వెలుసుబాటు కూడా ఉండేలా చూసుకోవాలి.

44
మోషన్ డిటెక్షన్ ఫీచర్ వాడాలి..
Image Credit : Getty

మోషన్ డిటెక్షన్ ఫీచర్ వాడాలి..

చాలా సెక్యూరిటీ యాప్స్ లో మోషన్ డిటెక్షన్ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ కెమేరా ముందు ఎవరైనా కదిలితే.. వెంటనే రికార్డు చేయడం మొదలుపెడుతుంది. దీని వల్ల స్టోరేజ్ ఆదా అవుతుంది. ముఖ్యమైన ఫుటేజ్ మాత్రమే రికార్డు చేస్తుంది. అంతేకాదు.. ఫోన్ ని సీసీకెమేరాలాగా వాడటం వల్ల వీడియో మాత్రమే కాకుండా.. ఆడియో కూడా రికార్డు అవుతుంది. ఇంట్లో కేవలం పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఎక్కువ స్టోరేజ్ కావాలంటే...

ఫోన్ ని సీసీకెమేరా కోసం వాడుతున్నాం అంటే.. కాస్త స్టోరేజ్ చాలా ఎక్కువగా అవసరం రావచ్చు. దాని కోసం.. మీరు క్లౌడ్ స్టోరేజ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల మీరు రికార్డు చేసిన వీడియోని స్టోర్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ బాగుంటే.. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు వీడియో ఫుటేజ్ చూడటానికి వీలు ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Bike Seat: బైక్ వెనక సీటు ఎత్తుగా ఎందుకు ఉంటుంది..? స్టైల్ అయితే కాదు, కారణం ఇదే
Recommended image2
Kids Clothes Reuse: పిల్లల బట్టలు పొట్టిగయ్యాయని పారేస్తున్నారా? ఇలా వాడేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved